Posts

Showing posts from 2018

Mr.Keerthi 4th Episode || JS Productions || Manamjanam

Image

Mr.keerthi ||Episode-2 muddapapu chicken ||

https://www.youtube.com/watch?v=1sXgG6CKIRw&t=37s

amruthavani episode 1(Vinayaka Pooja vidhanam in telugu)

Image

kaushal fan frustration ( FASAK)

Image

JAGGU BHAI IN KUKATPALLI REASTAURENT

Image

JANA SENA 1ST M.LA PITHANI BALAKRISHNA SPEECH

Image

మీ రచనలని (ఆర్టికల్స్,వ్యాసాలు,కథలు) పబ్లిష్ కావాలనుకుంటున్నారా ?

హాయ్ గుడ్ మార్నింగ్ ! మీ రచనలని (ఆర్టికల్స్,వ్యాసాలు,కథలు) పబ్లిష్ కావాలనుకుంటున్నారా ? సంఘంలో జరిగే అవినీతి,అన్యాయాలను ఎండగట్టాలనుకుంటున్నారా ? ఐతే మీకు ఇది  గోల్డెన్ ఛాన్స్ ! కానీ ,ఆ రచనలు మీ సొంతవి,ఎక్కడ కాపీచేయలేదని హామీ ఇవ్వాలి . వాటిలో మాకు నచ్చినవాటిని ఎంపికచేసి మా వెబ్ సైట్ లో ప్రచురిస్తాం ... ప్రచురించాలా  వద్దా అనేది "మానేజిమెంట్ దే తుది నిర్ణయం" ఇంకెందుకు ఆలస్యం ..మీ రచనలని పంపవలిసిన మెయిల్ id : wethepeople@manamjanam.info  

జవాబు లేని ప్రశ్న ?

Image
రిజర్వేషన్ ఇవ్వడానికి తమకు ఇబ్బంది లేదని ,కానీ ఇస్తే అన్ని కుల,వర్గాలు వారికీ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ,వ్యాపారాలు,పెద్ద పెద్ద సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని " నితిన్ గడ్కరీ" అన్నారు . దాన్ని అదును గా చూసి 'రాహుల్ గాంధీ' ఒక అడుగు ముందుకు వేసి "మంచి ప్రశ్న  వేశారు ,దేశం అంతా  అదే ప్రశ్న ఎప్పటినుంచో అడుగుతున్నారు ,"మీరు(భారతీయ జనతా పార్టీ ) మాత్రమే బదులివ్వవలిసిన ప్రశ్న " ఇది అని చురక అంటించారు . మా  ప్రభుత్వం వచ్చాక చాలా  ఉద్యోగాలు వచ్చాయని చెప్పే "మోడీ" సర్కార్  ఇప్పుడు ఏమి చెబుతారో ? "జి ఎస్ టి " లాంటివి వల్ల  చాలా చిన్న  కంపెనీలు దెబ్బతిన్నాయి ,దాని ద్వారా సుమారు 5000 మంది  గుజరాత్ లోనే ఉపాధి కోల్పోయారు అనేది నిజం . మరి ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో జరిగితే ,యువతకి ఉపాధి ఏది ? నేను 'జి ఎస్ టి' కి వ్యతిరేకం కాదు ,కానీ దానికి ప్రత్యామ్యాయం ఏమిటి అనేది చూడాలి .  యువత కి ఉపాధి లేకపోతె వారు పక్కదోవ పట్టి వారి జీవితాలను నాశనం చేసుకుంటారు .  అలా చూడటం మీకు ఇష్టమా ? ఎన్నికలు వస్తున్నాయని హడావిడి గా పథకాలు ప్రకటించే

సర్కార్ కి ప్రేమ!

Image
ఈ మధ్య  సర్కార్ కి  ప్రజలు మీద ప్రేమ విపరీతంగా  పెరిగిపోయింది. వారికీ అన్న కాంటీన్,నిరుద్యోగ భృతి  ఇలా అన్ని ప్రజాఉద్ధరణే !! అంతవరకూ బాగుంది కానీ దాన్ని అమలు బాగా లేదు ,మన డబ్బు ఖర్చు చేస్తే ఎంత జాగ్రత్తగా చేస్తాం ,అదే మాదిరి  ప్రజాధనం కూడా చేయాలి . వృధా చేయకండి . ఒకటి  రెండు రోజులు పొరపాట్లు సహజం ,అవి సరి దిద్దికోవాలి . అదే పనిగా తప్పులు చేస్తే మన డబ్బు వృధా ,మీ ప్రతిపక్షానికి ఊతం ఇచ్చిన వారు అవుతారు .  మంచిని ఎవరైనా ప్రోత్సహిస్తారు ,కానీ ... ఇన్నాళ్లు లేని వల్లమాలిన ప్రేమ ఇప్పుడు ఎందుకో ? ఓహ్ దగ్గర్లో ఎన్నికలు ఉన్నాయని ఇప్పుటి నుంచే  ప్రజలకి బిస్కట్ వేస్తున్నారా? హడావిడిగా పథకాలు అమలు చేస్తునట్టు ఉంది! కాదు మాది చేతల ప్రభుత్వం అంటే మరి ఈ నాలుగు సంవత్సరాలు ఏమి చేసారు ? ప్రత్యేక హోదా లేక ప్యాకేజీ పై ఏమి తేల్చారు ? పోలవరం పూర్తి అవుతుందా? మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ? ఎన్ని కంపెనీ లు వచ్చాయి ,పెట్టుబడులు ఎంత సాధించారు ? కాపు రిజర్వేషన్ ఏమి తేల్చారు ,కేంద్రాన్ని  ఎన్ని రోజులు సాకు చూపుతారు ? మేనిఫెస్టో లో ఉన్న అన్ని హామీలు అమలు చేసారా

ఒకే ఒక్కడు ...

Image
ఒకే ఒక్కడు ...  ఇంగ్లాండ్ తో జరిగుతున్న మొదటి టెస్ట్ లో భారత్  తడబడి  నిలబడింది .  వంద పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి చాప చుట్టే సమయంలో "విరాట్ కోహ్లీ " ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు,కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు . విరాట్ పోరాడి 149  పరుగులు చేసి,భారత్  274 పరుగులకి ఆల్ అవుట్ అయ్యింది . దీనితో ఇంగ్లాండ్ కి స్వల్ప ఆధిక్యం లభించింది .  . ఒక వైపు వికెట్లు పడిపోతున్న మొండిగా మరొక ఎండ్ లో బ్యాటింగ్ కొనసాగించాడు, మిగిలిన వారినుంచి  పూర్తి సహకారం అందకపోయినా ఏంతో సహనంగా కొన్ని బంతులు వదిలేసి,మరి కొన్ని డిఫెన్స్ ఆడి  ,చెత్తబంతులు బౌండరీలుగా మలిచాడు ,ఇంగ్లాండ్ బౌలర్లు బాగా విసిగించారు .ఈ ప్రయాణం లో హార్దిక్ పాండ్య 22 పరుగు చేసి బౌల్డ్ గా  వెనుతిరిగాడు .  దీనితో ఇంగ్లాండ్ ఫై మొదటి సెంచరి చేసి తన సత్తా చాటాడు  కోహ్లీ 42 పరుగుల వద్ద అంతర్జాతీయ క్రికెట్ లో ఏడు వేల  పరుగులు సాధించాడు ,దీనితో 7 వేల పరుగులచేసిన కెప్టెన్ లో మూడవవాడు గా నిలిచాడు .  సెంచరి  చేసిన తరువాత  తన చొక్కాలోని "రింగ్" తీసి ముద్దాడి ,తన భార్య అనుష్క శర్మ వైపు బ్యాట్ చూపి గాల్లో ముద్దులు గుప్పించాడు . 

మధురం మధురం ...

Image
మధురం మధురం ... సెల్ ఫోన్ మధురం మాటలు మధురం పాటలు మధురం ఆటలు మధురం ... వాట్సాప్ మధురం ఎఫ్ బి  మధురం చాటింగ్ చేసె మీరు మధురం .... దూరం దగ్గర చేసే సెల్ఫోన్  మధురం (షాక్ సినిమా స్ఫూర్తి తో )

"ఆ సినిమాకి" ఇప్పుడే ఇంత క్రేజా !!

Image
విశ్వవిఖ్యాత నట సార్వ భౌముఁడు శ్రీ  నందమూరి తారక రామా రావు గారి   బయోపిక్ "ఎన్ .టి .ఆర్ "చిత్రం తెరకెక్కుతుంది .దీనికి అతనికి కుమారుడు "బాలకృష్ణ" లీడ్ రోల్ చేస్తున్నారు . ముఖ్యపాత్రలో "విద్యాబాలన్ "నటిస్తున్నారు . క్రిష్ దర్శకత్వము వహిస్తున్నారు . ఇప్పటికి ఒక షెడ్యూల్ కూడా పూర్తిఅయింది . ఈ చిత్రం షూటింగ్ దశలోనే మంచి అంచనాలు ఉన్నాయి ,దానికి తోడు ఇప్పుడు మరో ఆసక్తి కరమైన విషయం బయటకి వచ్చింది . ఈ చిత్రం యొక్క పూర్తి హక్కుల కోసం రిలయన్స్ ,సోని లాంటి దిగ్గజాలు పోటీపడుతున్నాయని దానికి సుమారు 85 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్దపడ్డాయని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఇది ఎంతవరకు నిజమో గాని కానీ "సినిమాకి రిలీజ్ కి ముందే మంచి క్రేజ్,బిజినెస్   ఏర్పడింది",పూర్తి అయ్యే లోపు ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ,దానితో  చిత్రం  ఇంకా ఎన్ని  రికార్డులు కొల్లగొడుతుందో !! వేచి చూద్దాం ...

"తెలుగు కంటెంట్ రైటర్"ఉద్యోగం కోసం చూస్తున్నారా ?

Image
మీలో ఎవరైనా "వ్రాయడం " కెరీర్ గా ఎంచుకుంటున్నారు ? మీకు "తెలుగు కంటెంట్ రైటర్" గా ఉద్యోగం కోసం చూస్తున్నారా ? ఆ ఉద్యోగాలు ఎక్కడ వెతకాలో తెలియడం లేదా ఐతే క్రింద ఉన్న లింక్ కి వెళ్లి చూసి నచ్చితే అప్లై చేయండి ! https://www.naukri.com/telugu-content-writer-jobs https://www.quikr.com/jobs/telugu-content-writer+zwqxj2726005330 శుభం భూయాత్ !!

అలోచించి మాట్లాడండి !!

Image
మన రాజకీయనాయకులు ఈ మధ్య అనవసరంగా  కొన్ని  విషయాలు  ప్రాధాన్యం ఇస్తున్నారు . మేము రాజకీయాల్లోకి ప్రజల సేవకోసం వచ్చామని  ,ఇంకా ఎదో సొల్లు చెప్పి మీటింగుల్లో మాటలతో దంచికొడతారు . గెలిచిన తరువాత సరిగ్గా ఒకడు కూడా వారి సొంత జిల్లా గాని,ఊరిలో గాని తిరిగి వారి సమస్యలు తీర్చడానికి  ప్రయత్నం చేయరు ,కానీ వేరే వారి  వ్యక్తిగత జీవితాలు గురించి మాట్లాడటం ఐతే తెలుసు . విమర్శలు చేయడం రాజకీయాల్లో సహజం కానీ మరి ఇంత దిగజారి చేస్తే మీరే ఇరుకునపడతారు . అపహాస్యం అవుతారు దానికి వారి సొంత పార్టీలోనే వ్యతిరేకత ఏర్పాడుతుంది .  తరువాత  ఎన్నికలకి వెళితే మీ ముఖం కూడా చూడటానికి కూడా జనం ఇష్టపడరు . "ఎవడికో ఎంతమంది పెళ్ళాలు  ఉన్నారు",  వీళ్ళకి  కావాలి ,గాని వీరికి నీతి న్యాయం ఉండదు.  తండ్రి పేరు చెప్పుకొని ఒకడు ,మామ పెట్టి న పార్టీలు తో మరొకడు మనుగడ సాగిస్తున్నారు  గాని  వాళ్ళమీద ఎన్ని కేసులు ఉన్నాయో ఎవరికి  తెలియదు .ప్రతి శుక్రవారం వెళ్లి కోర్టులో సంతకాలు పెట్టాలి ఒక సర్ . సుమారు రెండువేల కిలోమీటర్లు పాద యాత్ర చేసారు ,ఏమి సాదించారు ? కనీసం ఆ ప్రాంతాల్లో ఉండే ప్రధాన సమస్య ప్రభుత్వం చేరాలా చర్

ఆంధ్రకు కేంద్రం అన్యాయం చేసిందా ?

Image
అవుననే చెప్పాలి ఎందుకంటే విభజన చట్టంలో ఆంధ్రకు "స్పెషల్ స్టేటస్" ఇవ్వాలి అని తీర్మానం చేసారు , కానీ తరువాత ఎన్నికల్లో గెలిచిన  భాజపా మాత్రం ఆ మాట తుంగలో తొక్కింది . 14వ ఆర్థికసంఘం సలహా మేరకు ఏ రాష్ట్రాన్నికి  "ప్రత్యేక హోదా" ఇవ్వరాదని తేల్చింది . దానికి తగ్గట్టు నిధులు ఇస్తామని చెప్పారు, అదికూడా అమలు కావడం లేదు . ఇక్కడ ఒక విషయం గమనిస్తే అప్పటి కాంగ్రెస్ పార్లమెంట్ లో బిల్ పెడితే భాజపా మద్దతు ఇచ్చి "5 కాదు పది సంవత్సరాలు "ఇవ్వాలని వెంకయ్యనాయుడు గారు పోరాడారు, కానీ తీరా వీరు గెలిచాక ఆర్థికసంఘంతో ముడి పెడుతున్నారు ,ఇది అప్పుడు లేదా? లేకపోతె కేంద్రాన్ని ప్రాంతీయ పార్టీలు ఏమి చేయలేవు అనే ధీమానా ?? ఇది  ఎంతవరకు  సబబు . ఒక ప్రధాని ని ఇచ్చిన వాగ్దానాన్ని మరొక ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా పక్కన పెట్టింది అంటే మన పార్టీలకి రాజ్యాంగం మీద ఎంత గౌరవమే  తెలుస్తుంది వెంకయ్య గారు ఉపరాష్ట్రపతి గా ఉన్నా దీనిపై స్పందించకపోవడం శోచనీయం . ఓట్లు కోసం కాళ్ళు పడతారు ,ఓట్లు వేసాక ఆ కాళ్ల ని లాగేస్తారు "అవసరం  ఉంటె కాళ్ళు ,లేకపోతె జుట్టు పట్టుకున్నట్టు ఉంది" 

ఆంధ్ర ప్రదేశ్ తో కేంద్రం "అవిశ్వాసం తీర్మానం "గెలిచింది !

Image
ఇన్నాళ్లు తెలుగు దేశం ,వై సి పి ,మిగతా పార్టీలు రాష్ట్ర విభజన సరిగా జరగలేదు ,దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ,  ఇప్పటి ప్రభుత్వం భాజపా "స్పెషల్ స్టేటస్ "ఇవ్వలేదని వారిమీదికి మీద తోసేశారు ,కానీ దీనికి సమాధానం గా మొన్న పార్లమెంట్ లో బిజెపి ఎదురుదాడి చేసింది . తెలుగు దేశం తో సహా వామ పక్షాలు కి  కౌంటర్ గా  బిజెపి కి అవిశ్వాసం తీర్మానం పెట్టింది . దానికి మోడీ సహా అందరు కలిసి అవిశ్వాసం గెలిపించారు ,సహజంగా ఎక్కువ సభ్యులు ఉన్నవారు గెలుస్తారు అదే జరిగింది . కొన్ని రాష్ట్రాలు మనకి మద్దతు ఇవ్వలేదు, కొందరు దూరం గా ఉన్నారు . ఇన్నాళ్లు మౌనం గా ఉన్న "మోడీ" పార్లమెంట్లు లో "స్పెషల్ కేటగిరి స్టేటస్ ఇవ్వడం కుదరదని దాని స్థానం లో "స్పెషల్ ప్యాకేజీ " ఇస్తామని చెబితె ఆంధ్ర ప్రభుత్వం "చంద్రబాబు " సరే అన్నారని "ఆరోపించింది .దానికి "చంద్రబాబు "ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిన ఫలితం లేదు . మరి ఎవరి   లోపాలవల్ల మనకి "స్టేటస్ "రాలేదు ??

మీ కెరీర్ ఏమి ఎంచుకున్నారు ?

Image
హలో  మిత్రులారా !! మీకు బ్లాగ్ రాయడం హాబీ నా లేక సరదాగా రాస్తారా ? మీ కెరీర్ ఏమి ఎంచుకున్నారు ? మీలో  ఎవరైనా రచయితలు   ఉద్యోగ అవకాశాలు కోసం చూస్తూ ఉంటె నాది  చిన్న విన్నపం .  ఈ లింక్ లో "కంటెంట్ రైటర్స్-తెలుగు ,ఇంగ్లీష్  " అవకాశాలు ఉన్నాయి,చూసి నచ్చితే మీ బయో-డేటా పంపండి  https://www.naukri.com/telugu-content-writer-jobs.  అలాగే  https://www.quikr.com/jobs/telugu-content-writer-jobs-in-hyderabad+hyderabad+zwqxj4157493934 శుభం భూయాత్ .... 

పెద్ద పొరపాటు !!

Image
మనం ఏదైనా పని చేసేముందు కొంచెం బెరుకు ఉంటుంది ,అదే సాధిస్తామా లేదా  అనే చిన్న భయం వెంటాడుతుంది .కానీ ప్రయత్నం కూడా సరిగ్గా చేయకుండా ఫలితం ఆలోచించకూడదు . నువ్వు చేసి ప్రయత్నం పట్టుదలగా,త్రికరణ శుద్ధిగా చేస్తే నీదే విజయం !!  ఇదే పూజ్యగురువులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు  పదే పదే చెబుతుంటారు . ఓడిపోవడం తప్పు కాదు కానీ ప్రయత్నమే చేయకపోతే ఇంకాపెద్ద పొరపాటు .

నాన్న కూచి !!

Image
ఎంత సూపర్ స్టార్ ఐనా కూతురు అంటే ప్రేమ ,ఆప్యాయత లేకుండా ఎలా ఉంటారు !! దానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ వేరు కాదు కదా !! తన కూతురు "సితార పుట్టిన రోజు " వేడుకల్లో ఇలా .... 

సింగర్ సునీత రెండో పెళ్లి ... నిజం కాదు

నిన్న ప్రచురించిన సింగర్ సునీతా రెండో వివాహం మీద ఆమె స్పందించారు ,ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదని,ఎవరో కావాలని పుకార్లు చేస్తున్నారని ,తమ వ్యక్తిగత  వారికీ ఎందుకు అంత కుతూహలం? అని ఆవేదన చెందారు . తనకి అటువంటి ఉద్దేశం లేదని చెప్పారు .

చిరునవ్వుతో - పార్ట్ 1

Image
"పచ్చటి పొలాలు మధ్యలో కొన్ని ఇళ్ళు ,దానిలో ఒక చిన్న డాబా .ఆ ఇంట్లో నేను       (రాంకి ),చెల్లి ,అమ్మనాన్న".  చిన్న కుటుంబం చింతలేని కుటుంబం . తెల్లవారితె గబగబా లేచి రెడీ అయ్యి బడికి పరుగు.  సాయంత్రం ఇంటికి చేరి కాసేపు ఆటలు,బడిలో ఇచ్చిన పని ముగించి పడుకోవడం ,ఇది నా దిన చర్య. ఆలా కొంతకాలం గడిచింది.  పదివరకు ఊరి బడి లో  చదువుకొని ఇంటర్ పక్కనున్న టౌన్ కి బయలుదేరాను .ఇంటర్లో బాగా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నా.తరువాత ఇంజనీరింగ్  సీటు తెచ్చుకొని హైదరాబాద్ పయనమయ్యా!  బస్ లో బయలుదేరి భాగ్యనగరం చేరాను . అక్కడ తన ఫ్రెండ్స్ ఉంటున్న రూమ్ కి చేరి రిలాక్స్ అయ్యా.  ఫ్రెండ్స్ సహకారం తో కోర్స్ జాయిన్ అవడానికి అమీర్ పేట్ కి వెళ్లి అన్ని కోర్స్ లు గురించి తెలుసుకొని ఒక కోర్స్ జాయిన్ అవ్వడానికి డిసైడ్ అయ్యాను.  రెండు  రోజులు తరువాత  "హాయ్ " అనే పలకరింపు ఇంపుగా వినపడింది ,ఎవరని పక్కకి తలతిప్పి చూసా! చక్కని నవ్వు ,నుదుట కుంకుమ బొట్టు ,చేతిలో పుస్తకాలతో 'మోడరన్ మహాలక్ష్మి'లా ఉంది.  "నేను కొత్తగా హైదరాబాద్ వచ్చాను ,ఇక్కడ ఏ  కోర్స్ బాగుంటుందో కొంచెం చెబుతారా?&qu

సింగర్ సునీత రెండో పెళ్ళి!!

Image
గాయనిగా ,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా  "సునీత" టాలీవుడ్ లో  తనకంటూ ప్రత్యేక  స్థానం ఉంది,కానీ ఆమె  వ్యక్తిగత జీవితం ఆటుపోట్లు గా సాగింది .ఆమె  కిరణ్ అనే వ్యక్తి ని  వివాహమ్ చేసుకున్నారు ,వివిధ కారణాల వల్ల  భర్త  తో విడిపోయారు ,వారికీ ఒక పాప ఉంది . ఇప్పుడు ఆమె (సెకండ్ ఇన్నింగ్స్ )రెండో వివాహం  ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ తో అని తేలింది . ఆమె జీవితం సుఖంగా ఉండాలని ఆశిద్దాం!!  

బిగ్ బాస్ లో "సరదాలు "...

Image
చాలా వారాలు  తరువాత "బిగ్ బాస్" షో లో  "నవ్వులు విరిసాయి . ఇన్ని వారాలు షో లో ఎప్పుడూ టాస్క్లు ,గొడవలు లేకపోతె నాని తో క్లాస్ . మొన్న వారం కాస్త ఉపశమనం అనే చెప్పాలి . ఐస్ మీద నిలబడి బౌల్ లో చీటీ చూసి దానిలో  ఉన్న పాట "సంజ్ఞలతో " చేసి చూపించాలి . మాటలాడకూడదు . మొదటిది హౌస్ లో ఉన్న సభ్యులు చెప్పాలి, రెండోది "నాని " చెప్పాలి ,అలా హాయిగా నవ్వులతో సాగింది . నాని కూడా బాగా అలవాటు పడి టెన్షన్ లేకుండా చేస్తున్నారు . ఏది ఏమైనా మొదటి భాగం తో పోలిస్తే కాస్త వెనుక పడింది అనే చెప్పాలి . భాను నిష్క్రమణ దాదాపు అందరూ ఊహించిందే . ఈ  వారం లో "బిగ్ బాస్" అందరితో "సినిమా " తీయాలి అనే టాస్క్ ఇచ్చారు , దానికి అమిత్ దర్శకుడు ,దీప్తి సహాదర్శకురాలు ,రోల్ రెడా కెమెరా ,తేజస్వి నృత్య దర్శకురాలు ,మేకప్ ,కాస్ట్యూమ్స్ . దర్శకుడు, సహాదర్శకురాలు కలిసి ఒక కాన్సెప్ట్ అనుకొని కథ  కధనం తయారు చేసి రూపకల్పన చేయాలి . ఆడిషన్స్ అయ్యాక కౌశల్ ,తనీష్ ,సామ్రాట్ ఎంపికచేసుకొన్నారు ,వారు స్నేహితులు గా ఒక కథ  నడుస్తుంది . కౌశల్ కి నందిని పరిచయం అయ్యి తనీష్ ని దూ

సంగీతం ఎంత మధురం

Image
బాగా అలసిన మనిషికి ,వాడి మనసుకి వీనుల విందైన సంగీతం ఎంత మధురం గా ఉంటుందో !! ఆ విషయం  ఈ మధ్య నాకు బాగా తెలిసింది . కాసేపు పాతపాటలు మరికొద్దిసేపు మెలోడీ వింటే, ఆ ఉల్లాసం ఉత్సాహం వేరు. ఈ మధ్యకాలం లో పాటలు అంత ప్రభావం లేవు అనే చెప్పాలి ,"ఓల్డ్ ఈజ్ గోల్డ్" అన్నారు అందుకేనేమో పెద్దలు . చిన్నపుడు పాటల పుస్తకాలు  కొని అవి చదివి నేర్చుకొని 'హమ్' చేసేవాళ్ళం , ఈ కాలం పిల్లలకి తెలీదు కదా ! ముంబై లో ఉన్నపుడు కూడా రోజు ఉదయం  పాటలు వింటూ ఆఫీస్ కి వెళ్లడం రావడం ,ఐనా ఆ పాటలు బోర్ కొట్టేది కాదు .టైం అసలు తెలిసేది కాదు . వీలు ఉంటె మీరు ట్రై చేయండి ...

నేను చెప్పానా !!

నేను చెప్పానా !!  చేసిన ప్రతి పనికి  ఫలితం తప్పక ఉంటుందని ! నోరు జారిన  ప్రతిఫలంగా "కత్తి మహేష్" కి ఆరునెలలు నగర  బహిష్కరణ విధించారు . ఇంకా అదుపులేకుండా వాగితే శాశ్వతంగా నగరం నుంచి బయటకి తోలేస్తారని సాక్షాత్తు డి. జి. పి వివరించారు , వాక్కు స్వతంత్రం ఉంది కదా అని,ఇష్టం వచ్చినట్లు  మాట్లాడి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్న కారణంగా ఈ విధంగా చేయవలసి వచ్చిందని చెప్పారు

"కత్తి మహేష్ "- వీడికి పని లేదు

Image
ఈ మధ్య అందరి నోట్లో ఒక్కటే చర్చ అదే "కత్తి మహేష్ " రాముడిని అనరాని  మాటలు  అన్నాడు అని ! నాకు రాముడు అంటే ఇష్టమైన  దైవం,ధర్మం గా ఎలా ఉండాలో నరుడు గా చూపించిన మహనీయుడు . రామాయణం అంటే ఏమిటో కూడా తెలీదు కానీ రాముడు గురించి ప్రతివాడు తీర్పు చెప్పేస్తాడు . "రామో విగ్రహవాన్ ధర్మః ",రాముడు  అంటే పోతపోసిన ధర్మం . అలాంటి దారిలో నడవటాని అందరు ప్రయత్నిస్తారు  కానీ ఒక విషయం నాకు తోచింది ,,, కత్తి మహేష్ కి  పనిపాట లేక టి వి ఛానల్ వాళ్ళు డబ్బు ఇస్తే లేక ఉచితం గా పబ్లిసిటీ కోసం నటుల్ని ,దేవుణ్ణి దూషిస్తునాడు . అలాంటి  వాడిని చూసి అసహ్యం కలుగుతుంది కానీ మనం ఓర్పు వహించాలి .  దేవుడు అందరికి నోరు ఇచ్చాడు కానీ సద్వినియోగం చేసుకుంటే పుణ్యాత్ముడు అవుతాడు లేకపోతె దూర్తుడు గా మిగిలిపోతాడు ,వాడు తిడితే మనం అరిస్తే  వాడు  వాడికి మనకి తేడా ఏముంటుంది ?! ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది అది మంచి ఐనా చెడు  ఐనా ,దానికి ఎవరు అతీతులు కారు ,కాస్త ఓర్పు ,సహనం ఉంటె కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది.  

వెంకి రూట్ మార్చాడా ?

Image
తెలుగు సినీ ప్రపంచం లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న "విక్టరీ వెంకటేష్" ఈ మధ్య సినిమాలు అంతగా ఆడటం లేదు ,ఏమి అనుకున్నాడో ఏమో కానీ కొంచెం విరామం తీసుకున్నాడు . ఇప్పుడు మల్టి స్టారర్ గా "వరుణ్ తేజ్ " తో "ఎఫ్ 2" (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) జత కట్టారు . అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు .  అనిల్ "రాజా ది గ్రేట్ "తరువాత చేస్తున్న  సినిమా ఇది. దిల్ రాజు నిర్మా తగా "వరుణ్ "కి మూడవ చిత్రం . హీరోయిన్ గా మెహ్రయిన్ చేస్తున్నారు  !! ఈ కార్యక్రమం  లో అల్లు అరవింద్ పాల్గున్నారు . 

ఈ బ్యాంకులకు ఏమైంది ?

Image
సామాన్య ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి,రూపాయి పోగుచేసి సంపాదించినదంతా   దాచుకోవడానికి గతంలో బ్యాంకు లో జమ వేసేవారు .  చీటీలు కడితే గ్యారంటీ లేదని కొందరు ,రిస్క్ చేయలేక కొందరు బ్యాంకు లో వేసేవారు .  ఇప్పుడు కధ  మారింది ! నగదు అరికట్టాలని,నల్లధనం పాలత్రోలనో మన మోడీ సర్ "డిమానిటైజేషన్ " అమలు చేసారు . అది ఇంతవరకు ఏమి సాధించారో గాని ప్రజలు మాత్రం చిక్కులు ఇంకా కొనసాగుతున్నాయి .  నగదు వేసినా  బాదుడు ,తీస్తే బాదుడు . మన డబ్బు మనం తీసుకున్న తప్పే !? "ఏ .టి. ఎమ్" లో ఎప్పుడు డబ్బు ఉంటుందో ఆ దేవుడికే ఎరుక !! "నో కాష్ " బోర్డులు వెక్కిరిస్తాయి . రెండు కిలోమీటర్లు తిరిగితే మీ అదృష్టం బాగుంటే డబ్బు ఉంటుంది ,వస్తుంది . లేదంటే చీటీ వెక్కిరిస్తుంది (నగదు లేదని ).  ఈ మధ్య బ్యాంకు లో డబ్బు ఉన్నా కూడా దానికి కూడా "డబ్బు కత్తిరించారట" ఎస్. బి. ఐ  వారు !! అది తెలిసి ఆ వినియోగదారుడు బ్యాంకు కి ఘాటుగా లేఖ రాసి ,అకౌంట్ మూసివేసాడు .  డిజిటైజేషన్  చేయండి మంచిదే  అనే  సాకుతో "మమ్మలిని ముంచద్దు ,చంపద్దు .. " అత్యవసరం గా

సమ్మోహనం ...

Image
తెలుగు సినిమా ప్రేక్షకులకి ఒక తెలియని అనుభూతి ,ఎన్నో ప్రేమ కధలు చూసాం కానీ ఇది దానికి కొంచెం ఎక్కువే !(నా ఫీలింగ్) సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు తరువాత ఇప్పుడు వీడి సమీక్ష ఎవడికి కావాలి అనుకుంటే పొరపాటే !! సగటు సినిమా పిచ్చి ఉన్న అభిమానిగా రాస్తున్నా ... రాయకుండా ఉండలేక పోతున్నా ! అనగనగ అందమైన కుటుంబం ... అమ్మ ,నాన్న ,చెల్లి,మన హీరో .. విజయకుమార్ (సుదీర్ బాబు ). విజయ్ కి బొమ్మలు వేయడం అంటే ఇష్టం,పిల్లలకి కథలతో కూడిన బొమ్మలు వేసి పుస్తకం ప్రచురించాలని లక్ష్యం  !అది వారికీ విజ్ఞానం ఇస్తుంది అని నమ్మకం . తనకి సినిమాలు అంటే మంచి అభిప్రాయం ఉండదు ,పడదు ,వారిది అంతా నటన అనే అభిప్రాయం ,కానీ తన స్నేహితులకి ఆ సినిమాలే ఇష్టం . ఒక షూటింగ్ నిమిత్తం వీరి ఇల్లు 20 రోజులు కావాలని సినిమా వాళ్ళు అడగ్గా తండ్రి (నరేష్ )ఒక కండిషన్ పెడతాడు ,అదే తనకి చిన్న వేషం ఇవ్వాలని !!ఓకే అంటారు . ఆ సినిమా లో హీరోయిన్ "సమీరా"(అదితిరావు )ని చూస్తాడు ,తనకి తెలుగు రాదని నవ్వుకుంటాడు . తనకి తెలుగు నేర్పమని అడగ్గా సరే అంటాడు . అలా  కొన్ని రోజులకి వారి పరిచయం,స్నేహం గా  మారుతుంది ,తెలియకుండా ప్ర

ఈ కుర్రాళ్ల డాన్స్ చూడండి

ఈ కుర్రాళ్ల డాన్స్ చూడండి ...పిచ్చి ఎక్కించారు !! లింక్  క్లిక్  చేయండి ....  https://www.youtube.com/watch?v=IoeeeIl7r8w

మలేషియా లో పెట్రోనాస్ టవర్స్ చూసారా ??

Image
మలేషియా లో పెట్రోనాస్ టవర్స్ చూసారా ? ఐతే ఒక లుక్ వేద్దాం రండి ! మలేషియా కౌలాలంపూర్ వుండే ఈ ప్రసిద్ధ కట్టడాన్ని "పెట్రోనాస్ టవర్స్ " లేక "పెట్రోనాస్ ట్విన్ టవర్స్" అంటారు . 2014 వరకు ఈ టవర్స్"  ప్రపంచంలోకెల్లా ఎతైన టవర్స్. దీనిలో సుమారు 90 ఫ్లోర్స్ ఉంటాయి ,40లిఫ్ట్స్ పని చేస్తాయి . ప్రభుత్వ కార్యాలన్నీ దీనిలో ఉంటాయి . ఈ టవర్ ని అర్జెంటైనా చెంది "సీసర్ పిళ్ళై " డిజైన్ చేసారు . దీని ప్లానింగ్ జనవరి 1,1992 మొదలు పెట్టారు .ఏడు సంవత్సరాల కఠిన శ్రమతో 1993 మార్చి 1న పూర్తయింది . సూపర్ స్ట్రక్చర్ 1994 ఏప్రిల్ ఒకటి న ముగిసింది . ఇంటీరియర్ ,ఫర్నిచర్ కలిపి  జనవరి ఒకటి 1996కి ముగిసింది . టవర్ 1 మరియు టవర్ 2 కలిపి మర్చి ఒకటి 1996 పూర్తి  అయ్యింది ,అధికారికంగా అక్కడ ప్రధాని చేతుల మీద 1999 ఆగష్టు 1న ప్రారంభించారు .

పవన్ కళ్యాణ్ ... "పొలిటికల్ పంజా " విసురుతాడా ??

Image
"పవన్ కళ్యాణ్" ... నిన్నటివరకు సినీ విలాకాశంలో "పవర్ స్టార్ "అని అభిమానులు ముద్దుగా పిలుచు కునే  వారు ,ఇప్పుడు తన సినీ ప్రపంచం వదిలి  "ప్రజల సేవకోసం" జనసేన పార్టీ తో ప్రజల్లోకి వచ్చారు . పార్టీ ఐతే పెట్టారు కానీ ,దానిలో ఆయన ఒక్కడే !! నాలుగు వసంతాలు గడిచిన ప్రత్యక్ష పోటీలో లేరు . క్రితం ఎన్నికల్లో "తెలుగు దేశం "కి మద్దతు ఇచ్చారు . పార్టీ బలం కార్యకర్తలే ,కాబట్టి  పార్టీ లోకి సభ్యత్వం కోసం "మిస్ కాల్ "తో జాయిన్ అయ్యేలా చేసారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి "పోరాట యాత్ర " మొదలు పెట్టి "శ్రీకాకుళం లో "పర్యటించి  అక్కడ ఉన్న "ఉద్దానం "కిడ్నీ సమస్య కోసం పోరాటం చేసారు . ఇది ఇలా  ఉంటె వచ్చే ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం . "భారతీయ జనతా పార్టీ " ఆంధ్రా కు "ప్రత్యేక హోదా "ఇస్తామని మాటతప్పారని  దుమ్మెత్తిపోశారు. అనుభవం ఉంది కదా అని గతం లో  "టి డి పి " కి మద్దతు ఇస్తే వారు ఏమి చేయలేకపోయారని  విమర్శలు  గుప్పిస్తున్నారు . ప్రభుత్వం,ప్రతిపక్షం కు  ర

"భగవాన్ ... సర్ ...స్ఫూర్తి దాయకం .... "

Image
"భగవాన్ ... సర్ ...స్ఫూర్తి దాయకం .... " మనం స్కూల్ కి వెళితే అక్కడ ,టీచరో పాఠాలు నేర్పిస్తారు , కొందరు విద్యతో పాటు వినయం , మంచి గా ఉండటం  నేర్పుతారు  , కానీ ఇప్పుడు చెప్పబోయే మాస్టారు  పేరు "భగవాన్ " మాస్టారు ,నిజంగా   పిల్లల పాలిట  భగవానుడే !  తమిళనాడు లో వెలిగ్రామం ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల లో ఇంగ్లీష్ మాస్టారుగా 2014 నుంచి పని చేస్తున్నాడు .  అతను పిల్లలకి  పాఠాలతో పాటు ,జీవితం లో ఎలా పైకి రావాలి, కష్టపెడితే సాదించలేనిది ఏది లేదు .. అలాంటి విషయాలను "ప్రొజెక్టర్ "వేసి చూపించే వారు .  ఇంగ్లీష్ తో పాటు మిగిలిన సబ్జక్ట్స్ లో కూడా అర్ధం అయ్యే లా  చెప్పే వారు .  పిల్లలని స్కూల్ కి రాగానే ఆప్యాయం గా "టిఫిన్ "తిన్నారా ? అని అడిగి ,తినకపోతే వారికీ తన డబ్బుతో అల్పాహారం ఇచ్చేవారు .  తిండి తినకపోతే , కాళీ పొట్టతో, ఏకాగ్రత లేకపోతె చెప్పే పాఠం బుర్రలోకి ఎలా  వెళుతుంది? అని అడిగేవారు. తను కూడా పేద విద్యార్థి కదా !ఆ బాధ తనకి తెలుసు  వారితో  ఒక అన్న గా ,మిత్రుడి గా  మెలిగే వారు .  కానీ ప్రభుత్వ ఆదేశాలు మేరకు అతనికి వేరే ఊరు బ

సైరా నరసింహారెడ్డి..

Image
సైరా   నరసింహారెడ్డి ... "మెగా స్టార్ చిరంజీవి" తరువాతి చిత్రం , కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ నిర్మాత గా రెండో సినిమా ఇది . ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి  ఆధారంగా తీస్తున్న చిత్రం. నయనతార, జగ పటిబాబు , అమితాబ్ ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నారు ,రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు . ఈ చిత్రాన్ని పలు భాషల్లో కూడా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది . టీం విడుదల చేసిన కొన్ని స్టిల్స్ చూస్తే సినిమా చాలా క్లాస్ గా,రిచ్ గా ఉన్నాయి . తమిళ్ నటుడు  విజయ్ కూడా నటిస్తున్నారు ,ఈ సినిమా లో పోరాట దృశ్యాలు అద్భుతం గా వచ్చాయట! చిరు 151 చిత్రం కోసం హాలీవుడ్ సాకేతిక నిపుణలతో పని చేస్తున్నారు ,ఎలాగైనా చరిత్రలో నిలిచిపోయే విధం గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు , వేచి చూడాలి ఏమి జరుగుతుందో ...!

రాము (రామ్ గోపాల్ వర్మ ) కు పూర్వ వైభవం వస్తుందా !

Image
సినీ చరిత్రలో  దర్శకుల ఎంత మంది ఉ న్నా  ఇతడు వేరు .. కాపి కొడితే కొట్టానని ధైర్యం గా చెబుతాడు , ప్లాప్ ఐన సరే దానికి సీక్వల్ తీస్తాడు .. ఏమైనా అంటే "నా ఇష్టం , ఇష్టం ఉంటె చూడు లేక పొతే  లేదు  "అని అంటాడు , అతడే  రాము (రామ్ గోపాల్ వర్మ ). సంచలనాలికి  మారుపేరు ,మొదట్లో చాలా  మంచి చిత్రాలు (శివ ,క్షణక్షణమ్ లాంటివి  )తీసాడు  ,రాను రాను అతనిలో పస తగ్గింది . తన బుర్రలో వచ్చిన దిక్కుమాలిన ఆలోచనకి కూడా సినిమా చేసి జనాల్లోకి వదలటం మొదలు పెట్టాడు . రామ్ గోపాల్ వర్మ అంటే పడిచచ్చే వాడికి కూడా చచ్చేలా చేసాడు . ఇంకో పక్క ట్విట్టర్ లో షరా మాములే ,ఎవర్ని వదలడు ...  కెలకడం అతని హాబీ !! ఈ మధ పవన్ తో వివాదం,దుమారం  అందరికి తెలిసిందే ... అన్ని కష్టాల్లో ఉన్నా ,బ్రేక్ ఇచ్చిన నాగ్ అవకాశం  ఇస్తే  ,( ఆఫీసర్) తో షాక్ ఇచ్చి న ఘనుడు . "ఈ సినిమా మర్చిపోండి " అని నాగ్ చేతే అనిపించాడు .  రాము కు పూర్వ వైభవం వస్తుందో లేక పొతే కథ ముగుస్తుందో వేచి చూడాలి ....   

బిగ్ బాస్ షో -2 .

ఇంతకూ ముందు బిగ్ బాస్ -1 లో జూనియర్ ఎన్ . టి. ఆర్ . వ్యాఖ్యాత  గాచేసే వారు ,ఇప్పుడు "నాని " వ్యాఖ్యాత  గా వ్యవహరిస్తున్నారు . కొంతమంది హీరో లు ,టి వి నటులు ,కొంతమంది సామాన్యులు ఈ గేమ్ లో ఆడుతున్నారు . సుమారు వంద రోజుల్లో అందరు కలిసి ఆ హౌస్ లో ఉండాలి . బయటకి వెళ్ళటానికి అనుమతి ఉండదు . మైక్ ధరించాలి . ఆందరు అక్కడే ఉండి  వండుకుని ,తిని పడుకోవాలి . బిగ్ బాస్ ఏమి టాస్క్ ఇస్తే అది కూడా చేయాలి ప్రతి వారానికి ఒక కెప్టెన్ ని బిగ్ బాస్ ఎంపిక చేస్తారు . వారి అడుగు జాడల్లో వీరు ఉండాలి ,,కానీ కెప్టెన్ కి ఆ వారం లో  ఎలిమినేషన్ ఉండదు   ఇది ఒకరకమైన మైండ్ గేమ్ అని నా అభిప్రాయం . మన మాటలతో,పనులతో ఎదుటివారిని ఎదో రకం గా బయటకి పంపించాలి  అని చూసే వారు ఎక్కువ . దానికి ఎన్నో వ్యూహాలు రచిస్తారు కానీ కనపడరు ఈ సీజన్ లో నాని ఏంకర్  గా కొత్త ,కానీ  అలవాటు పడుతున్నాడు  నిన్న సంజన అనే అమ్మాయి ని బయటకి పంపించారు , నందిని ఎంట్రీ ఇస్తుంది .  ఈ షో అయ్యే లోపు వారికీ మంచి పేరు ,ప్రఖ్యాతలు ,ఆఫర్లు వస్తున్నాయి . ఇది  ఒకరకం గా ఆ నటులకి ,గాయని గాయకులకు ,సామాన్యులకి  మంచి పరిణామమే .

పచ్చి నిజాలు ...

ప్రతి వాడు పక్కనున్న వాడిని చూసి అలా మనం ఎందుకు లేము , మనకు డబ్బు లేదు ,ఇల్లు లేదు,కారులేదు అని ఎదోరకం గా భాదపడేవారే !!(చాలామంది ) కానీ మనకు ఉన్నదానితో సంతోషం గా ఉండాలని ,కష్ట పడి  పైకి వెళదాం అనుకునే వారు బహు తక్కువ.. ఈజీ మని కావాలి ,పని చేయకూడదు ... అని చాలా మంది యువత ,పెద్దవారు అనుకుంటారు ... అలా ఆలోచించటం వారి ఇష్టం . కానీ ఆలా వచ్చిన డబ్బు . పదవులు   అంత సంతృప్తి ఇవ్వవు  కష్టపడడం ... ఫలితం అదే వస్తుంది అని గ్రహించి ,పెద్దవారు పిల్లలకు నేర్పాలి . ఇవన్నీ సోది లాగా ఉంటుంది గాని పచ్చి నిజాలు ... నమ్మితే మంచిదే ,నమ్మక పోయిన ఇంకా మంచిది .. ఎదో చెప్పాలి అని చిన్న ప్రయత్నం ... నీతిగా ఉండటానికి ప్రయత్నించాలి ,విజయాలు సాదించాలి ...

సమయం వస్తుంది మిత్రమా ... !

ఒకోసారి మన ప్రయత్నం చేసిన ఫలితం రాదు ,మరికొన్నిసార్లు ఏమి చేయకుండానే మంచి ఫలాలు వస్తాయి .  కానీ చేసి పని ,ఎదగడానికి ప్రయత్నం మాత్రం తప్పక చేయాలి , లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.  చల్లని చెట్టు కింద ఉంటె బాగుంటుంది కానీ అదే అలవాటు ఐతే చిన్న వేడిని కూడా తట్టుకోలేము ...  కాబట్టి "కష్టే  ఫలి "...  సమయం సందర్భం వస్తే మంచి ఫలితాలు  అవే వస్తాయి ,ఎల్ల  కాలం ఒకలా ఉండదు గా ... 

ఈ బాదుడు ఎన్నాళ్ళు ??

Image
మన పాలకులు మైక్ ఇస్తే డప్పులు కొట్టి "అది ఇస్తాం  ,ఇది చేస్తాం" అంటారు గాని ,ముఖ్యమైన సమస్య మాత్రం పరిష్కరించరు .  అదే పిల్లల ఫీజు సమస్య !! ఒక బాబు గాని ,పాప గాని ప్రెవేట్ స్కూల్ కి వెళితే "నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఫీజు" చూస్తే కళ్ళు తిరిగి కింద పడాల్సిందే !! ఒకడు అడ్మిషన్ కి పదివేలు అంటాడు ,మరొకడు ఇరవై అంటాడు , మరొకడు ఇంటర్నేషనల్ స్కూల్ అండి "లక్ష " అని బాదుడు  చిన్న బడిలో సంవత్సరానికి సుమారుగా   30 నుంచి 70 వేలు గుంజుతున్నారు !! దీనిని కట్టడి చేసే వారు లేరా ?? ప్రభుత్వం అలా ఉంటె మనం కూడా పరువు,ప్రతిష్ట అని పక్కనోడు ఏమి చేస్తే మనం "అంతకు మించి " అని గొప్పలకు పోయే వారు లేకపోలేదు ...   చదువుకోవాలి  గాని చదువుని "కొనకూడదు ".  దీనికి చరమ  గీతం అందరం పాడి ఒక వ్యవస్థ ద్వారా "ఫీజు "కట్టడి చేయాలి .  ఇంతకు  మించి వసూల్ చేస్తే , వారి లైసెన్స్ రద్దు చేయాలి , అప్పుడు కానీ భయపడరు ... పిల్లలు బాగుపడరు 

మల్లె మనసులు

Image
"మల్లె" మనసులు  ప్రతి మనిషి జీవితం లో కుటుంబం తో పాటు కొంతమంది స్నేహితులు తప్పక ఉంటారు .  ఆలా స్నేహితులు లేని వారు చాలా అరుదు.  "మన స్నేహితులు ఎవరో చెపితే మనం ఎలాంటివాళ్ళో చెపుతా "అన్నారు ఓ కవి .  ఆలా నా జీవిత ప్రయాణం లో కొందరు ఉన్నారు .  వారిలో మర్చిపోలేని వారు కొందరు ,మర్చిపోతే బాగుంటుంది అనుకునే వారు కొందరు .  కాలేజీ లో పరిచయం ఐన  వారిలో "మల్లి " ఒక్కడు. చదువు లో, తెలివితేటల్లో ముందు .  మా క్లాస్ వాళ్ళతో  కన్నా వాడితో చనువు ఎక్కువ . కలిసి సిని మాలు ,షికార్లు .  కల్మషం లేని వ్యక్తి . వాడిని చూసి కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నా , ఎల్లప్పుడూ నా గురించి ,నా ఎదుగుదల గురించి ఆశిస్తాడు .  వారి కుటుంబం తో కూడా మంచి అనుబంధం ఉంది .  ప్రస్తుతం తను  నా దగ్గర్లో లేకపోయినా ఫోన్ లో మాట్లాడుతుంటాడు . వృత్తి రీత్యా  అమెరికా లో ఉంటున్నాడు .   ఒక పని లో నాలో నమ్మకం లేకపోతె ,చెప్పి నమ్మకం కలిగించి నాకు ప్రోత్సహిస్తాడు .  వృత్తిలో లేక బిజినెస్ లో గాని నష్టపోయినా ,కలతచెందిన అండ గా  ఉంటాడు .  ఆనందం గా ఉన్నపుడు ,డబ్బు ఉన్నపుడు అందరూ వ

కంటే కూతుర్నే కనాలి !!

Image
ఈ రోజుల్లో కూడా  అమ్మాయి పుట్టినా ఎదో కష్టం అని ఫీల్ అయ్యే జనాలు ఇంకా ఉన్నారు .. కానీ ఒక ఆడపిల్ల తండ్రి గా ఆ ప్రేమ ,ఆప్యాయత ముందు ఏదీ ఐనా చిన్నదే అనిపిస్తుంది ... వారి ముసిముసి నవ్వులు ,చిన్న మాటలు వింటుంటే అన్ని మర్చిపోతా !! ఇంటికి వెళ్లిన వెంటనే కబుర్లు ,ఆటలు ,పాటలు తో సందడే ... ఈ మధ్య డాన్స్ (నృత్యం) కూడా మొదలు ... కొత్త స్టెప్స్ నేర్పుతుంది నాకు .. నేను చేయకపోతే ఇది  కూడా రాదా? అని వెటకారం... :) చదరంగం  కూడా మొదలు పెట్టారు మేడం గారు... అప్పుడప్పుడు పాప పైన కోపం వస్తుంది గాని కొద్దీ సేపు మాత్రమే , మరలా తనతో చిన్నవాడిగా మారిపోతా .. దేవుడు అన్ని చోట్ల లేకపోయినా తన ప్రతి రూపంలా తల్లిగా,కూతురిగా ఉంటాడేమో ... ఆడ పిల్ల లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు కానీ తాను ఊరు వెళితే ఎదో తెలియని వెలితి నాలో,ఇంట్లో ... ఇంతకీ తన ముద్దు పేరు ఏమిటో తెలుసా "హనీ "....

ప్రభాస్ కి అంత సీన్ ఉందా ?

Image
ప్రభాస్ కి అంత సీన్ ఉందా ? "బాహు బలి"  ఒక ప్రభంజనం ...  రాజ మౌళి దర్శక ప్రతిభ ,కీరవాణి సంగీతం తొ దేశాన్ని ఊపేసింది.  ప్రభాస్,రానా ,అనుష్క,తమన్నా నటనతో మెప్పించారు,  రికార్డులు కొల్లగొట్టింది . బడ్జెట్ భారీగా పెట్టినా  తెలివి గా మార్కెట్ చేసుకొని 1000 కోట్లు దాటింది ,అంతవరకూ బాగానే ఉంది .  కానీ ప్రభాస్ తరువాతి 250  కోట్లు పెట్టదండం అంటే సాహసమే అని చెప్పాలి,ఒకే ఒక సినిమా చేసిన దర్శకుడు చేతిలో ఇంత  పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు.  కానీ అది ప్రభాస్ ఒక్కడి పేరుతో అంత వసూళ్లు సాధిస్తుందా ??అంత మార్కెట్ ఈ చిత్రం చేయగలదా ?? వేచిచూడాలి ... 

మార్పు మంచిదే కానీ ....

మార్పు మంచిదే కానీ ....  మనలో అందరం ఎదుట వారి తప్పులు వెతుకుతున్నాం కానీ మన బాధ్యత మాత్రం తెలుసుకోము . ఏమైనా అంటే "టైం లేదు " అని ఒక డైలాగ్ ఒకటి .  రోడ్ మీద వెళ్ళేటప్పుడు రాంగ్ రూట్ లో వెళతాం కానీ రూల్స్ అప్పుడు గుర్తు రావు , మన పని అయిపోవాలి కానీ పక్కనోడు పోయిన పర్లేదు . మార్పు మన నుంచి మొదలు కావాలి ,మనం మారితే జనం కి చెప్పచ్చు .

హాయ్ అండీ ,

హాయ్ అండీ , అందరికి నమస్కారము ... చాలా రోజులు తరువాత మరలా "బ్లాగ్" వ్రాయడం మొదలుపెట్టాను. మీ అందరి సహకారం  ఉంటె మరలా మంచి పోస్ట్లు వ్రాసి ,మీ మన్నలు పొందాలి అని ఆశిస్తూ .... సాయి