Posts

Showing posts from June, 2018

ఈ కుర్రాళ్ల డాన్స్ చూడండి

ఈ కుర్రాళ్ల డాన్స్ చూడండి ...పిచ్చి ఎక్కించారు !! లింక్  క్లిక్  చేయండి ....  https://www.youtube.com/watch?v=IoeeeIl7r8w

మలేషియా లో పెట్రోనాస్ టవర్స్ చూసారా ??

Image
మలేషియా లో పెట్రోనాస్ టవర్స్ చూసారా ? ఐతే ఒక లుక్ వేద్దాం రండి ! మలేషియా కౌలాలంపూర్ వుండే ఈ ప్రసిద్ధ కట్టడాన్ని "పెట్రోనాస్ టవర్స్ " లేక "పెట్రోనాస్ ట్విన్ టవర్స్" అంటారు . 2014 వరకు ఈ టవర్స్"  ప్రపంచంలోకెల్లా ఎతైన టవర్స్. దీనిలో సుమారు 90 ఫ్లోర్స్ ఉంటాయి ,40లిఫ్ట్స్ పని చేస్తాయి . ప్రభుత్వ కార్యాలన్నీ దీనిలో ఉంటాయి . ఈ టవర్ ని అర్జెంటైనా చెంది "సీసర్ పిళ్ళై " డిజైన్ చేసారు . దీని ప్లానింగ్ జనవరి 1,1992 మొదలు పెట్టారు .ఏడు సంవత్సరాల కఠిన శ్రమతో 1993 మార్చి 1న పూర్తయింది . సూపర్ స్ట్రక్చర్ 1994 ఏప్రిల్ ఒకటి న ముగిసింది . ఇంటీరియర్ ,ఫర్నిచర్ కలిపి  జనవరి ఒకటి 1996కి ముగిసింది . టవర్ 1 మరియు టవర్ 2 కలిపి మర్చి ఒకటి 1996 పూర్తి  అయ్యింది ,అధికారికంగా అక్కడ ప్రధాని చేతుల మీద 1999 ఆగష్టు 1న ప్రారంభించారు .

పవన్ కళ్యాణ్ ... "పొలిటికల్ పంజా " విసురుతాడా ??

Image
"పవన్ కళ్యాణ్" ... నిన్నటివరకు సినీ విలాకాశంలో "పవర్ స్టార్ "అని అభిమానులు ముద్దుగా పిలుచు కునే  వారు ,ఇప్పుడు తన సినీ ప్రపంచం వదిలి  "ప్రజల సేవకోసం" జనసేన పార్టీ తో ప్రజల్లోకి వచ్చారు . పార్టీ ఐతే పెట్టారు కానీ ,దానిలో ఆయన ఒక్కడే !! నాలుగు వసంతాలు గడిచిన ప్రత్యక్ష పోటీలో లేరు . క్రితం ఎన్నికల్లో "తెలుగు దేశం "కి మద్దతు ఇచ్చారు . పార్టీ బలం కార్యకర్తలే ,కాబట్టి  పార్టీ లోకి సభ్యత్వం కోసం "మిస్ కాల్ "తో జాయిన్ అయ్యేలా చేసారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి "పోరాట యాత్ర " మొదలు పెట్టి "శ్రీకాకుళం లో "పర్యటించి  అక్కడ ఉన్న "ఉద్దానం "కిడ్నీ సమస్య కోసం పోరాటం చేసారు . ఇది ఇలా  ఉంటె వచ్చే ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం . "భారతీయ జనతా పార్టీ " ఆంధ్రా కు "ప్రత్యేక హోదా "ఇస్తామని మాటతప్పారని  దుమ్మెత్తిపోశారు. అనుభవం ఉంది కదా అని గతం లో  "టి డి పి " కి మద్దతు ఇస్తే వారు ఏమి చేయలేకపోయారని  విమర్శలు  గుప్పిస్తున్నారు . ప్రభుత్వం,ప్రతిపక్షం కు  ర

"భగవాన్ ... సర్ ...స్ఫూర్తి దాయకం .... "

Image
"భగవాన్ ... సర్ ...స్ఫూర్తి దాయకం .... " మనం స్కూల్ కి వెళితే అక్కడ ,టీచరో పాఠాలు నేర్పిస్తారు , కొందరు విద్యతో పాటు వినయం , మంచి గా ఉండటం  నేర్పుతారు  , కానీ ఇప్పుడు చెప్పబోయే మాస్టారు  పేరు "భగవాన్ " మాస్టారు ,నిజంగా   పిల్లల పాలిట  భగవానుడే !  తమిళనాడు లో వెలిగ్రామం ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల లో ఇంగ్లీష్ మాస్టారుగా 2014 నుంచి పని చేస్తున్నాడు .  అతను పిల్లలకి  పాఠాలతో పాటు ,జీవితం లో ఎలా పైకి రావాలి, కష్టపెడితే సాదించలేనిది ఏది లేదు .. అలాంటి విషయాలను "ప్రొజెక్టర్ "వేసి చూపించే వారు .  ఇంగ్లీష్ తో పాటు మిగిలిన సబ్జక్ట్స్ లో కూడా అర్ధం అయ్యే లా  చెప్పే వారు .  పిల్లలని స్కూల్ కి రాగానే ఆప్యాయం గా "టిఫిన్ "తిన్నారా ? అని అడిగి ,తినకపోతే వారికీ తన డబ్బుతో అల్పాహారం ఇచ్చేవారు .  తిండి తినకపోతే , కాళీ పొట్టతో, ఏకాగ్రత లేకపోతె చెప్పే పాఠం బుర్రలోకి ఎలా  వెళుతుంది? అని అడిగేవారు. తను కూడా పేద విద్యార్థి కదా !ఆ బాధ తనకి తెలుసు  వారితో  ఒక అన్న గా ,మిత్రుడి గా  మెలిగే వారు .  కానీ ప్రభుత్వ ఆదేశాలు మేరకు అతనికి వేరే ఊరు బ

సైరా నరసింహారెడ్డి..

Image
సైరా   నరసింహారెడ్డి ... "మెగా స్టార్ చిరంజీవి" తరువాతి చిత్రం , కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ నిర్మాత గా రెండో సినిమా ఇది . ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి  ఆధారంగా తీస్తున్న చిత్రం. నయనతార, జగ పటిబాబు , అమితాబ్ ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నారు ,రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు . ఈ చిత్రాన్ని పలు భాషల్లో కూడా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది . టీం విడుదల చేసిన కొన్ని స్టిల్స్ చూస్తే సినిమా చాలా క్లాస్ గా,రిచ్ గా ఉన్నాయి . తమిళ్ నటుడు  విజయ్ కూడా నటిస్తున్నారు ,ఈ సినిమా లో పోరాట దృశ్యాలు అద్భుతం గా వచ్చాయట! చిరు 151 చిత్రం కోసం హాలీవుడ్ సాకేతిక నిపుణలతో పని చేస్తున్నారు ,ఎలాగైనా చరిత్రలో నిలిచిపోయే విధం గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు , వేచి చూడాలి ఏమి జరుగుతుందో ...!

రాము (రామ్ గోపాల్ వర్మ ) కు పూర్వ వైభవం వస్తుందా !

Image
సినీ చరిత్రలో  దర్శకుల ఎంత మంది ఉ న్నా  ఇతడు వేరు .. కాపి కొడితే కొట్టానని ధైర్యం గా చెబుతాడు , ప్లాప్ ఐన సరే దానికి సీక్వల్ తీస్తాడు .. ఏమైనా అంటే "నా ఇష్టం , ఇష్టం ఉంటె చూడు లేక పొతే  లేదు  "అని అంటాడు , అతడే  రాము (రామ్ గోపాల్ వర్మ ). సంచలనాలికి  మారుపేరు ,మొదట్లో చాలా  మంచి చిత్రాలు (శివ ,క్షణక్షణమ్ లాంటివి  )తీసాడు  ,రాను రాను అతనిలో పస తగ్గింది . తన బుర్రలో వచ్చిన దిక్కుమాలిన ఆలోచనకి కూడా సినిమా చేసి జనాల్లోకి వదలటం మొదలు పెట్టాడు . రామ్ గోపాల్ వర్మ అంటే పడిచచ్చే వాడికి కూడా చచ్చేలా చేసాడు . ఇంకో పక్క ట్విట్టర్ లో షరా మాములే ,ఎవర్ని వదలడు ...  కెలకడం అతని హాబీ !! ఈ మధ పవన్ తో వివాదం,దుమారం  అందరికి తెలిసిందే ... అన్ని కష్టాల్లో ఉన్నా ,బ్రేక్ ఇచ్చిన నాగ్ అవకాశం  ఇస్తే  ,( ఆఫీసర్) తో షాక్ ఇచ్చి న ఘనుడు . "ఈ సినిమా మర్చిపోండి " అని నాగ్ చేతే అనిపించాడు .  రాము కు పూర్వ వైభవం వస్తుందో లేక పొతే కథ ముగుస్తుందో వేచి చూడాలి ....   

బిగ్ బాస్ షో -2 .

ఇంతకూ ముందు బిగ్ బాస్ -1 లో జూనియర్ ఎన్ . టి. ఆర్ . వ్యాఖ్యాత  గాచేసే వారు ,ఇప్పుడు "నాని " వ్యాఖ్యాత  గా వ్యవహరిస్తున్నారు . కొంతమంది హీరో లు ,టి వి నటులు ,కొంతమంది సామాన్యులు ఈ గేమ్ లో ఆడుతున్నారు . సుమారు వంద రోజుల్లో అందరు కలిసి ఆ హౌస్ లో ఉండాలి . బయటకి వెళ్ళటానికి అనుమతి ఉండదు . మైక్ ధరించాలి . ఆందరు అక్కడే ఉండి  వండుకుని ,తిని పడుకోవాలి . బిగ్ బాస్ ఏమి టాస్క్ ఇస్తే అది కూడా చేయాలి ప్రతి వారానికి ఒక కెప్టెన్ ని బిగ్ బాస్ ఎంపిక చేస్తారు . వారి అడుగు జాడల్లో వీరు ఉండాలి ,,కానీ కెప్టెన్ కి ఆ వారం లో  ఎలిమినేషన్ ఉండదు   ఇది ఒకరకమైన మైండ్ గేమ్ అని నా అభిప్రాయం . మన మాటలతో,పనులతో ఎదుటివారిని ఎదో రకం గా బయటకి పంపించాలి  అని చూసే వారు ఎక్కువ . దానికి ఎన్నో వ్యూహాలు రచిస్తారు కానీ కనపడరు ఈ సీజన్ లో నాని ఏంకర్  గా కొత్త ,కానీ  అలవాటు పడుతున్నాడు  నిన్న సంజన అనే అమ్మాయి ని బయటకి పంపించారు , నందిని ఎంట్రీ ఇస్తుంది .  ఈ షో అయ్యే లోపు వారికీ మంచి పేరు ,ప్రఖ్యాతలు ,ఆఫర్లు వస్తున్నాయి . ఇది  ఒకరకం గా ఆ నటులకి ,గాయని గాయకులకు ,సామాన్యులకి  మంచి పరిణామమే .

పచ్చి నిజాలు ...

ప్రతి వాడు పక్కనున్న వాడిని చూసి అలా మనం ఎందుకు లేము , మనకు డబ్బు లేదు ,ఇల్లు లేదు,కారులేదు అని ఎదోరకం గా భాదపడేవారే !!(చాలామంది ) కానీ మనకు ఉన్నదానితో సంతోషం గా ఉండాలని ,కష్ట పడి  పైకి వెళదాం అనుకునే వారు బహు తక్కువ.. ఈజీ మని కావాలి ,పని చేయకూడదు ... అని చాలా మంది యువత ,పెద్దవారు అనుకుంటారు ... అలా ఆలోచించటం వారి ఇష్టం . కానీ ఆలా వచ్చిన డబ్బు . పదవులు   అంత సంతృప్తి ఇవ్వవు  కష్టపడడం ... ఫలితం అదే వస్తుంది అని గ్రహించి ,పెద్దవారు పిల్లలకు నేర్పాలి . ఇవన్నీ సోది లాగా ఉంటుంది గాని పచ్చి నిజాలు ... నమ్మితే మంచిదే ,నమ్మక పోయిన ఇంకా మంచిది .. ఎదో చెప్పాలి అని చిన్న ప్రయత్నం ... నీతిగా ఉండటానికి ప్రయత్నించాలి ,విజయాలు సాదించాలి ...

సమయం వస్తుంది మిత్రమా ... !

ఒకోసారి మన ప్రయత్నం చేసిన ఫలితం రాదు ,మరికొన్నిసార్లు ఏమి చేయకుండానే మంచి ఫలాలు వస్తాయి .  కానీ చేసి పని ,ఎదగడానికి ప్రయత్నం మాత్రం తప్పక చేయాలి , లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.  చల్లని చెట్టు కింద ఉంటె బాగుంటుంది కానీ అదే అలవాటు ఐతే చిన్న వేడిని కూడా తట్టుకోలేము ...  కాబట్టి "కష్టే  ఫలి "...  సమయం సందర్భం వస్తే మంచి ఫలితాలు  అవే వస్తాయి ,ఎల్ల  కాలం ఒకలా ఉండదు గా ... 

ఈ బాదుడు ఎన్నాళ్ళు ??

Image
మన పాలకులు మైక్ ఇస్తే డప్పులు కొట్టి "అది ఇస్తాం  ,ఇది చేస్తాం" అంటారు గాని ,ముఖ్యమైన సమస్య మాత్రం పరిష్కరించరు .  అదే పిల్లల ఫీజు సమస్య !! ఒక బాబు గాని ,పాప గాని ప్రెవేట్ స్కూల్ కి వెళితే "నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఫీజు" చూస్తే కళ్ళు తిరిగి కింద పడాల్సిందే !! ఒకడు అడ్మిషన్ కి పదివేలు అంటాడు ,మరొకడు ఇరవై అంటాడు , మరొకడు ఇంటర్నేషనల్ స్కూల్ అండి "లక్ష " అని బాదుడు  చిన్న బడిలో సంవత్సరానికి సుమారుగా   30 నుంచి 70 వేలు గుంజుతున్నారు !! దీనిని కట్టడి చేసే వారు లేరా ?? ప్రభుత్వం అలా ఉంటె మనం కూడా పరువు,ప్రతిష్ట అని పక్కనోడు ఏమి చేస్తే మనం "అంతకు మించి " అని గొప్పలకు పోయే వారు లేకపోలేదు ...   చదువుకోవాలి  గాని చదువుని "కొనకూడదు ".  దీనికి చరమ  గీతం అందరం పాడి ఒక వ్యవస్థ ద్వారా "ఫీజు "కట్టడి చేయాలి .  ఇంతకు  మించి వసూల్ చేస్తే , వారి లైసెన్స్ రద్దు చేయాలి , అప్పుడు కానీ భయపడరు ... పిల్లలు బాగుపడరు 

మల్లె మనసులు

Image
"మల్లె" మనసులు  ప్రతి మనిషి జీవితం లో కుటుంబం తో పాటు కొంతమంది స్నేహితులు తప్పక ఉంటారు .  ఆలా స్నేహితులు లేని వారు చాలా అరుదు.  "మన స్నేహితులు ఎవరో చెపితే మనం ఎలాంటివాళ్ళో చెపుతా "అన్నారు ఓ కవి .  ఆలా నా జీవిత ప్రయాణం లో కొందరు ఉన్నారు .  వారిలో మర్చిపోలేని వారు కొందరు ,మర్చిపోతే బాగుంటుంది అనుకునే వారు కొందరు .  కాలేజీ లో పరిచయం ఐన  వారిలో "మల్లి " ఒక్కడు. చదువు లో, తెలివితేటల్లో ముందు .  మా క్లాస్ వాళ్ళతో  కన్నా వాడితో చనువు ఎక్కువ . కలిసి సిని మాలు ,షికార్లు .  కల్మషం లేని వ్యక్తి . వాడిని చూసి కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నా , ఎల్లప్పుడూ నా గురించి ,నా ఎదుగుదల గురించి ఆశిస్తాడు .  వారి కుటుంబం తో కూడా మంచి అనుబంధం ఉంది .  ప్రస్తుతం తను  నా దగ్గర్లో లేకపోయినా ఫోన్ లో మాట్లాడుతుంటాడు . వృత్తి రీత్యా  అమెరికా లో ఉంటున్నాడు .   ఒక పని లో నాలో నమ్మకం లేకపోతె ,చెప్పి నమ్మకం కలిగించి నాకు ప్రోత్సహిస్తాడు .  వృత్తిలో లేక బిజినెస్ లో గాని నష్టపోయినా ,కలతచెందిన అండ గా  ఉంటాడు .  ఆనందం గా ఉన్నపుడు ,డబ్బు ఉన్నపుడు అందరూ వ

కంటే కూతుర్నే కనాలి !!

Image
ఈ రోజుల్లో కూడా  అమ్మాయి పుట్టినా ఎదో కష్టం అని ఫీల్ అయ్యే జనాలు ఇంకా ఉన్నారు .. కానీ ఒక ఆడపిల్ల తండ్రి గా ఆ ప్రేమ ,ఆప్యాయత ముందు ఏదీ ఐనా చిన్నదే అనిపిస్తుంది ... వారి ముసిముసి నవ్వులు ,చిన్న మాటలు వింటుంటే అన్ని మర్చిపోతా !! ఇంటికి వెళ్లిన వెంటనే కబుర్లు ,ఆటలు ,పాటలు తో సందడే ... ఈ మధ్య డాన్స్ (నృత్యం) కూడా మొదలు ... కొత్త స్టెప్స్ నేర్పుతుంది నాకు .. నేను చేయకపోతే ఇది  కూడా రాదా? అని వెటకారం... :) చదరంగం  కూడా మొదలు పెట్టారు మేడం గారు... అప్పుడప్పుడు పాప పైన కోపం వస్తుంది గాని కొద్దీ సేపు మాత్రమే , మరలా తనతో చిన్నవాడిగా మారిపోతా .. దేవుడు అన్ని చోట్ల లేకపోయినా తన ప్రతి రూపంలా తల్లిగా,కూతురిగా ఉంటాడేమో ... ఆడ పిల్ల లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు కానీ తాను ఊరు వెళితే ఎదో తెలియని వెలితి నాలో,ఇంట్లో ... ఇంతకీ తన ముద్దు పేరు ఏమిటో తెలుసా "హనీ "....

ప్రభాస్ కి అంత సీన్ ఉందా ?

Image
ప్రభాస్ కి అంత సీన్ ఉందా ? "బాహు బలి"  ఒక ప్రభంజనం ...  రాజ మౌళి దర్శక ప్రతిభ ,కీరవాణి సంగీతం తొ దేశాన్ని ఊపేసింది.  ప్రభాస్,రానా ,అనుష్క,తమన్నా నటనతో మెప్పించారు,  రికార్డులు కొల్లగొట్టింది . బడ్జెట్ భారీగా పెట్టినా  తెలివి గా మార్కెట్ చేసుకొని 1000 కోట్లు దాటింది ,అంతవరకూ బాగానే ఉంది .  కానీ ప్రభాస్ తరువాతి 250  కోట్లు పెట్టదండం అంటే సాహసమే అని చెప్పాలి,ఒకే ఒక సినిమా చేసిన దర్శకుడు చేతిలో ఇంత  పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు.  కానీ అది ప్రభాస్ ఒక్కడి పేరుతో అంత వసూళ్లు సాధిస్తుందా ??అంత మార్కెట్ ఈ చిత్రం చేయగలదా ?? వేచిచూడాలి ... 

మార్పు మంచిదే కానీ ....

మార్పు మంచిదే కానీ ....  మనలో అందరం ఎదుట వారి తప్పులు వెతుకుతున్నాం కానీ మన బాధ్యత మాత్రం తెలుసుకోము . ఏమైనా అంటే "టైం లేదు " అని ఒక డైలాగ్ ఒకటి .  రోడ్ మీద వెళ్ళేటప్పుడు రాంగ్ రూట్ లో వెళతాం కానీ రూల్స్ అప్పుడు గుర్తు రావు , మన పని అయిపోవాలి కానీ పక్కనోడు పోయిన పర్లేదు . మార్పు మన నుంచి మొదలు కావాలి ,మనం మారితే జనం కి చెప్పచ్చు .

హాయ్ అండీ ,

హాయ్ అండీ , అందరికి నమస్కారము ... చాలా రోజులు తరువాత మరలా "బ్లాగ్" వ్రాయడం మొదలుపెట్టాను. మీ అందరి సహకారం  ఉంటె మరలా మంచి పోస్ట్లు వ్రాసి ,మీ మన్నలు పొందాలి అని ఆశిస్తూ .... సాయి