సంగీతం ఎంత మధురం
బాగా అలసిన మనిషికి ,వాడి మనసుకి వీనుల విందైన సంగీతం ఎంత మధురం గా ఉంటుందో !!
ఆ విషయం  ఈ మధ్య నాకు బాగా తెలిసింది . కాసేపు పాతపాటలు మరికొద్దిసేపు మెలోడీ వింటే, ఆ ఉల్లాసం ఉత్సాహం వేరు.
ఈ మధ్యకాలం లో పాటలు అంత ప్రభావం లేవు అనే చెప్పాలి ,"ఓల్డ్ ఈజ్ గోల్డ్" అన్నారు అందుకేనేమో పెద్దలు .
చిన్నపుడు పాటల పుస్తకాలు  కొని అవి చదివి నేర్చుకొని 'హమ్' చేసేవాళ్ళం , ఈ కాలం పిల్లలకి తెలీదు కదా !
ముంబై లో ఉన్నపుడు కూడా రోజు ఉదయం  పాటలు వింటూ ఆఫీస్ కి వెళ్లడం రావడం ,ఐనా ఆ పాటలు బోర్ కొట్టేది కాదు .టైం అసలు తెలిసేది కాదు . వీలు ఉంటె మీరు ట్రై చేయండి ...నేను చెప్పానా !!

నేను చెప్పానా !!

 చేసిన ప్రతి పనికి  ఫలితం తప్పక ఉంటుందని !
నోరు జారిన  ప్రతిఫలంగా "కత్తి మహేష్" కి ఆరునెలలు నగర  బహిష్కరణ విధించారు .
ఇంకా అదుపులేకుండా వాగితే శాశ్వతంగా నగరం నుంచి బయటకి తోలేస్తారని సాక్షాత్తు డి. జి. పి వివరించారు ,
వాక్కు స్వతంత్రం ఉంది కదా అని,ఇష్టం వచ్చినట్లు  మాట్లాడి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్న కారణంగా ఈ విధంగా చేయవలసి వచ్చిందని చెప్పారు

"కత్తి మహేష్ "- వీడికి పని లేదు


ఈ మధ్య అందరి నోట్లో ఒక్కటే చర్చ అదే "కత్తి మహేష్ " రాముడిని అనరాని  మాటలు  అన్నాడు అని !

నాకు రాముడు అంటే ఇష్టమైన  దైవం,ధర్మం గా ఎలా ఉండాలో నరుడు గా చూపించిన మహనీయుడు .
రామాయణం అంటే ఏమిటో కూడా తెలీదు కానీ రాముడు గురించి ప్రతివాడు తీర్పు చెప్పేస్తాడు .
"రామో విగ్రహవాన్ ధర్మః ",రాముడు  అంటే పోతపోసిన ధర్మం . అలాంటి దారిలో నడవటాని అందరు ప్రయత్నిస్తారు

 కానీ ఒక విషయం నాకు తోచింది ,,,

కత్తి మహేష్ కి  పనిపాట లేక టి వి ఛానల్ వాళ్ళు డబ్బు ఇస్తే లేక ఉచితం గా పబ్లిసిటీ కోసం నటుల్ని ,దేవుణ్ణి దూషిస్తునాడు . అలాంటి  వాడిని చూసి అసహ్యం కలుగుతుంది కానీ మనం ఓర్పు వహించాలి .
 దేవుడు అందరికి నోరు ఇచ్చాడు కానీ సద్వినియోగం చేసుకుంటే పుణ్యాత్ముడు అవుతాడు లేకపోతె దూర్తుడు గా మిగిలిపోతాడు ,వాడు తిడితే మనం అరిస్తే  వాడు  వాడికి మనకి తేడా ఏముంటుంది ?!
ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది అది మంచి ఐనా చెడు  ఐనా ,దానికి ఎవరు అతీతులు కారు ,కాస్త ఓర్పు ,సహనం ఉంటె కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది.  వెంకి రూట్ మార్చాడా ?
తెలుగు సినీ ప్రపంచం లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న "విక్టరీ వెంకటేష్" ఈ మధ్య సినిమాలు అంతగా ఆడటం లేదు ,ఏమి అనుకున్నాడో ఏమో కానీ కొంచెం విరామం తీసుకున్నాడు .
ఇప్పుడు మల్టి స్టారర్ గా "వరుణ్ తేజ్ " తో "ఎఫ్ 2" (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) జత కట్టారు .
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు .
 అనిల్ "రాజా ది గ్రేట్ "తరువాత చేస్తున్న  సినిమా ఇది.
దిల్ రాజు నిర్మా తగా "వరుణ్ "కి మూడవ చిత్రం .
హీరోయిన్ గా మెహ్రయిన్ చేస్తున్నారు  !!
ఈ కార్యక్రమం  లో అల్లు అరవింద్ పాల్గున్నారు . 

ఈ బ్యాంకులకు ఏమైంది ?సామాన్య ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి,రూపాయి పోగుచేసి సంపాదించినదంతా   దాచుకోవడానికి గతంలో బ్యాంకు లో జమ వేసేవారు . 

చీటీలు కడితే గ్యారంటీ లేదని కొందరు ,రిస్క్ చేయలేక కొందరు బ్యాంకు లో వేసేవారు . 
ఇప్పుడు కధ  మారింది !

నగదు అరికట్టాలని,నల్లధనం పాలత్రోలనో మన మోడీ సర్ "డిమానిటైజేషన్ " అమలు చేసారు . అది ఇంతవరకు ఏమి సాధించారో గాని ప్రజలు మాత్రం చిక్కులు ఇంకా కొనసాగుతున్నాయి . 
నగదు వేసినా  బాదుడు ,తీస్తే బాదుడు . మన డబ్బు మనం తీసుకున్న తప్పే !?

"ఏ .టి. ఎమ్" లో ఎప్పుడు డబ్బు ఉంటుందో ఆ దేవుడికే ఎరుక !!
"నో కాష్ " బోర్డులు వెక్కిరిస్తాయి . రెండు కిలోమీటర్లు తిరిగితే మీ అదృష్టం బాగుంటే డబ్బు ఉంటుంది ,వస్తుంది . లేదంటే చీటీ వెక్కిరిస్తుంది (నగదు లేదని ). 

ఈ మధ్య బ్యాంకు లో డబ్బు ఉన్నా కూడా దానికి కూడా "డబ్బు కత్తిరించారట" ఎస్. బి. ఐ  వారు !!
అది తెలిసి ఆ వినియోగదారుడు బ్యాంకు కి ఘాటుగా లేఖ రాసి ,అకౌంట్ మూసివేసాడు . 

డిజిటైజేషన్  చేయండి మంచిదే  అనే  సాకుతో "మమ్మలిని ముంచద్దు ,చంపద్దు .. "
అత్యవసరం గా డబ్బు కావాలి అప్పుడు దగ్గరగా ఉన్న "ఏ .టి. ఎమ్" లోదొరకోపోతే పరిస్థితి ఏమిటి ?

అభివృద్ధి చెంది పెద్ద దేశాలు ,సింగపూర్,మలేషియా లో ఇంకా నగదు వాడుతున్నారు ,మరి మనకి ఏమి రోగం ??
దమ్ము ,ధైర్యం  ఉంటె బ్యాంక్లో అప్పు తీసుకుని పారిపోయిన పెద్ద మనుషులని భారత దేశం రప్పించి ముక్కు పిండి కోట్లాది రూపాయలు  వసూల్  చేయండి ,
అప్పు ఎగ్గొటిన బొచ్చుడు పెద్ద కంపినీలు రోడ్డు మీదకి ఈడ్చి చెప్పుతో కొట్టి డబ్బు రాబట్టండి . 
స్విస్ బ్యాంకు లో నల్ల ధనం  తిరిగి తెప్పించండి ... 

దేశానికీ వెన్నుముక్క రైతు అని చెప్పడం కాదు,బ్యాంకు లు వారికీ రుణాలు ఇచ్చి వారిని ఆదుకోండి . 
సామాన్యుడు లక్ష రూపాయలు ఇవ్వాలంటే కోటి కాగితాలు అడుగుతారు ,అదే బలిసినవాడికి ఏమి గ్యారంటీ లేకండా  కోట్లు దొబ్బపెడతారు ?
ఇది ఎక్కడి న్యాయం !!

బ్యాంకు అప్పుచెల్లించడానికి  ప్రాణం పోయినా  ఎగ్గొట్టని రైతన్నలిని ఆదుకోండి . 
దేశానికీ మంచి చేయండి ... 

సొల్లు చెప్పద్దు . 
అది ఏ ప్రభుత్వం ఐన ,పార్టీ ఐనా !!

జై హింద్ ... 
సమ్మోహనం ...


తెలుగు సినిమా ప్రేక్షకులకి ఒక తెలియని అనుభూతి ,ఎన్నో ప్రేమ కధలు చూసాం కానీ ఇది దానికి కొంచెం ఎక్కువే !(నా ఫీలింగ్)

సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు తరువాత ఇప్పుడు వీడి సమీక్ష ఎవడికి కావాలి అనుకుంటే పొరపాటే !!

సగటు సినిమా పిచ్చి ఉన్న అభిమానిగా రాస్తున్నా ... రాయకుండా ఉండలేక పోతున్నా !

అనగనగ అందమైన కుటుంబం ... అమ్మ ,నాన్న ,చెల్లి,మన హీరో .. విజయకుమార్ (సుదీర్ బాబు ).
విజయ్ కి బొమ్మలు వేయడం అంటే ఇష్టం,పిల్లలకి కథలతో కూడిన బొమ్మలు వేసి పుస్తకం ప్రచురించాలని లక్ష్యం  !అది వారికీ విజ్ఞానం ఇస్తుంది అని నమ్మకం .

తనకి సినిమాలు అంటే మంచి అభిప్రాయం ఉండదు ,పడదు ,వారిది అంతా నటన అనే అభిప్రాయం ,కానీ తన స్నేహితులకి ఆ సినిమాలే ఇష్టం .

ఒక షూటింగ్ నిమిత్తం వీరి ఇల్లు 20 రోజులు కావాలని సినిమా వాళ్ళు అడగ్గా తండ్రి (నరేష్ )ఒక కండిషన్ పెడతాడు ,అదే తనకి చిన్న వేషం ఇవ్వాలని !!ఓకే అంటారు .

ఆ సినిమా లో హీరోయిన్ "సమీరా"(అదితిరావు )ని చూస్తాడు ,తనకి తెలుగు రాదని నవ్వుకుంటాడు . తనకి తెలుగు నేర్పమని అడగ్గా సరే అంటాడు .

అలా  కొన్ని రోజులకి వారి పరిచయం,స్నేహం గా  మారుతుంది ,తెలియకుండా ప్రేమించుకుంటారు .

షూటింగ్ పూర్తి అవుతుంది ,బాధగా వీడ్కోలు చెబుతారు .
కానీ విజయ్ మనసు మనసులో ఉండదు . పేపర్ లో వారి షూటింగ్ మనాలి లో జరుగుతుంది అని తెలిసి వెళ్లి తనని కలిసి "ప్రేమిస్తున్నాను " అని చెబుతాడు .
కానీ ఆమె ఒప్పుకోదు ,తనని ఆ దృష్టితో చూడలేదు అని చెప్పి వెళ్లి పోతుంది .

ఆలా సమీరా చెప్పడానికి కారణం ఏమిటి ?
నిజం గా సమీరాకి ఇష్టం లేదా ? అనేది మిగిలిన కథ .
విజయ్ లక్ష్యం  నెరవేరిందా !
వారు ఒకటి అవుతారా లేదా ??

దర్శకుడు "ఇంద్రగంటి " గారిని పొగడకుండా ఉండలేము ,"ప్రేమ కథ "తో ఎన్నో సినిమాలు వస్తాయి కానీ వీరి  ప్రేమ ,.... నటుల కళ్ళలో కనిపించింది,జీవించారు .
హీరో హీరోయిన్ పరిచయమైన సీన్ ,టెర్రస్ పై న సన్నీ వేశాలు అన్ని సహజం గా ఉన్నాయి .
అందరూ పోటీపడి నటించారు.
కుటుంబం అంతా కలిసి చూసే సినిమా ..
ఈ రోజుల్లో ఇది అరుదైన విషయం కదా !


మ్యూజిక్ మరో మాజిక్ . పాటలు ఎన్ని ఉన్నాయి తెలియదు కానీ ,ఆలా సన్నివేసా ల్లో కలిసి పోతాయి . ఒక ఫ్రెష్ నెస్ ఉంటుంది .ఏది అతికినట్టు ఉండవు .
అదికూడా దర్శకుడి ప్రతిభని చెప్పాలి ..

కెమెరా పనితనం హైలెట్ ,ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతం గా మలిచారు .

మొదటి భాగం కొన్ని సీన్లు నెమ్మదిగా సాగాయి కానీ మొత్తం  మీద మంచి చిత్రం చూశామని తృప్తి ... ఫీలింగ్ ...

అక్కడక్కడా నరేష్ అల్లరి,హంగామా కొంచెం ఎక్కువ ఉన్నా ఒకే అనిపిస్తుంది 
ప్రేక్షకుల మదిలో సమ్మోహనం చేసిందనే చెప్పాలి ....