మల్లె మనసులు

"మల్లె" మనసులు 

ప్రతి మనిషి జీవితం లో కుటుంబం తో పాటు కొంతమంది స్నేహితులు తప్పక ఉంటారు . 
ఆలా స్నేహితులు లేని వారు చాలా అరుదు. 
"మన స్నేహితులు ఎవరో చెపితే మనం ఎలాంటివాళ్ళో చెపుతా "అన్నారు ఓ కవి . 
ఆలా నా జీవిత ప్రయాణం లో కొందరు ఉన్నారు . 

వారిలో మర్చిపోలేని వారు కొందరు ,మర్చిపోతే బాగుంటుంది అనుకునే వారు కొందరు . 

కాలేజీ లో పరిచయం ఐన  వారిలో "మల్లి " ఒక్కడు. చదువు లో, తెలివితేటల్లో ముందు . 
మా క్లాస్ వాళ్ళతో  కన్నా వాడితో చనువు ఎక్కువ . కలిసి సిని మాలు ,షికార్లు . 

కల్మషం లేని వ్యక్తి . వాడిని చూసి కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నా ,
ఎల్లప్పుడూ నా గురించి ,నా ఎదుగుదల గురించి ఆశిస్తాడు . 
వారి కుటుంబం తో కూడా మంచి అనుబంధం ఉంది . 

ప్రస్తుతం తను  నా దగ్గర్లో లేకపోయినా ఫోన్ లో మాట్లాడుతుంటాడు . వృత్తి రీత్యా  అమెరికా లో ఉంటున్నాడు . 
 ఒక పని లో నాలో నమ్మకం లేకపోతె ,చెప్పి నమ్మకం కలిగించి నాకు ప్రోత్సహిస్తాడు . 
వృత్తిలో లేక బిజినెస్ లో గాని నష్టపోయినా ,కలతచెందిన అండ గా  ఉంటాడు . 
ఆనందం గా ఉన్నపుడు ,డబ్బు ఉన్నపుడు అందరూ వస్తారు ఉంటారు ,అవి లేని సమయం లోనే అసలు మిత్రుడు మనకు తెలుస్తాడు . 
అటువంటి వాడిని ఇచ్చినందుకు దేవుడు కి కృతజ్ఞతలు ....