Posts

Showing posts with the label healthy tips

ఆరోగ్యమే మహా భాగ్యం

Image
ఆరోగ్యమే మహా భాగ్యం .... ప్రతి మనిషి తన జీవితం హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు .చక్కని ఆరోగ్యం కోసం తాజా పండ్లు తింటారు . కానీ దురదృష్టవశాత్తూ నేటి పోటీ ప్రపంచంలో సంపాదనే ద్యేయంగా  సరైన  పండ్లు ,కూరగాయలు  లేక ఎన్నో కష్టాలు "కొని" తెచ్చుకుంటున్నాడు . రాత్రనక, పగలనక కష్టపడి సంపాదించిన డబ్బు తో కల్తీ కూరగాయలు ,పండ్లు తిని అనారోగ్యం పాలవుతున్నారు. తరువాత ఆ రోగాల నివారణ కోసం హాస్పిటల్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి  జీవితం నాశనం చేసుకుంటున్నాడు . ఉదాహరణకి మార్కెట్ లో దొరికే అరటిపళ్ళు ,మామిడి కాయలు తీసుకుందాం.  వాటిని పూర్తిగా ముగ్గనివ్వకుండా సొమ్ము చేసుకోవాలని కకృతి తో  వాటిని మగ్గ బెట్టి లేక ,కొన్ని రసాయనాలు లేదా ఎథలీన్ గ్యాస్ వంటి వాటితో నిగనిగలాడే  చక్కని రూపం తీసుకొచ్చి వినియోగదారుడిని బోల్తా కొట్టిస్తున్నాడు.అటువంటి పండ్లు తీసుకొని ప్రజలు ప్రమాదంలో పడుతున్నారు . దీని వల్ల వారి  ఆరోగ్యం పాడవుతుంది,వ్యాపారాలు జేబు నిండుతుంది. ఇటువంటి సంఘటనలు చూసి ప్రజలకు మంచి చేయాలనే మంచి సంకల్పంతో  సేంద్రియ పద...