ఈ బ్యాంకులకు ఏమైంది ?
సామాన్య ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి,రూపాయి పోగుచేసి సంపాదించినదంతా దాచుకోవడానికి గతంలో బ్యాంకు లో జమ వేసేవారు . చీటీలు కడితే గ్యారంటీ లేదని కొందరు ,రిస్క్ చేయలేక కొందరు బ్యాంకు లో వేసేవారు . ఇప్పుడు కధ మారింది ! నగదు అరికట్టాలని,నల్లధనం పాలత్రోలనో మన మోడీ సర్ "డిమానిటైజేషన్ " అమలు చేసారు . అది ఇంతవరకు ఏమి సాధించారో గాని ప్రజలు మాత్రం చిక్కులు ఇంకా కొనసాగుతున్నాయి . నగదు వేసినా బాదుడు ,తీస్తే బాదుడు . మన డబ్బు మనం తీసుకున్న తప్పే !? "ఏ .టి. ఎమ్" లో ఎప్పుడు డబ్బు ఉంటుందో ఆ దేవుడికే ఎరుక !! "నో కాష్ " బోర్డులు వెక్కిరిస్తాయి . రెండు కిలోమీటర్లు తిరిగితే మీ అదృష్టం బాగుంటే డబ్బు ఉంటుంది ,వస్తుంది . లేదంటే చీటీ వెక్కిరిస్తుంది (నగదు లేదని ). ఈ మధ్య బ్యాంకు లో డబ్బు ఉన్నా కూడా దానికి కూడా "డబ్బు కత్తిరించారట" ఎస్. బి. ఐ వారు !! అది తెలిసి ఆ వినియోగదారుడు బ్యాంకు కి ఘాటుగా లేఖ రాసి ,అకౌంట్ మూసివేసాడు . డిజిటైజేషన్ చేయండి మంచిదే ...