Posts

Showing posts with the label anti-pavan

అలోచించి మాట్లాడండి !!

Image
మన రాజకీయనాయకులు ఈ మధ్య అనవసరంగా  కొన్ని  విషయాలు  ప్రాధాన్యం ఇస్తున్నారు . మేము రాజకీయాల్లోకి ప్రజల సేవకోసం వచ్చామని  ,ఇంకా ఎదో సొల్లు చెప్పి మీటింగుల్లో మాటలతో దంచికొడతారు . గెలిచిన తరువాత సరిగ్గా ఒకడు కూడా వారి సొంత జిల్లా గాని,ఊరిలో గాని తిరిగి వారి సమస్యలు తీర్చడానికి  ప్రయత్నం చేయరు ,కానీ వేరే వారి  వ్యక్తిగత జీవితాలు గురించి మాట్లాడటం ఐతే తెలుసు . విమర్శలు చేయడం రాజకీయాల్లో సహజం కానీ మరి ఇంత దిగజారి చేస్తే మీరే ఇరుకునపడతారు . అపహాస్యం అవుతారు దానికి వారి సొంత పార్టీలోనే వ్యతిరేకత ఏర్పాడుతుంది .  తరువాత  ఎన్నికలకి వెళితే మీ ముఖం కూడా చూడటానికి కూడా జనం ఇష్టపడరు . "ఎవడికో ఎంతమంది పెళ్ళాలు  ఉన్నారు",  వీళ్ళకి  కావాలి ,గాని వీరికి నీతి న్యాయం ఉండదు.  తండ్రి పేరు చెప్పుకొని ఒకడు ,మామ పెట్టి న పార్టీలు తో మరొకడు మనుగడ సాగిస్తున్నారు  గాని  వాళ్ళమీద ఎన్ని కేసులు ఉన్నాయో ఎవరికి  తెలియదు .ప్రతి శుక్రవారం వెళ్లి కోర్టులో సంతకాలు పెట్టాలి ఒక సర్ . సుమారు రెండువేల కిలోమీ...

"కత్తి మహేష్ "- వీడికి పని లేదు

Image
ఈ మధ్య అందరి నోట్లో ఒక్కటే చర్చ అదే "కత్తి మహేష్ " రాముడిని అనరాని  మాటలు  అన్నాడు అని ! నాకు రాముడు అంటే ఇష్టమైన  దైవం,ధర్మం గా ఎలా ఉండాలో నరుడు గా చూపించిన మహనీయుడు . రామాయణం అంటే ఏమిటో కూడా తెలీదు కానీ రాముడు గురించి ప్రతివాడు తీర్పు చెప్పేస్తాడు . "రామో విగ్రహవాన్ ధర్మః ",రాముడు  అంటే పోతపోసిన ధర్మం . అలాంటి దారిలో నడవటాని అందరు ప్రయత్నిస్తారు  కానీ ఒక విషయం నాకు తోచింది ,,, కత్తి మహేష్ కి  పనిపాట లేక టి వి ఛానల్ వాళ్ళు డబ్బు ఇస్తే లేక ఉచితం గా పబ్లిసిటీ కోసం నటుల్ని ,దేవుణ్ణి దూషిస్తునాడు . అలాంటి  వాడిని చూసి అసహ్యం కలుగుతుంది కానీ మనం ఓర్పు వహించాలి .  దేవుడు అందరికి నోరు ఇచ్చాడు కానీ సద్వినియోగం చేసుకుంటే పుణ్యాత్ముడు అవుతాడు లేకపోతె దూర్తుడు గా మిగిలిపోతాడు ,వాడు తిడితే మనం అరిస్తే  వాడు  వాడికి మనకి తేడా ఏముంటుంది ?! ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది అది మంచి ఐనా చెడు  ఐనా ,దానికి ఎవరు అతీతులు కారు ,కాస్త ఓర్పు ,సహనం ఉంటె కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది.