"కత్తి మహేష్ "- వీడికి పని లేదు
ఈ మధ్య అందరి నోట్లో ఒక్కటే చర్చ అదే "కత్తి మహేష్ " రాముడిని అనరాని మాటలు అన్నాడు అని ! నాకు రాముడు అంటే ఇష్టమైన దైవం,ధర్మం గా ఎలా ఉండాలో నరుడు గా చూపించిన మహనీయుడు . రామాయణం అంటే ఏమిటో కూడా తెలీదు కానీ రాముడు గురించి ప్రతివాడు తీర్పు చెప్పేస్తాడు . "రామో విగ్రహవాన్ ధర్మః ",రాముడు అంటే పోతపోసిన ధర్మం . అలాంటి దారిలో నడవటాని అందరు ప్రయత్నిస్తారు కానీ ఒక విషయం నాకు తోచింది ,,, కత్తి మహేష్ కి పనిపాట లేక టి వి ఛానల్ వాళ్ళు డబ్బు ఇస్తే లేక ఉచితం గా పబ్లిసిటీ కోసం నటుల్ని ,దేవుణ్ణి దూషిస్తునాడు . అలాంటి వాడిని చూసి అసహ్యం కలుగుతుంది కానీ మనం ఓర్పు వహించాలి . దేవుడు అందరికి నోరు ఇచ్చాడు కానీ సద్వినియోగం చేసుకుంటే పుణ్యాత్ముడు అవుతాడు లేకపోతె దూర్తుడు గా మిగిలిపోతాడు ,వాడు తిడితే మనం అరిస్తే వాడు వాడికి మనకి తేడా ఏముంటుంది ?! ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది అది మంచి ఐనా చెడు ఐనా ,దానికి ఎవరు అతీతులు కారు ,కాస్త ఓర్పు ,సహనం ఉంటె కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది.