Posts

Showing posts with the label CONTENT

మధురం మధురం ...

Image
మధురం మధురం ... సెల్ ఫోన్ మధురం మాటలు మధురం పాటలు మధురం ఆటలు మధురం ... వాట్సాప్ మధురం ఎఫ్ బి  మధురం చాటింగ్ చేసె మీరు మధురం .... దూరం దగ్గర చేసే సెల్ఫోన్  మధురం (షాక్ సినిమా స్ఫూర్తి తో )

"ఆ సినిమాకి" ఇప్పుడే ఇంత క్రేజా !!

Image
విశ్వవిఖ్యాత నట సార్వ భౌముఁడు శ్రీ  నందమూరి తారక రామా రావు గారి   బయోపిక్ "ఎన్ .టి .ఆర్ "చిత్రం తెరకెక్కుతుంది .దీనికి అతనికి కుమారుడు "బాలకృష్ణ" లీడ్ రోల్ చేస్తున్నారు . ముఖ్యపాత్రలో "విద్యాబాలన్ "నటిస్తున్నారు . క్రిష్ దర్శకత్వము వహిస్తున్నారు . ఇప్పటికి ఒక షెడ్యూల్ కూడా పూర్తిఅయింది . ఈ చిత్రం షూటింగ్ దశలోనే మంచి అంచనాలు ఉన్నాయి ,దానికి తోడు ఇప్పుడు మరో ఆసక్తి కరమైన విషయం బయటకి వచ్చింది . ఈ చిత్రం యొక్క పూర్తి హక్కుల కోసం రిలయన్స్ ,సోని లాంటి దిగ్గజాలు పోటీపడుతున్నాయని దానికి సుమారు 85 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్దపడ్డాయని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఇది ఎంతవరకు నిజమో గాని కానీ "సినిమాకి రిలీజ్ కి ముందే మంచి క్రేజ్,బిజినెస్   ఏర్పడింది",పూర్తి అయ్యే లోపు ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ,దానితో  చిత్రం  ఇంకా ఎన్ని  రికార్డులు కొల్లగొడుతుందో !! వేచి చూద్దాం ...

మీ కెరీర్ ఏమి ఎంచుకున్నారు ?

Image
హలో  మిత్రులారా !! మీకు బ్లాగ్ రాయడం హాబీ నా లేక సరదాగా రాస్తారా ? మీ కెరీర్ ఏమి ఎంచుకున్నారు ? మీలో  ఎవరైనా రచయితలు   ఉద్యోగ అవకాశాలు కోసం చూస్తూ ఉంటె నాది  చిన్న విన్నపం .  ఈ లింక్ లో "కంటెంట్ రైటర్స్-తెలుగు ,ఇంగ్లీష్  " అవకాశాలు ఉన్నాయి,చూసి నచ్చితే మీ బయో-డేటా పంపండి  https://www.naukri.com/telugu-content-writer-jobs.  అలాగే  https://www.quikr.com/jobs/telugu-content-writer-jobs-in-hyderabad+hyderabad+zwqxj4157493934 శుభం భూయాత్ .... 

సింగర్ సునీత రెండో పెళ్లి ... నిజం కాదు

నిన్న ప్రచురించిన సింగర్ సునీతా రెండో వివాహం మీద ఆమె స్పందించారు ,ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదని,ఎవరో కావాలని పుకార్లు చేస్తున్నారని ,తమ వ్యక్తిగత  వారికీ ఎందుకు అంత కుతూహలం? అని ఆవేదన చెందారు . తనకి అటువంటి ఉద్దేశం లేదని చెప్పారు .

సింగర్ సునీత రెండో పెళ్ళి!!

Image
గాయనిగా ,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా  "సునీత" టాలీవుడ్ లో  తనకంటూ ప్రత్యేక  స్థానం ఉంది,కానీ ఆమె  వ్యక్తిగత జీవితం ఆటుపోట్లు గా సాగింది .ఆమె  కిరణ్ అనే వ్యక్తి ని  వివాహమ్ చేసుకున్నారు ,వివిధ కారణాల వల్ల  భర్త  తో విడిపోయారు ,వారికీ ఒక పాప ఉంది . ఇప్పుడు ఆమె (సెకండ్ ఇన్నింగ్స్ )రెండో వివాహం  ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ తో అని తేలింది . ఆమె జీవితం సుఖంగా ఉండాలని ఆశిద్దాం!!  

బిగ్ బాస్ లో "సరదాలు "...

Image
చాలా వారాలు  తరువాత "బిగ్ బాస్" షో లో  "నవ్వులు విరిసాయి . ఇన్ని వారాలు షో లో ఎప్పుడూ టాస్క్లు ,గొడవలు లేకపోతె నాని తో క్లాస్ . మొన్న వారం కాస్త ఉపశమనం అనే చెప్పాలి . ఐస్ మీద నిలబడి బౌల్ లో చీటీ చూసి దానిలో  ఉన్న పాట "సంజ్ఞలతో " చేసి చూపించాలి . మాటలాడకూడదు . మొదటిది హౌస్ లో ఉన్న సభ్యులు చెప్పాలి, రెండోది "నాని " చెప్పాలి ,అలా హాయిగా నవ్వులతో సాగింది . నాని కూడా బాగా అలవాటు పడి టెన్షన్ లేకుండా చేస్తున్నారు . ఏది ఏమైనా మొదటి భాగం తో పోలిస్తే కాస్త వెనుక పడింది అనే చెప్పాలి . భాను నిష్క్రమణ దాదాపు అందరూ ఊహించిందే . ఈ  వారం లో "బిగ్ బాస్" అందరితో "సినిమా " తీయాలి అనే టాస్క్ ఇచ్చారు , దానికి అమిత్ దర్శకుడు ,దీప్తి సహాదర్శకురాలు ,రోల్ రెడా కెమెరా ,తేజస్వి నృత్య దర్శకురాలు ,మేకప్ ,కాస్ట్యూమ్స్ . దర్శకుడు, సహాదర్శకురాలు కలిసి ఒక కాన్సెప్ట్ అనుకొని కథ  కధనం తయారు చేసి రూపకల్పన చేయాలి . ఆడిషన్స్ అయ్యాక కౌశల్ ,తనీష్ ,సామ్రాట్ ఎంపికచేసుకొన్నారు ,వారు స్నేహితులు గా ఒక కథ  నడుస్తుంది . కౌశల్ కి నందిని పరిచయం అయ్యి తనీష్ ని దూ...

నేను చెప్పానా !!

నేను చెప్పానా !!  చేసిన ప్రతి పనికి  ఫలితం తప్పక ఉంటుందని ! నోరు జారిన  ప్రతిఫలంగా "కత్తి మహేష్" కి ఆరునెలలు నగర  బహిష్కరణ విధించారు . ఇంకా అదుపులేకుండా వాగితే శాశ్వతంగా నగరం నుంచి బయటకి తోలేస్తారని సాక్షాత్తు డి. జి. పి వివరించారు , వాక్కు స్వతంత్రం ఉంది కదా అని,ఇష్టం వచ్చినట్లు  మాట్లాడి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్న కారణంగా ఈ విధంగా చేయవలసి వచ్చిందని చెప్పారు

మార్పు మంచిదే కానీ ....

మార్పు మంచిదే కానీ ....  మనలో అందరం ఎదుట వారి తప్పులు వెతుకుతున్నాం కానీ మన బాధ్యత మాత్రం తెలుసుకోము . ఏమైనా అంటే "టైం లేదు " అని ఒక డైలాగ్ ఒకటి .  రోడ్ మీద వెళ్ళేటప్పుడు రాంగ్ రూట్ లో వెళతాం కానీ రూల్స్ అప్పుడు గుర్తు రావు , మన పని అయిపోవాలి కానీ పక్కనోడు పోయిన పర్లేదు . మార్పు మన నుంచి మొదలు కావాలి ,మనం మారితే జనం కి చెప్పచ్చు .

హాయ్ అండీ ,

హాయ్ అండీ , అందరికి నమస్కారము ... చాలా రోజులు తరువాత మరలా "బ్లాగ్" వ్రాయడం మొదలుపెట్టాను. మీ అందరి సహకారం  ఉంటె మరలా మంచి పోస్ట్లు వ్రాసి ,మీ మన్నలు పొందాలి అని ఆశిస్తూ .... సాయి