రాము (రామ్ గోపాల్ వర్మ ) కు పూర్వ వైభవం వస్తుందా !


సినీ చరిత్రలో  దర్శకుల ఎంత మంది ఉ న్నా  ఇతడు వేరు ..
కాపి కొడితే కొట్టానని ధైర్యం గా చెబుతాడు ,
ప్లాప్ ఐన సరే దానికి సీక్వల్ తీస్తాడు ..

ఏమైనా అంటే "నా ఇష్టం , ఇష్టం ఉంటె చూడు లేక పొతే  లేదు  "అని అంటాడు ,
అతడే  రాము (రామ్ గోపాల్ వర్మ ).

సంచలనాలికి  మారుపేరు ,మొదట్లో చాలా  మంచి చిత్రాలు (శివ ,క్షణక్షణమ్ లాంటివి  )తీసాడు  ,రాను రాను అతనిలో పస తగ్గింది .

తన బుర్రలో వచ్చిన దిక్కుమాలిన ఆలోచనకి కూడా సినిమా చేసి జనాల్లోకి వదలటం మొదలు పెట్టాడు .

రామ్ గోపాల్ వర్మ అంటే పడిచచ్చే వాడికి కూడా చచ్చేలా చేసాడు .

ఇంకో పక్క ట్విట్టర్ లో షరా మాములే ,ఎవర్ని వదలడు ...  కెలకడం అతని హాబీ !!

ఈ మధ పవన్ తో వివాదం,దుమారం  అందరికి తెలిసిందే ...

అన్ని కష్టాల్లో ఉన్నా ,బ్రేక్ ఇచ్చిన నాగ్ అవకాశం  ఇస్తే  ,( ఆఫీసర్) తో షాక్ ఇచ్చి న ఘనుడు .

"ఈ సినిమా మర్చిపోండి " అని నాగ్ చేతే అనిపించాడు . 

రాము కు పూర్వ వైభవం వస్తుందో లేక పొతే కథ ముగుస్తుందో వేచి చూడాలి ....  

బిగ్ బాస్ షో -2 .ఇంతకూ ముందు బిగ్ బాస్ -1 లో జూనియర్ ఎన్ . టి. ఆర్ . వ్యాఖ్యాత  గాచేసే వారు ,ఇప్పుడు "నాని " వ్యాఖ్యాత  గా వ్యవహరిస్తున్నారు .

కొంతమంది హీరో లు ,టి వి నటులు ,కొంతమంది సామాన్యులు ఈ గేమ్ లో ఆడుతున్నారు .
సుమారు వంద రోజుల్లో అందరు కలిసి ఆ హౌస్ లో ఉండాలి .
బయటకి వెళ్ళటానికి అనుమతి ఉండదు . మైక్ ధరించాలి .
ఆందరు అక్కడే ఉండి  వండుకుని ,తిని పడుకోవాలి .
బిగ్ బాస్ ఏమి టాస్క్ ఇస్తే అది కూడా చేయాలి

ప్రతి వారానికి ఒక కెప్టెన్ ని బిగ్ బాస్ ఎంపిక చేస్తారు .
వారి అడుగు జాడల్లో వీరు ఉండాలి ,,కానీ కెప్టెన్ కి ఆ వారం లో  ఎలిమినేషన్ ఉండదు 

 ఇది ఒకరకమైన మైండ్ గేమ్ అని నా అభిప్రాయం .

మన మాటలతో,పనులతో ఎదుటివారిని ఎదో రకం గా బయటకి పంపించాలి  అని చూసే వారు ఎక్కువ . దానికి ఎన్నో వ్యూహాలు రచిస్తారు కానీ కనపడరు

ఈ సీజన్ లో నాని ఏంకర్  గా కొత్త ,కానీ  అలవాటు పడుతున్నాడు 

నిన్న సంజన అనే అమ్మాయి ని బయటకి పంపించారు ,
నందిని ఎంట్రీ ఇస్తుంది .

 ఈ షో అయ్యే లోపు వారికీ మంచి పేరు ,ప్రఖ్యాతలు ,ఆఫర్లు వస్తున్నాయి . ఇది  ఒకరకం గా ఆ నటులకి ,గాయని గాయకులకు ,సామాన్యులకి  మంచి పరిణామమే .పచ్చి నిజాలు ...ప్రతి వాడు పక్కనున్న వాడిని చూసి అలా మనం ఎందుకు లేము ,
మనకు డబ్బు లేదు ,ఇల్లు లేదు,కారులేదు అని ఎదోరకం గా భాదపడేవారే !!(చాలామంది )

కానీ మనకు ఉన్నదానితో సంతోషం గా ఉండాలని ,కష్ట పడి  పైకి వెళదాం అనుకునే వారు
బహు తక్కువ..
ఈజీ మని కావాలి ,పని చేయకూడదు ...
అని చాలా మంది యువత ,పెద్దవారు అనుకుంటారు ...


అలా ఆలోచించటం వారి ఇష్టం . కానీ ఆలా వచ్చిన డబ్బు . పదవులు   అంత సంతృప్తి ఇవ్వవు
 కష్టపడడం ... ఫలితం అదే వస్తుంది అని గ్రహించి ,పెద్దవారు పిల్లలకు నేర్పాలి .

ఇవన్నీ సోది లాగా ఉంటుంది గాని పచ్చి నిజాలు ...
నమ్మితే మంచిదే ,నమ్మక పోయిన ఇంకా మంచిది ..
ఎదో చెప్పాలి అని చిన్న ప్రయత్నం ...

నీతిగా ఉండటానికి ప్రయత్నించాలి ,విజయాలు సాదించాలి ...


సమయం వస్తుంది మిత్రమా ... !


ఒకోసారి మన ప్రయత్నం చేసిన ఫలితం రాదు ,మరికొన్నిసార్లు ఏమి చేయకుండానే మంచి ఫలాలు వస్తాయి . 
కానీ చేసి పని ,ఎదగడానికి ప్రయత్నం మాత్రం తప్పక చేయాలి ,
లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. 
చల్లని చెట్టు కింద ఉంటె బాగుంటుంది కానీ అదే అలవాటు ఐతే చిన్న వేడిని కూడా తట్టుకోలేము ... 
కాబట్టి "కష్టే  ఫలి "... 
సమయం సందర్భం వస్తే మంచి ఫలితాలు  అవే వస్తాయి ,ఎల్ల  కాలం ఒకలా ఉండదు గా ... 

ఈ బాదుడు ఎన్నాళ్ళు ??మన పాలకులు మైక్ ఇస్తే డప్పులు కొట్టి "అది ఇస్తాం  ,ఇది చేస్తాం" అంటారు గాని ,ముఖ్యమైన సమస్య మాత్రం పరిష్కరించరు . 

అదే పిల్లల ఫీజు సమస్య !!

ఒక బాబు గాని ,పాప గాని ప్రెవేట్ స్కూల్ కి వెళితే "నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఫీజు" చూస్తే కళ్ళు తిరిగి కింద పడాల్సిందే !!

ఒకడు అడ్మిషన్ కి పదివేలు అంటాడు ,మరొకడు ఇరవై అంటాడు ,
మరొకడు ఇంటర్నేషనల్ స్కూల్ అండి "లక్ష " అని బాదుడు 

చిన్న బడిలో సంవత్సరానికి సుమారుగా   30 నుంచి 70 వేలు గుంజుతున్నారు !!

దీనిని కట్టడి చేసే వారు లేరా ??

ప్రభుత్వం అలా ఉంటె మనం కూడా పరువు,ప్రతిష్ట అని పక్కనోడు ఏమి చేస్తే మనం "అంతకు మించి " అని గొప్పలకు పోయే వారు లేకపోలేదు ... 

చదువుకోవాలి  గాని చదువుని "కొనకూడదు ". 

దీనికి చరమ  గీతం అందరం పాడి ఒక వ్యవస్థ ద్వారా "ఫీజు "కట్టడి చేయాలి . 

ఇంతకు  మించి వసూల్ చేస్తే ,వారి లైసెన్స్ రద్దు చేయాలి ,
అప్పుడు కానీ భయపడరు ... పిల్లలు బాగుపడరు 

మల్లె మనసులు

"మల్లె" మనసులు 

ప్రతి మనిషి జీవితం లో కుటుంబం తో పాటు కొంతమంది స్నేహితులు తప్పక ఉంటారు . 
ఆలా స్నేహితులు లేని వారు చాలా అరుదు. 
"మన స్నేహితులు ఎవరో చెపితే మనం ఎలాంటివాళ్ళో చెపుతా "అన్నారు ఓ కవి . 
ఆలా నా జీవిత ప్రయాణం లో కొందరు ఉన్నారు . 

వారిలో మర్చిపోలేని వారు కొందరు ,మర్చిపోతే బాగుంటుంది అనుకునే వారు కొందరు . 

కాలేజీ లో పరిచయం ఐన  వారిలో "మల్లి " ఒక్కడు. చదువు లో, తెలివితేటల్లో ముందు . 
మా క్లాస్ వాళ్ళతో  కన్నా వాడితో చనువు ఎక్కువ . కలిసి సిని మాలు ,షికార్లు . 

కల్మషం లేని వ్యక్తి . వాడిని చూసి కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నా ,
ఎల్లప్పుడూ నా గురించి ,నా ఎదుగుదల గురించి ఆశిస్తాడు . 
వారి కుటుంబం తో కూడా మంచి అనుబంధం ఉంది . 

ప్రస్తుతం తను  నా దగ్గర్లో లేకపోయినా ఫోన్ లో మాట్లాడుతుంటాడు . వృత్తి రీత్యా  అమెరికా లో ఉంటున్నాడు . 
 ఒక పని లో నాలో నమ్మకం లేకపోతె ,చెప్పి నమ్మకం కలిగించి నాకు ప్రోత్సహిస్తాడు . 
వృత్తిలో లేక బిజినెస్ లో గాని నష్టపోయినా ,కలతచెందిన అండ గా  ఉంటాడు . 
ఆనందం గా ఉన్నపుడు ,డబ్బు ఉన్నపుడు అందరూ వస్తారు ఉంటారు ,అవి లేని సమయం లోనే అసలు మిత్రుడు మనకు తెలుస్తాడు . 
అటువంటి వాడిని ఇచ్చినందుకు దేవుడు కి కృతజ్ఞతలు .... 

కంటే కూతుర్నే కనాలి !!ఈ రోజుల్లో కూడా  అమ్మాయి పుట్టినా ఎదో కష్టం అని ఫీల్ అయ్యే జనాలు ఇంకా ఉన్నారు ..
కానీ ఒక ఆడపిల్ల తండ్రి గా ఆ ప్రేమ ,ఆప్యాయత ముందు ఏదీ ఐనా చిన్నదే అనిపిస్తుంది ...

వారి ముసిముసి నవ్వులు ,చిన్న మాటలు వింటుంటే అన్ని మర్చిపోతా !!
ఇంటికి వెళ్లిన వెంటనే కబుర్లు ,ఆటలు ,పాటలు తో సందడే ...
ఈ మధ్య డాన్స్ (నృత్యం) కూడా మొదలు ... కొత్త స్టెప్స్ నేర్పుతుంది నాకు .. నేను చేయకపోతే ఇది  కూడా రాదా? అని వెటకారం... :)

చదరంగం  కూడా మొదలు పెట్టారు మేడం గారు...

అప్పుడప్పుడు పాప పైన కోపం వస్తుంది గాని కొద్దీ సేపు మాత్రమే ,
మరలా తనతో చిన్నవాడిగా మారిపోతా ..
దేవుడు అన్ని చోట్ల లేకపోయినా తన ప్రతి రూపంలా తల్లిగా,కూతురిగా ఉంటాడేమో ...
ఆడ పిల్ల లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు కానీ తాను ఊరు వెళితే ఎదో తెలియని వెలితి నాలో,ఇంట్లో ...
ఇంతకీ తన ముద్దు పేరు ఏమిటో తెలుసా "హనీ "....