Posts

Showing posts with the label prema

మధురం మధురం ...

Image
మధురం మధురం ... సెల్ ఫోన్ మధురం మాటలు మధురం పాటలు మధురం ఆటలు మధురం ... వాట్సాప్ మధురం ఎఫ్ బి  మధురం చాటింగ్ చేసె మీరు మధురం .... దూరం దగ్గర చేసే సెల్ఫోన్  మధురం (షాక్ సినిమా స్ఫూర్తి తో )

నాన్న కూచి !!

Image
ఎంత సూపర్ స్టార్ ఐనా కూతురు అంటే ప్రేమ ,ఆప్యాయత లేకుండా ఎలా ఉంటారు !! దానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ వేరు కాదు కదా !! తన కూతురు "సితార పుట్టిన రోజు " వేడుకల్లో ఇలా .... 

సింగర్ సునీత రెండో పెళ్లి ... నిజం కాదు

నిన్న ప్రచురించిన సింగర్ సునీతా రెండో వివాహం మీద ఆమె స్పందించారు ,ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదని,ఎవరో కావాలని పుకార్లు చేస్తున్నారని ,తమ వ్యక్తిగత  వారికీ ఎందుకు అంత కుతూహలం? అని ఆవేదన చెందారు . తనకి అటువంటి ఉద్దేశం లేదని చెప్పారు .

చిరునవ్వుతో - పార్ట్ 1

Image
"పచ్చటి పొలాలు మధ్యలో కొన్ని ఇళ్ళు ,దానిలో ఒక చిన్న డాబా .ఆ ఇంట్లో నేను       (రాంకి ),చెల్లి ,అమ్మనాన్న".  చిన్న కుటుంబం చింతలేని కుటుంబం . తెల్లవారితె గబగబా లేచి రెడీ అయ్యి బడికి పరుగు.  సాయంత్రం ఇంటికి చేరి కాసేపు ఆటలు,బడిలో ఇచ్చిన పని ముగించి పడుకోవడం ,ఇది నా దిన చర్య. ఆలా కొంతకాలం గడిచింది.  పదివరకు ఊరి బడి లో  చదువుకొని ఇంటర్ పక్కనున్న టౌన్ కి బయలుదేరాను .ఇంటర్లో బాగా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నా.తరువాత ఇంజనీరింగ్  సీటు తెచ్చుకొని హైదరాబాద్ పయనమయ్యా!  బస్ లో బయలుదేరి భాగ్యనగరం చేరాను . అక్కడ తన ఫ్రెండ్స్ ఉంటున్న రూమ్ కి చేరి రిలాక్స్ అయ్యా.  ఫ్రెండ్స్ సహకారం తో కోర్స్ జాయిన్ అవడానికి అమీర్ పేట్ కి వెళ్లి అన్ని కోర్స్ లు గురించి తెలుసుకొని ఒక కోర్స్ జాయిన్ అవ్వడానికి డిసైడ్ అయ్యాను.  రెండు  రోజులు తరువాత  "హాయ్ " అనే పలకరింపు ఇంపుగా వినపడింది ,ఎవరని పక్కకి తలతిప్పి చూసా! చక్కని నవ్వు ,నుదుట కుంకుమ బొట్టు ,చేతిలో పుస్తకాలతో 'మోడరన్ మహాలక్ష్మి'లా ఉంది.  "నేను కొత్తగా హైదరాబాద్...

బిగ్ బాస్ లో "సరదాలు "...

Image
చాలా వారాలు  తరువాత "బిగ్ బాస్" షో లో  "నవ్వులు విరిసాయి . ఇన్ని వారాలు షో లో ఎప్పుడూ టాస్క్లు ,గొడవలు లేకపోతె నాని తో క్లాస్ . మొన్న వారం కాస్త ఉపశమనం అనే చెప్పాలి . ఐస్ మీద నిలబడి బౌల్ లో చీటీ చూసి దానిలో  ఉన్న పాట "సంజ్ఞలతో " చేసి చూపించాలి . మాటలాడకూడదు . మొదటిది హౌస్ లో ఉన్న సభ్యులు చెప్పాలి, రెండోది "నాని " చెప్పాలి ,అలా హాయిగా నవ్వులతో సాగింది . నాని కూడా బాగా అలవాటు పడి టెన్షన్ లేకుండా చేస్తున్నారు . ఏది ఏమైనా మొదటి భాగం తో పోలిస్తే కాస్త వెనుక పడింది అనే చెప్పాలి . భాను నిష్క్రమణ దాదాపు అందరూ ఊహించిందే . ఈ  వారం లో "బిగ్ బాస్" అందరితో "సినిమా " తీయాలి అనే టాస్క్ ఇచ్చారు , దానికి అమిత్ దర్శకుడు ,దీప్తి సహాదర్శకురాలు ,రోల్ రెడా కెమెరా ,తేజస్వి నృత్య దర్శకురాలు ,మేకప్ ,కాస్ట్యూమ్స్ . దర్శకుడు, సహాదర్శకురాలు కలిసి ఒక కాన్సెప్ట్ అనుకొని కథ  కధనం తయారు చేసి రూపకల్పన చేయాలి . ఆడిషన్స్ అయ్యాక కౌశల్ ,తనీష్ ,సామ్రాట్ ఎంపికచేసుకొన్నారు ,వారు స్నేహితులు గా ఒక కథ  నడుస్తుంది . కౌశల్ కి నందిని పరిచయం అయ్యి తనీష్ ని దూ...

సంగీతం ఎంత మధురం

Image
బాగా అలసిన మనిషికి ,వాడి మనసుకి వీనుల విందైన సంగీతం ఎంత మధురం గా ఉంటుందో !! ఆ విషయం  ఈ మధ్య నాకు బాగా తెలిసింది . కాసేపు పాతపాటలు మరికొద్దిసేపు మెలోడీ వింటే, ఆ ఉల్లాసం ఉత్సాహం వేరు. ఈ మధ్యకాలం లో పాటలు అంత ప్రభావం లేవు అనే చెప్పాలి ,"ఓల్డ్ ఈజ్ గోల్డ్" అన్నారు అందుకేనేమో పెద్దలు . చిన్నపుడు పాటల పుస్తకాలు  కొని అవి చదివి నేర్చుకొని 'హమ్' చేసేవాళ్ళం , ఈ కాలం పిల్లలకి తెలీదు కదా ! ముంబై లో ఉన్నపుడు కూడా రోజు ఉదయం  పాటలు వింటూ ఆఫీస్ కి వెళ్లడం రావడం ,ఐనా ఆ పాటలు బోర్ కొట్టేది కాదు .టైం అసలు తెలిసేది కాదు . వీలు ఉంటె మీరు ట్రై చేయండి ...

కంటే కూతుర్నే కనాలి !!

Image
ఈ రోజుల్లో కూడా  అమ్మాయి పుట్టినా ఎదో కష్టం అని ఫీల్ అయ్యే జనాలు ఇంకా ఉన్నారు .. కానీ ఒక ఆడపిల్ల తండ్రి గా ఆ ప్రేమ ,ఆప్యాయత ముందు ఏదీ ఐనా చిన్నదే అనిపిస్తుంది ... వారి ముసిముసి నవ్వులు ,చిన్న మాటలు వింటుంటే అన్ని మర్చిపోతా !! ఇంటికి వెళ్లిన వెంటనే కబుర్లు ,ఆటలు ,పాటలు తో సందడే ... ఈ మధ్య డాన్స్ (నృత్యం) కూడా మొదలు ... కొత్త స్టెప్స్ నేర్పుతుంది నాకు .. నేను చేయకపోతే ఇది  కూడా రాదా? అని వెటకారం... :) చదరంగం  కూడా మొదలు పెట్టారు మేడం గారు... అప్పుడప్పుడు పాప పైన కోపం వస్తుంది గాని కొద్దీ సేపు మాత్రమే , మరలా తనతో చిన్నవాడిగా మారిపోతా .. దేవుడు అన్ని చోట్ల లేకపోయినా తన ప్రతి రూపంలా తల్లిగా,కూతురిగా ఉంటాడేమో ... ఆడ పిల్ల లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు కానీ తాను ఊరు వెళితే ఎదో తెలియని వెలితి నాలో,ఇంట్లో ... ఇంతకీ తన ముద్దు పేరు ఏమిటో తెలుసా "హనీ "....