Posts

Showing posts with the label ap

గబ్బా లో ఆసీస్ కి దెబ్బ !!

కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు .అది మన భారత్ జట్టుకి సరిగ్గా సూట్ అవుతుంది .  ఏ దేశంలో  36 పరుగులకే చాప చుట్టేసామో ,ఎక్కడైతే ఆస్ట్రేలియా మాజీలు గొప్పలు పోయారో ,ఎక్కడ మరో సిరీస్ డ్రా అని అందరూ తీర్మానించుకున్నారో అక్కడ మన భారత్ జట్టు చారిత్రాత్మక విజయం నమోదు చేసి శభాష్ అనిపించుకుంది .  ఒక పక్క సీనియర్లు గాయాలతో సతమతం ,మరో పక్క బులెట్ లాంటి బంతులతో ఆస్ట్రేలియా  పేసర్లు - ఇటు చూస్తే ఒకరికి మొదటి సిరీస్ ,మరొకరికి రెండో టెస్ట్ ,ఇంకొకరు నెట్ బౌలర్  అనుభవలేమి ! ఇలాంటి ఇండియా ఏ జట్టు తో ఆసీస్ ని గబ్బా లో దెబ్బ కొట్టారంటే మాటలు లేవు . సాక్షాత్తు పాంటింగ్ ఈ విజయం, అది గబ్బాలో నేను జీర్ణించుకోలేకున్నాను అంటే మనం అర్ధం చేసు కోవచ్చు మన వారి ప్రతిభ, పట్టుదల, కృషి.   హిట్ మాన్ విఫలం అయినా గిల్ ఛిల్ల్ ఇన్నింగ్స్ ఆడాడు . పుజారా గోడలాగా నిలబడి ,వారి బంతులు  శరీరాన్నిటార్గెట్ చేసినా తొణకక నిబ్బ రంగా నిలిచాడు .  పంత్ ,సుందర్,సిరాజ్ ఇలా ఒకరు ఎక్కువ, తక్కువ లేకుండా ఆసీస్ మాటలకి బ్యాట్ తో సమాధానం చెప్పి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2-1 తో గెలిచి చూపించింది ...

భజన బ్యాచ్ !!

Image
భజన బ్యాచ్ !! మన తెలుగు సినిమాల్లో ఓ మూవీ లో  రావుగోపాల్ రావు ఒక భజన ట్రూప్ పెట్టుకుంటాడు .ఎవరైనా పొగిడితే వాళ్ళు డప్పు,తాళాలతో  గోల చేస్తారు,ఆ పొగడ్తలు ఆగేవరకు ! ఇప్పుడు పొలిటికల్ బ్యాచ్  లో కూడా ఇది అవసరమేమో !! మనకి తెలిసి రాష్ట్రంలో రెండు ప్రధాన పత్రికలు  ఒక మాజీ సీఎం గారిని భజన చేస్తుంటాయి.  ఇంకో పత్రిక ప్రస్తుత  సీఎం గారిని ఆకాశాన్ని ఎత్తుతాయి ,పొగడ్త మంచిదే కానీ అది శృతి మించితే వెగటు పుడుతుంది.  మన స్థాయిని పెంచుకోవచ్చు అనుకుంటే కొంత అవసరమేమో, గాని మరి అది అతి అయితే గతి మారచ్చు ! జర్నలిజం అంటే ప్రజల పక్షాన  ఉండి  వారి సమస్యలు అధికారులకి ,మంత్రులకి చేరవేయాలి.వారికీ చేయుతనిచ్చి వారు ఓటు వృదాపోలేదని నమ్మకం కలిగించాలి .  మన రాష్ట్రము ఏమి  పాపం చేసిందో గాని అది  తప్ప అన్నీ చేస్తారు . ఒకరు మీద ఒకరు బురద చల్లుకోవడం తప్ప ప్రజలకి ఒరిగేది గుండు సున్న!  వారు విమర్శిస్తే ,మీరు విమర్శించండి తప్పులేదు ,లేదంటే పరువు నష్ట దావా కూడా వేయచ్చు కదా ! ప్రజలకి చేసేది ఇసుకంత ,చెప్పేది...

లాక్ తీసారా ??

Image
లాక్ తీసారా ?? "ఎడబాటు తో ఎన్నాళ్ళో  దూరం తొలగి  తిరిగి కలిసే  ప్రేమికులలా" .. దేశ ప్రజలకు సుమారు 2 నెలల వ్యవధి తరువాత కేంద్రం  లాక్ డౌన్  నుండి వెసులుబాట్లు ఇచ్చింది . ఇక్కడ ముఖ్య  విషయం ఏమిటంటే "ప్రభుత్వం " లాక్ తీసింది కానీ "కరోనా కాదని"ప్రజలు గమనించాలి .  మన బాధ్యత ఇప్పుడు ఇంకా ఎక్కువ వుంది .ఇన్నాళ్లు ఇంట్లోఉండి, ఒకే సారి బయట బలాదూర్ తిరిగామో కరోనా తో కాటు తప్పదు. చేతుల శుభ్రత ,మాస్కు ధరించటం,భౌతిక దూరంలాంటివి  మరిచిపోకుండా పాటించాలి . కరోనా నుంచి మనం ఏమి నేర్చుకున్నాం ? మనిషికున్న అహంకారాన్ని ఈ కరోనా మహమ్మారి ఒక్కసారి నేలకేసి కొట్టి ప్రకృతి  ముందు మనిషి చాలా "చిన్నజీవ"ని  తెలియచేసింది. మనిషి లేకుండా ప్రకృతి లోని జీవరాసులు హాయిగా స్వేచ్ఛగా విహరించాయి . అంటే మనిషికి ప్రకృతి తో,ఇతర ప్రాణులతో  పని కానీ, వాటికీ మన అవసరం అంతలేదన్నమాట !! అడవులని నరికి ,పట్టణాలు చేసి ధ్వని ,వాహన కాలుష్యాన్ని తానే తయారు చేసి ,  కష్టాలు కొనుకొన్ని తెచ్చుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి, తన సంపాదన హారతి చే...

ఆరోగ్యమే మహా భాగ్యం

Image
ఆరోగ్యమే మహా భాగ్యం .... ప్రతి మనిషి తన జీవితం హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు .చక్కని ఆరోగ్యం కోసం తాజా పండ్లు తింటారు . కానీ దురదృష్టవశాత్తూ నేటి పోటీ ప్రపంచంలో సంపాదనే ద్యేయంగా  సరైన  పండ్లు ,కూరగాయలు  లేక ఎన్నో కష్టాలు "కొని" తెచ్చుకుంటున్నాడు . రాత్రనక, పగలనక కష్టపడి సంపాదించిన డబ్బు తో కల్తీ కూరగాయలు ,పండ్లు తిని అనారోగ్యం పాలవుతున్నారు. తరువాత ఆ రోగాల నివారణ కోసం హాస్పిటల్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి  జీవితం నాశనం చేసుకుంటున్నాడు . ఉదాహరణకి మార్కెట్ లో దొరికే అరటిపళ్ళు ,మామిడి కాయలు తీసుకుందాం.  వాటిని పూర్తిగా ముగ్గనివ్వకుండా సొమ్ము చేసుకోవాలని కకృతి తో  వాటిని మగ్గ బెట్టి లేక ,కొన్ని రసాయనాలు లేదా ఎథలీన్ గ్యాస్ వంటి వాటితో నిగనిగలాడే  చక్కని రూపం తీసుకొచ్చి వినియోగదారుడిని బోల్తా కొట్టిస్తున్నాడు.అటువంటి పండ్లు తీసుకొని ప్రజలు ప్రమాదంలో పడుతున్నారు . దీని వల్ల వారి  ఆరోగ్యం పాడవుతుంది,వ్యాపారాలు జేబు నిండుతుంది. ఇటువంటి సంఘటనలు చూసి ప్రజలకు మంచి చేయాలనే మంచి సంకల్పంతో  సేంద్రియ పద...

మీ రచనలని (ఆర్టికల్స్,వ్యాసాలు,కథలు) పబ్లిష్ కావాలనుకుంటున్నారా ?

హాయ్ గుడ్ మార్నింగ్ ! మీ రచనలని (ఆర్టికల్స్,వ్యాసాలు,కథలు) పబ్లిష్ కావాలనుకుంటున్నారా ? సంఘంలో జరిగే అవినీతి,అన్యాయాలను ఎండగట్టాలనుకుంటున్నారా ? ఐతే మీకు ఇది  గోల్డెన్ ఛాన్స్ ! కానీ ,ఆ రచనలు మీ సొంతవి,ఎక్కడ కాపీచేయలేదని హామీ ఇవ్వాలి . వాటిలో మాకు నచ్చినవాటిని ఎంపికచేసి మా వెబ్ సైట్ లో ప్రచురిస్తాం ... ప్రచురించాలా  వద్దా అనేది "మానేజిమెంట్ దే తుది నిర్ణయం" ఇంకెందుకు ఆలస్యం ..మీ రచనలని పంపవలిసిన మెయిల్ id : wethepeople@manamjanam.info  

"తెలుగు కంటెంట్ రైటర్"ఉద్యోగం కోసం చూస్తున్నారా ?

Image
మీలో ఎవరైనా "వ్రాయడం " కెరీర్ గా ఎంచుకుంటున్నారు ? మీకు "తెలుగు కంటెంట్ రైటర్" గా ఉద్యోగం కోసం చూస్తున్నారా ? ఆ ఉద్యోగాలు ఎక్కడ వెతకాలో తెలియడం లేదా ఐతే క్రింద ఉన్న లింక్ కి వెళ్లి చూసి నచ్చితే అప్లై చేయండి ! https://www.naukri.com/telugu-content-writer-jobs https://www.quikr.com/jobs/telugu-content-writer+zwqxj2726005330 శుభం భూయాత్ !!

ఆంధ్రకు కేంద్రం అన్యాయం చేసిందా ?

Image
అవుననే చెప్పాలి ఎందుకంటే విభజన చట్టంలో ఆంధ్రకు "స్పెషల్ స్టేటస్" ఇవ్వాలి అని తీర్మానం చేసారు , కానీ తరువాత ఎన్నికల్లో గెలిచిన  భాజపా మాత్రం ఆ మాట తుంగలో తొక్కింది . 14వ ఆర్థికసంఘం సలహా మేరకు ఏ రాష్ట్రాన్నికి  "ప్రత్యేక హోదా" ఇవ్వరాదని తేల్చింది . దానికి తగ్గట్టు నిధులు ఇస్తామని చెప్పారు, అదికూడా అమలు కావడం లేదు . ఇక్కడ ఒక విషయం గమనిస్తే అప్పటి కాంగ్రెస్ పార్లమెంట్ లో బిల్ పెడితే భాజపా మద్దతు ఇచ్చి "5 కాదు పది సంవత్సరాలు "ఇవ్వాలని వెంకయ్యనాయుడు గారు పోరాడారు, కానీ తీరా వీరు గెలిచాక ఆర్థికసంఘంతో ముడి పెడుతున్నారు ,ఇది అప్పుడు లేదా? లేకపోతె కేంద్రాన్ని ప్రాంతీయ పార్టీలు ఏమి చేయలేవు అనే ధీమానా ?? ఇది  ఎంతవరకు  సబబు . ఒక ప్రధాని ని ఇచ్చిన వాగ్దానాన్ని మరొక ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా పక్కన పెట్టింది అంటే మన పార్టీలకి రాజ్యాంగం మీద ఎంత గౌరవమే  తెలుస్తుంది వెంకయ్య గారు ఉపరాష్ట్రపతి గా ఉన్నా దీనిపై స్పందించకపోవడం శోచనీయం . ఓట్లు కోసం కాళ్ళు పడతారు ,ఓట్లు వేసాక ఆ కాళ్ల ని లాగేస్తారు "అవసరం  ఉంటె కాళ్ళు ,లేకపోతె జుట్టు పట...