లాక్ తీసారా ??

లాక్ తీసారా ??

"ఎడబాటు తో ఎన్నాళ్ళో  దూరం తొలగి  తిరిగి కలిసే  ప్రేమికులలా" .. దేశ ప్రజలకు సుమారు 2 నెలల వ్యవధి తరువాత కేంద్రం  లాక్ డౌన్  నుండి వెసులుబాట్లు ఇచ్చింది .ఇక్కడ ముఖ్య  విషయం ఏమిటంటే "ప్రభుత్వం " లాక్ తీసింది కానీ "కరోనా కాదని"ప్రజలు గమనించాలి . 
మన బాధ్యత ఇప్పుడు ఇంకా ఎక్కువ వుంది .ఇన్నాళ్లు ఇంట్లోఉండి, ఒకే సారి బయట బలాదూర్ తిరిగామో కరోనా తో కాటు తప్పదు. చేతుల శుభ్రత ,మాస్కు ధరించటం,భౌతిక దూరంలాంటివి  మరిచిపోకుండా పాటించాలి .

కరోనా నుంచి మనం ఏమి నేర్చుకున్నాం ?

మనిషికున్న అహంకారాన్ని ఈ కరోనా మహమ్మారి ఒక్కసారి నేలకేసి కొట్టి ప్రకృతి  ముందు మనిషి చాలా "చిన్నజీవ"ని  తెలియచేసింది.
మనిషి లేకుండా ప్రకృతి లోని జీవరాసులు హాయిగా స్వేచ్ఛగా విహరించాయి .
అంటే మనిషికి ప్రకృతి తో,ఇతర ప్రాణులతో  పని కానీ, వాటికీ మన అవసరం అంతలేదన్నమాట !!

అడవులని నరికి ,పట్టణాలు చేసి ధ్వని ,వాహన కాలుష్యాన్ని తానే తయారు చేసి ,  కష్టాలు కొనుకొన్ని తెచ్చుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి, తన సంపాదన హారతి చేసుకుంటున్నాడు ,కానీ కరోనా  దయ వల్ల బయట తిండి లేదు సగం రోగాలు కట్ !వాహనాలు లేవు కాలుష్యం ఫట్ !!
మందు బంద్ ,దాని వల్ల  సగం అరాచకాలు తగ్గాయి ,ఎప్పుడూ ఫ్యామిలీకి సమయం  ఇవ్వని వారు వారి కుటుంబాలతో కొంతసేపైనా హాయిగా గడిపి ఒత్తిడికి దూరమయ్యారు.
ఏది జరిగినా మన మంచికి అంటే ఇదేనేమో ?!

లాక్ డౌన్ తీసారని ఛాన్స్ తీసుకుంటే మీ ఇంట్లో  ఒక టికెట్ కంఫర్మ్ అయిపోతుందని, గ్రహించి మరింత జాగ్రత్త వహిస్తారని ఆశిస్తూ...  


Comments

Popular posts from this blog

జవాబు లేని ప్రశ్న ?

"భగవాన్ ... సర్ ...స్ఫూర్తి దాయకం .... "