గబ్బా లో ఆసీస్ కి దెబ్బ !!
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు .అది మన భారత్ జట్టుకి సరిగ్గా సూట్ అవుతుంది . ఏ దేశంలో 36 పరుగులకే చాప చుట్టేసామో ,ఎక్కడైతే ఆస్ట్రేలియా మాజీలు గొప్పలు పోయారో ,ఎక్కడ మరో సిరీస్ డ్రా అని అందరూ తీర్మానించుకున్నారో అక్కడ మన భారత్ జట్టు చారిత్రాత్మక విజయం నమోదు చేసి శభాష్ అనిపించుకుంది . ఒక పక్క సీనియర్లు గాయాలతో సతమతం ,మరో పక్క బులెట్ లాంటి బంతులతో ఆస్ట్రేలియా పేసర్లు - ఇటు చూస్తే ఒకరికి మొదటి సిరీస్ ,మరొకరికి రెండో టెస్ట్ ,ఇంకొకరు నెట్ బౌలర్ అనుభవలేమి ! ఇలాంటి ఇండియా ఏ జట్టు తో ఆసీస్ ని గబ్బా లో దెబ్బ కొట్టారంటే మాటలు లేవు . సాక్షాత్తు పాంటింగ్ ఈ విజయం, అది గబ్బాలో నేను జీర్ణించుకోలేకున్నాను అంటే మనం అర్ధం చేసు కోవచ్చు మన వారి ప్రతిభ, పట్టుదల, కృషి. హిట్ మాన్ విఫలం అయినా గిల్ ఛిల్ల్ ఇన్నింగ్స్ ఆడాడు . పుజారా గోడలాగా నిలబడి ,వారి బంతులు శరీరాన్నిటార్గెట్ చేసినా తొణకక నిబ్బ రంగా నిలిచాడు . పంత్ ,సుందర్,సిరాజ్ ఇలా ఒకరు ఎక్కువ, తక్కువ లేకుండా ఆసీస్ మాటలకి బ్యాట్ తో సమాధానం చెప్పి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2-1 తో గెలిచి చూపించింది ...