Posts

Showing posts from May 18, 2020

లాక్ తీసారా ??

Image
లాక్ తీసారా ?? "ఎడబాటు తో ఎన్నాళ్ళో  దూరం తొలగి  తిరిగి కలిసే  ప్రేమికులలా" .. దేశ ప్రజలకు సుమారు 2 నెలల వ్యవధి తరువాత కేంద్రం  లాక్ డౌన్  నుండి వెసులుబాట్లు ఇచ్చింది . ఇక్కడ ముఖ్య  విషయం ఏమిటంటే "ప్రభుత్వం " లాక్ తీసింది కానీ "కరోనా కాదని"ప్రజలు గమనించాలి .  మన బాధ్యత ఇప్పుడు ఇంకా ఎక్కువ వుంది .ఇన్నాళ్లు ఇంట్లోఉండి, ఒకే సారి బయట బలాదూర్ తిరిగామో కరోనా తో కాటు తప్పదు. చేతుల శుభ్రత ,మాస్కు ధరించటం,భౌతిక దూరంలాంటివి  మరిచిపోకుండా పాటించాలి . కరోనా నుంచి మనం ఏమి నేర్చుకున్నాం ? మనిషికున్న అహంకారాన్ని ఈ కరోనా మహమ్మారి ఒక్కసారి నేలకేసి కొట్టి ప్రకృతి  ముందు మనిషి చాలా "చిన్నజీవ"ని  తెలియచేసింది. మనిషి లేకుండా ప్రకృతి లోని జీవరాసులు హాయిగా స్వేచ్ఛగా విహరించాయి . అంటే మనిషికి ప్రకృతి తో,ఇతర ప్రాణులతో  పని కానీ, వాటికీ మన అవసరం అంతలేదన్నమాట !! అడవులని నరికి ,పట్టణాలు చేసి ధ్వని ,వాహన కాలుష్యాన్ని తానే తయారు చేసి ,  కష్టాలు కొనుకొన్ని తెచ్చుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి, తన సంపాదన హారతి చే...