పెద్ద పొరపాటు !!
మనం ఏదైనా పని చేసేముందు కొంచెం బెరుకు ఉంటుంది ,అదే సాధిస్తామా లేదా అనే చిన్న భయం వెంటాడుతుంది .కానీ ప్రయత్నం కూడా సరిగ్గా చేయకుండా ఫలితం ఆలోచించకూడదు . నువ్వు చేసి ప్రయత్నం పట్టుదలగా,త్రికరణ శుద్ధిగా చేస్తే నీదే విజయం !! ఇదే పూజ్యగురువులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు పదే పదే చెబుతుంటారు . ఓడిపోవడం తప్పు కాదు కానీ ప్రయత్నమే చేయకపోతే ఇంకాపెద్ద పొరపాటు .