Posts

Showing posts from August 6, 2018

జవాబు లేని ప్రశ్న ?

Image
రిజర్వేషన్ ఇవ్వడానికి తమకు ఇబ్బంది లేదని ,కానీ ఇస్తే అన్ని కుల,వర్గాలు వారికీ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ,వ్యాపారాలు,పెద్ద పెద్ద సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని " నితిన్ గడ్కరీ" అన్నారు . దాన్ని అదును గా చూసి 'రాహుల్ గాంధీ' ఒక అడుగు ముందుకు వేసి "మంచి ప్రశ్న  వేశారు ,దేశం అంతా  అదే ప్రశ్న ఎప్పటినుంచో అడుగుతున్నారు ,"మీరు(భారతీయ జనతా పార్టీ ) మాత్రమే బదులివ్వవలిసిన ప్రశ్న " ఇది అని చురక అంటించారు . మా  ప్రభుత్వం వచ్చాక చాలా  ఉద్యోగాలు వచ్చాయని చెప్పే "మోడీ" సర్కార్  ఇప్పుడు ఏమి చెబుతారో ? "జి ఎస్ టి " లాంటివి వల్ల  చాలా చిన్న  కంపెనీలు దెబ్బతిన్నాయి ,దాని ద్వారా సుమారు 5000 మంది  గుజరాత్ లోనే ఉపాధి కోల్పోయారు అనేది నిజం . మరి ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో జరిగితే ,యువతకి ఉపాధి ఏది ? నేను 'జి ఎస్ టి' కి వ్యతిరేకం కాదు ,కానీ దానికి ప్రత్యామ్యాయం ఏమిటి అనేది చూడాలి .  యువత కి ఉపాధి లేకపోతె వారు పక్కదోవ పట్టి వారి జీవితాలను నాశనం చేసుకుంటారు .  అలా చూడటం మీకు ఇష్టమా ? ఎన్నికలు వస్తున్నాయని హడావిడి గా పథకాలు ప్రకటించే