Posts

Showing posts from July 17, 2020

స్మార్ట్ ఫోన్ తో పిల్లలకి మంచా, చెడా ?

Image
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి .అదే ఫోన్ తో పిల్లలుకూడా ఆడుకుంటున్నారు ,ఇవ్వకపోతే మారం చేస్తారు . కొంతమంది తల్లితండ్రులు వారి గోల,బాధ భరించలేక వారికీ ఇస్తారు .  వారిని నిశబ్దంగా ఉంచడంకోసమో ,అల్లరిని కంట్రోల్ చేయడం కోసమో లేకుంటే భోజనం చేస్తారనో  వారిచేతిలో ఫోన్ పెడతాం .  ఫోన్లు వల్ల మంచి కూడా ఉన్నది ,కానీ అతి ఫోన్ వాడకం వల్ల అనర్దాలు ఉన్నాయి  1. చిన్న పిల్లలో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. వేరే వారితో మాట్లాడటం వల్ల,వేరకరితో కళ్ళు కాంటాక్ట్ తో వారిలో బెరుకు భయం తగ్గుతాయి.  అంతేకాని ఫోన్ తలకిందికి వాల్చి చూస్తే ఏమి వస్తుంది ? మెడ నొప్పితప్ప ! 2.చిన్న పిల్లలు ముఖ్యంగా ఆటలు ఆడాలి ,దాని ద్వారా వారికి ఉత్సాహం ,ఉత్తేజం ఉంటాయి. ఎముకలు, కండరాలు దృడంగా అవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది .   .ఆటల వల్ల చెమట పట్టి ,తరువాత ఫ్రెష్ అయ్యాక,చక్కగా  తిని తొందరగా నిద్రపోతారు.  3. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల ఏకాగ్రత కోల్పోవడం ,ఆకలి మందగిస్తుంది  4. స్మార్ట్ ఫోన్  సమీపంలో నిద్రుస్తున్న పిల్లలు రాత్రి 20 నిముషాలు తక్కువనిద్రపోతారని ఒక సర్వే లో తేలింద