Posts

Showing posts with the label business

సర్కార్ కి ప్రేమ!

Image
ఈ మధ్య  సర్కార్ కి  ప్రజలు మీద ప్రేమ విపరీతంగా  పెరిగిపోయింది. వారికీ అన్న కాంటీన్,నిరుద్యోగ భృతి  ఇలా అన్ని ప్రజాఉద్ధరణే !! అంతవరకూ బాగుంది కానీ దాన్ని అమలు బాగా లేదు ,మన డబ్బు ఖర్చు చేస్తే ఎంత జాగ్రత్తగా చేస్తాం ,అదే మాదిరి  ప్రజాధనం కూడా చేయాలి . వృధా చేయకండి . ఒకటి  రెండు రోజులు పొరపాట్లు సహజం ,అవి సరి దిద్దికోవాలి . అదే పనిగా తప్పులు చేస్తే మన డబ్బు వృధా ,మీ ప్రతిపక్షానికి ఊతం ఇచ్చిన వారు అవుతారు .  మంచిని ఎవరైనా ప్రోత్సహిస్తారు ,కానీ ... ఇన్నాళ్లు లేని వల్లమాలిన ప్రేమ ఇప్పుడు ఎందుకో ? ఓహ్ దగ్గర్లో ఎన్నికలు ఉన్నాయని ఇప్పుటి నుంచే  ప్రజలకి బిస్కట్ వేస్తున్నారా? హడావిడిగా పథకాలు అమలు చేస్తునట్టు ఉంది! కాదు మాది చేతల ప్రభుత్వం అంటే మరి ఈ నాలుగు సంవత్సరాలు ఏమి చేసారు ? ప్రత్యేక హోదా లేక ప్యాకేజీ పై ఏమి తేల్చారు ? పోలవరం పూర్తి అవుతుందా? మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ? ఎన్ని కంపెనీ లు వచ్చాయి ,పెట్టుబడులు ఎంత సాధించారు ? కాపు రిజర్వేషన్ ఏమి తేల్చారు ,కేంద్రాన్ని  ఎన్ని రోజులు స...

మధురం మధురం ...

Image
మధురం మధురం ... సెల్ ఫోన్ మధురం మాటలు మధురం పాటలు మధురం ఆటలు మధురం ... వాట్సాప్ మధురం ఎఫ్ బి  మధురం చాటింగ్ చేసె మీరు మధురం .... దూరం దగ్గర చేసే సెల్ఫోన్  మధురం (షాక్ సినిమా స్ఫూర్తి తో )

మీ కెరీర్ ఏమి ఎంచుకున్నారు ?

Image
హలో  మిత్రులారా !! మీకు బ్లాగ్ రాయడం హాబీ నా లేక సరదాగా రాస్తారా ? మీ కెరీర్ ఏమి ఎంచుకున్నారు ? మీలో  ఎవరైనా రచయితలు   ఉద్యోగ అవకాశాలు కోసం చూస్తూ ఉంటె నాది  చిన్న విన్నపం .  ఈ లింక్ లో "కంటెంట్ రైటర్స్-తెలుగు ,ఇంగ్లీష్  " అవకాశాలు ఉన్నాయి,చూసి నచ్చితే మీ బయో-డేటా పంపండి  https://www.naukri.com/telugu-content-writer-jobs.  అలాగే  https://www.quikr.com/jobs/telugu-content-writer-jobs-in-hyderabad+hyderabad+zwqxj4157493934 శుభం భూయాత్ .... 

ఈ బ్యాంకులకు ఏమైంది ?

Image
సామాన్య ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి,రూపాయి పోగుచేసి సంపాదించినదంతా   దాచుకోవడానికి గతంలో బ్యాంకు లో జమ వేసేవారు .  చీటీలు కడితే గ్యారంటీ లేదని కొందరు ,రిస్క్ చేయలేక కొందరు బ్యాంకు లో వేసేవారు .  ఇప్పుడు కధ  మారింది ! నగదు అరికట్టాలని,నల్లధనం పాలత్రోలనో మన మోడీ సర్ "డిమానిటైజేషన్ " అమలు చేసారు . అది ఇంతవరకు ఏమి సాధించారో గాని ప్రజలు మాత్రం చిక్కులు ఇంకా కొనసాగుతున్నాయి .  నగదు వేసినా  బాదుడు ,తీస్తే బాదుడు . మన డబ్బు మనం తీసుకున్న తప్పే !? "ఏ .టి. ఎమ్" లో ఎప్పుడు డబ్బు ఉంటుందో ఆ దేవుడికే ఎరుక !! "నో కాష్ " బోర్డులు వెక్కిరిస్తాయి . రెండు కిలోమీటర్లు తిరిగితే మీ అదృష్టం బాగుంటే డబ్బు ఉంటుంది ,వస్తుంది . లేదంటే చీటీ వెక్కిరిస్తుంది (నగదు లేదని ).  ఈ మధ్య బ్యాంకు లో డబ్బు ఉన్నా కూడా దానికి కూడా "డబ్బు కత్తిరించారట" ఎస్. బి. ఐ  వారు !! అది తెలిసి ఆ వినియోగదారుడు బ్యాంకు కి ఘాటుగా లేఖ రాసి ,అకౌంట్ మూసివేసాడు .  డిజిటైజేషన్  చేయండి మంచిదే ...

బిగ్ బాస్ షో -2 .

ఇంతకూ ముందు బిగ్ బాస్ -1 లో జూనియర్ ఎన్ . టి. ఆర్ . వ్యాఖ్యాత  గాచేసే వారు ,ఇప్పుడు "నాని " వ్యాఖ్యాత  గా వ్యవహరిస్తున్నారు . కొంతమంది హీరో లు ,టి వి నటులు ,కొంతమంది సామాన్యులు ఈ గేమ్ లో ఆడుతున్నారు . సుమారు వంద రోజుల్లో అందరు కలిసి ఆ హౌస్ లో ఉండాలి . బయటకి వెళ్ళటానికి అనుమతి ఉండదు . మైక్ ధరించాలి . ఆందరు అక్కడే ఉండి  వండుకుని ,తిని పడుకోవాలి . బిగ్ బాస్ ఏమి టాస్క్ ఇస్తే అది కూడా చేయాలి ప్రతి వారానికి ఒక కెప్టెన్ ని బిగ్ బాస్ ఎంపిక చేస్తారు . వారి అడుగు జాడల్లో వీరు ఉండాలి ,,కానీ కెప్టెన్ కి ఆ వారం లో  ఎలిమినేషన్ ఉండదు   ఇది ఒకరకమైన మైండ్ గేమ్ అని నా అభిప్రాయం . మన మాటలతో,పనులతో ఎదుటివారిని ఎదో రకం గా బయటకి పంపించాలి  అని చూసే వారు ఎక్కువ . దానికి ఎన్నో వ్యూహాలు రచిస్తారు కానీ కనపడరు ఈ సీజన్ లో నాని ఏంకర్  గా కొత్త ,కానీ  అలవాటు పడుతున్నాడు  నిన్న సంజన అనే అమ్మాయి ని బయటకి పంపించారు , నందిని ఎంట్రీ ఇస్తుంది .  ఈ షో అయ్యే లోపు వారికీ మంచి పేరు ,ప్రఖ్యాతలు ,ఆఫర్లు వస్తున్నాయి . ఇది ...

ఈ బాదుడు ఎన్నాళ్ళు ??

Image
మన పాలకులు మైక్ ఇస్తే డప్పులు కొట్టి "అది ఇస్తాం  ,ఇది చేస్తాం" అంటారు గాని ,ముఖ్యమైన సమస్య మాత్రం పరిష్కరించరు .  అదే పిల్లల ఫీజు సమస్య !! ఒక బాబు గాని ,పాప గాని ప్రెవేట్ స్కూల్ కి వెళితే "నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఫీజు" చూస్తే కళ్ళు తిరిగి కింద పడాల్సిందే !! ఒకడు అడ్మిషన్ కి పదివేలు అంటాడు ,మరొకడు ఇరవై అంటాడు , మరొకడు ఇంటర్నేషనల్ స్కూల్ అండి "లక్ష " అని బాదుడు  చిన్న బడిలో సంవత్సరానికి సుమారుగా   30 నుంచి 70 వేలు గుంజుతున్నారు !! దీనిని కట్టడి చేసే వారు లేరా ?? ప్రభుత్వం అలా ఉంటె మనం కూడా పరువు,ప్రతిష్ట అని పక్కనోడు ఏమి చేస్తే మనం "అంతకు మించి " అని గొప్పలకు పోయే వారు లేకపోలేదు ...   చదువుకోవాలి  గాని చదువుని "కొనకూడదు ".  దీనికి చరమ  గీతం అందరం పాడి ఒక వ్యవస్థ ద్వారా "ఫీజు "కట్టడి చేయాలి .  ఇంతకు  మించి వసూల్ చేస్తే , వారి లైసెన్స్ రద్దు చేయాలి , అప్పుడు కానీ భయపడరు ... పిల్లలు బాగుపడరు 

మల్లె మనసులు

Image
"మల్లె" మనసులు  ప్రతి మనిషి జీవితం లో కుటుంబం తో పాటు కొంతమంది స్నేహితులు తప్పక ఉంటారు .  ఆలా స్నేహితులు లేని వారు చాలా అరుదు.  "మన స్నేహితులు ఎవరో చెపితే మనం ఎలాంటివాళ్ళో చెపుతా "అన్నారు ఓ కవి .  ఆలా నా జీవిత ప్రయాణం లో కొందరు ఉన్నారు .  వారిలో మర్చిపోలేని వారు కొందరు ,మర్చిపోతే బాగుంటుంది అనుకునే వారు కొందరు .  కాలేజీ లో పరిచయం ఐన  వారిలో "మల్లి " ఒక్కడు. చదువు లో, తెలివితేటల్లో ముందు .  మా క్లాస్ వాళ్ళతో  కన్నా వాడితో చనువు ఎక్కువ . కలిసి సిని మాలు ,షికార్లు .  కల్మషం లేని వ్యక్తి . వాడిని చూసి కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నా , ఎల్లప్పుడూ నా గురించి ,నా ఎదుగుదల గురించి ఆశిస్తాడు .  వారి కుటుంబం తో కూడా మంచి అనుబంధం ఉంది .  ప్రస్తుతం తను  నా దగ్గర్లో లేకపోయినా ఫోన్ లో మాట్లాడుతుంటాడు . వృత్తి రీత్యా  అమెరికా లో ఉంటున్నాడు .   ఒక పని లో నాలో నమ్మకం లేకపోతె ,చెప్పి నమ్మకం కలిగించి నాకు ప్రోత్సహిస్తాడు .  వృత్తిలో లేక బిజినెస్ లో గాని నష్టపోయినా ,కల...