ఈ బాదుడు ఎన్నాళ్ళు ??



మన పాలకులు మైక్ ఇస్తే డప్పులు కొట్టి "అది ఇస్తాం  ,ఇది చేస్తాం" అంటారు గాని ,ముఖ్యమైన సమస్య మాత్రం పరిష్కరించరు . 

అదే పిల్లల ఫీజు సమస్య !!

ఒక బాబు గాని ,పాప గాని ప్రెవేట్ స్కూల్ కి వెళితే "నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఫీజు" చూస్తే కళ్ళు తిరిగి కింద పడాల్సిందే !!

ఒకడు అడ్మిషన్ కి పదివేలు అంటాడు ,మరొకడు ఇరవై అంటాడు ,
మరొకడు ఇంటర్నేషనల్ స్కూల్ అండి "లక్ష " అని బాదుడు 

చిన్న బడిలో సంవత్సరానికి సుమారుగా   30 నుంచి 70 వేలు గుంజుతున్నారు !!

దీనిని కట్టడి చేసే వారు లేరా ??

ప్రభుత్వం అలా ఉంటె మనం కూడా పరువు,ప్రతిష్ట అని పక్కనోడు ఏమి చేస్తే మనం "అంతకు మించి " అని గొప్పలకు పోయే వారు లేకపోలేదు ... 

చదువుకోవాలి  గాని చదువుని "కొనకూడదు ". 

దీనికి చరమ  గీతం అందరం పాడి ఒక వ్యవస్థ ద్వారా "ఫీజు "కట్టడి చేయాలి . 

ఇంతకు  మించి వసూల్ చేస్తే ,వారి లైసెన్స్ రద్దు చేయాలి ,
అప్పుడు కానీ భయపడరు ... పిల్లలు బాగుపడరు 

Comments

Popular posts from this blog

జవాబు లేని ప్రశ్న ?

"భగవాన్ ... సర్ ...స్ఫూర్తి దాయకం .... "