Posts

Showing posts from July 10, 2018

సంగీతం ఎంత మధురం

Image
బాగా అలసిన మనిషికి ,వాడి మనసుకి వీనుల విందైన సంగీతం ఎంత మధురం గా ఉంటుందో !! ఆ విషయం  ఈ మధ్య నాకు బాగా తెలిసింది . కాసేపు పాతపాటలు మరికొద్దిసేపు మెలోడీ వింటే, ఆ ఉల్లాసం ఉత్సాహం వేరు. ఈ మధ్యకాలం లో పాటలు అంత ప్రభావం లేవు అనే చెప్పాలి ,"ఓల్డ్ ఈజ్ గోల్డ్" అన్నారు అందుకేనేమో పెద్దలు . చిన్నపుడు పాటల పుస్తకాలు  కొని అవి చదివి నేర్చుకొని 'హమ్' చేసేవాళ్ళం , ఈ కాలం పిల్లలకి తెలీదు కదా ! ముంబై లో ఉన్నపుడు కూడా రోజు ఉదయం  పాటలు వింటూ ఆఫీస్ కి వెళ్లడం రావడం ,ఐనా ఆ పాటలు బోర్ కొట్టేది కాదు .టైం అసలు తెలిసేది కాదు . వీలు ఉంటె మీరు ట్రై చేయండి ...