Posts

Showing posts with the label daughter

ఈ బాదుడు ఎన్నాళ్ళు ??

Image
మన పాలకులు మైక్ ఇస్తే డప్పులు కొట్టి "అది ఇస్తాం  ,ఇది చేస్తాం" అంటారు గాని ,ముఖ్యమైన సమస్య మాత్రం పరిష్కరించరు .  అదే పిల్లల ఫీజు సమస్య !! ఒక బాబు గాని ,పాప గాని ప్రెవేట్ స్కూల్ కి వెళితే "నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఫీజు" చూస్తే కళ్ళు తిరిగి కింద పడాల్సిందే !! ఒకడు అడ్మిషన్ కి పదివేలు అంటాడు ,మరొకడు ఇరవై అంటాడు , మరొకడు ఇంటర్నేషనల్ స్కూల్ అండి "లక్ష " అని బాదుడు  చిన్న బడిలో సంవత్సరానికి సుమారుగా   30 నుంచి 70 వేలు గుంజుతున్నారు !! దీనిని కట్టడి చేసే వారు లేరా ?? ప్రభుత్వం అలా ఉంటె మనం కూడా పరువు,ప్రతిష్ట అని పక్కనోడు ఏమి చేస్తే మనం "అంతకు మించి " అని గొప్పలకు పోయే వారు లేకపోలేదు ...   చదువుకోవాలి  గాని చదువుని "కొనకూడదు ".  దీనికి చరమ  గీతం అందరం పాడి ఒక వ్యవస్థ ద్వారా "ఫీజు "కట్టడి చేయాలి .  ఇంతకు  మించి వసూల్ చేస్తే , వారి లైసెన్స్ రద్దు చేయాలి , అప్పుడు కానీ భయపడరు ... పిల్లలు బాగుపడరు 

కంటే కూతుర్నే కనాలి !!

Image
ఈ రోజుల్లో కూడా  అమ్మాయి పుట్టినా ఎదో కష్టం అని ఫీల్ అయ్యే జనాలు ఇంకా ఉన్నారు .. కానీ ఒక ఆడపిల్ల తండ్రి గా ఆ ప్రేమ ,ఆప్యాయత ముందు ఏదీ ఐనా చిన్నదే అనిపిస్తుంది ... వారి ముసిముసి నవ్వులు ,చిన్న మాటలు వింటుంటే అన్ని మర్చిపోతా !! ఇంటికి వెళ్లిన వెంటనే కబుర్లు ,ఆటలు ,పాటలు తో సందడే ... ఈ మధ్య డాన్స్ (నృత్యం) కూడా మొదలు ... కొత్త స్టెప్స్ నేర్పుతుంది నాకు .. నేను చేయకపోతే ఇది  కూడా రాదా? అని వెటకారం... :) చదరంగం  కూడా మొదలు పెట్టారు మేడం గారు... అప్పుడప్పుడు పాప పైన కోపం వస్తుంది గాని కొద్దీ సేపు మాత్రమే , మరలా తనతో చిన్నవాడిగా మారిపోతా .. దేవుడు అన్ని చోట్ల లేకపోయినా తన ప్రతి రూపంలా తల్లిగా,కూతురిగా ఉంటాడేమో ... ఆడ పిల్ల లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు కానీ తాను ఊరు వెళితే ఎదో తెలియని వెలితి నాలో,ఇంట్లో ... ఇంతకీ తన ముద్దు పేరు ఏమిటో తెలుసా "హనీ "....