చిరునవ్వుతో - పార్ట్ 1
"పచ్చటి పొలాలు మధ్యలో కొన్ని ఇళ్ళు ,దానిలో ఒక చిన్న డాబా .ఆ ఇంట్లో నేను (రాంకి ),చెల్లి ,అమ్మనాన్న". చిన్న కుటుంబం చింతలేని కుటుంబం . తెల్లవారితె గబగబా లేచి రెడీ అయ్యి బడికి పరుగు. సాయంత్రం ఇంటికి చేరి కాసేపు ఆటలు,బడిలో ఇచ్చిన పని ముగించి పడుకోవడం ,ఇది నా దిన చర్య. ఆలా కొంతకాలం గడిచింది. పదివరకు ఊరి బడి లో చదువుకొని ఇంటర్ పక్కనున్న టౌన్ కి బయలుదేరాను .ఇంటర్లో బాగా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నా.తరువాత ఇంజనీరింగ్ సీటు తెచ్చుకొని హైదరాబాద్ పయనమయ్యా! బస్ లో బయలుదేరి భాగ్యనగరం చేరాను . అక్కడ తన ఫ్రెండ్స్ ఉంటున్న రూమ్ కి చేరి రిలాక్స్ అయ్యా. ఫ్రెండ్స్ సహకారం తో కోర్స్ జాయిన్ అవడానికి అమీర్ పేట్ కి వెళ్లి అన్ని కోర్స్ లు గురించి తెలుసుకొని ఒక కోర్స్ జాయిన్ అవ్వడానికి డిసైడ్ అయ్యాను. రెండు రోజులు తరువాత "హాయ్ " అనే పలకరింపు ఇంపుగా వినపడింది ,ఎవరని పక్కకి తలతిప్పి చూసా! చక్కని నవ్వు ,నుదుట కుంకుమ బొట్టు ,చేతిలో పుస్తకాలతో 'మోడరన్ మహాలక్ష్మి'లా ఉంది. "నేను కొత్తగా హైదరాబాద్...