బిగ్ బాస్ లో "సరదాలు "...


చాలా వారాలు  తరువాత "బిగ్ బాస్" షో లో  "నవ్వులు విరిసాయి .
ఇన్ని వారాలు షో లో ఎప్పుడూ టాస్క్లు ,గొడవలు లేకపోతె నాని తో క్లాస్ .

మొన్న వారం కాస్త ఉపశమనం అనే చెప్పాలి .
ఐస్ మీద నిలబడి బౌల్ లో చీటీ చూసి దానిలో  ఉన్న పాట "సంజ్ఞలతో " చేసి చూపించాలి .
మాటలాడకూడదు .
మొదటిది హౌస్ లో ఉన్న సభ్యులు చెప్పాలి, రెండోది "నాని " చెప్పాలి ,అలా హాయిగా నవ్వులతో సాగింది .
నాని కూడా బాగా అలవాటు పడి టెన్షన్ లేకుండా చేస్తున్నారు .
ఏది ఏమైనా మొదటి భాగం తో పోలిస్తే కాస్త వెనుక పడింది అనే చెప్పాలి .

భాను నిష్క్రమణ దాదాపు అందరూ ఊహించిందే .

ఈ  వారం లో "బిగ్ బాస్" అందరితో "సినిమా " తీయాలి అనే టాస్క్ ఇచ్చారు ,
దానికి అమిత్ దర్శకుడు ,దీప్తి సహాదర్శకురాలు ,రోల్ రెడా కెమెరా ,తేజస్వి నృత్య దర్శకురాలు ,మేకప్ ,కాస్ట్యూమ్స్ .
దర్శకుడు, సహాదర్శకురాలు కలిసి ఒక కాన్సెప్ట్ అనుకొని కథ  కధనం తయారు చేసి రూపకల్పన చేయాలి .
ఆడిషన్స్ అయ్యాక కౌశల్ ,తనీష్ ,సామ్రాట్ ఎంపికచేసుకొన్నారు ,వారు స్నేహితులు గా ఒక కథ  నడుస్తుంది . కౌశల్ కి నందిని పరిచయం అయ్యి తనీష్ ని దూరం చేసుకుంటున్నాడు .

కౌశల్ నందిని ప్రేమికులుగా బాగా నటిస్తున్నారు .

పూల్ లో సామ్రాట్,తనీష్  ఫైట్ నవ్వులు పూయించింది .
దీప్తి తో ఐటెం సాంగ్ రూపకల్పన చేసి సామ్రాట్ తో ఆడిపాడుతుంది .

మిగిలింది ఈ వారం "బయటకు  ఎవరు  వెళతారో చూద్దాం" ??


ప్యాకప్.... !! 

Comments

Popular posts from this blog

జవాబు లేని ప్రశ్న ?

నేను చెప్పానా !!

గబ్బా లో ఆసీస్ కి దెబ్బ !!