Posts

Showing posts with the label ANDHRA

తెలుగు కథలు పంపండి !!

గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ! నాకు చిన్న సహాయం కావాలి .  ఎవరి వద్ద ఐనా "తెలుగు కథలు (రాజకీయం,సెక్స్, మతాలకి ) సంబందించినవి తప్ప"   వేరేవి  పంపండి . సరళంగా ,చిన్న  తెలుగు పదాలతో వర్డ్ డాక్యుమెంట్ లో ఉండాలి  అది మీ సొంత గా వ్రాసిన కథ ఐతే  మంచిది .కాపీ రైట్స్ ఉన్నవి , వారి అనుమతి లేకుండా  పంపవద్దు . నవల్స్,పెద్దకథలు ఉంటె మరి మంచిది . 1100 వ్యాఖ్యలు ఉండాలి .   నేను చిన్న వర్క్ ట్రై  చేస్తున్నా , దానిలో మనీ వస్తే మీకు కూడా కొంత పంపుతాను . నా  మెయిల్ ఐడి : sai.sgk@gmail.com థాంక్స్

భజన బ్యాచ్ !!

Image
భజన బ్యాచ్ !! మన తెలుగు సినిమాల్లో ఓ మూవీ లో  రావుగోపాల్ రావు ఒక భజన ట్రూప్ పెట్టుకుంటాడు .ఎవరైనా పొగిడితే వాళ్ళు డప్పు,తాళాలతో  గోల చేస్తారు,ఆ పొగడ్తలు ఆగేవరకు ! ఇప్పుడు పొలిటికల్ బ్యాచ్  లో కూడా ఇది అవసరమేమో !! మనకి తెలిసి రాష్ట్రంలో రెండు ప్రధాన పత్రికలు  ఒక మాజీ సీఎం గారిని భజన చేస్తుంటాయి.  ఇంకో పత్రిక ప్రస్తుత  సీఎం గారిని ఆకాశాన్ని ఎత్తుతాయి ,పొగడ్త మంచిదే కానీ అది శృతి మించితే వెగటు పుడుతుంది.  మన స్థాయిని పెంచుకోవచ్చు అనుకుంటే కొంత అవసరమేమో, గాని మరి అది అతి అయితే గతి మారచ్చు ! జర్నలిజం అంటే ప్రజల పక్షాన  ఉండి  వారి సమస్యలు అధికారులకి ,మంత్రులకి చేరవేయాలి.వారికీ చేయుతనిచ్చి వారు ఓటు వృదాపోలేదని నమ్మకం కలిగించాలి .  మన రాష్ట్రము ఏమి  పాపం చేసిందో గాని అది  తప్ప అన్నీ చేస్తారు . ఒకరు మీద ఒకరు బురద చల్లుకోవడం తప్ప ప్రజలకి ఒరిగేది గుండు సున్న!  వారు విమర్శిస్తే ,మీరు విమర్శించండి తప్పులేదు ,లేదంటే పరువు నష్ట దావా కూడా వేయచ్చు కదా ! ప్రజలకి చేసేది ఇసుకంత ,చెప్పేది...

స్మార్ట్ ఫోన్ తో పిల్లలకి మంచా, చెడా ?

Image
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి .అదే ఫోన్ తో పిల్లలుకూడా ఆడుకుంటున్నారు ,ఇవ్వకపోతే మారం చేస్తారు . కొంతమంది తల్లితండ్రులు వారి గోల,బాధ భరించలేక వారికీ ఇస్తారు .  వారిని నిశబ్దంగా ఉంచడంకోసమో ,అల్లరిని కంట్రోల్ చేయడం కోసమో లేకుంటే భోజనం చేస్తారనో  వారిచేతిలో ఫోన్ పెడతాం .  ఫోన్లు వల్ల మంచి కూడా ఉన్నది ,కానీ అతి ఫోన్ వాడకం వల్ల అనర్దాలు ఉన్నాయి  1. చిన్న పిల్లలో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. వేరే వారితో మాట్లాడటం వల్ల,వేరకరితో కళ్ళు కాంటాక్ట్ తో వారిలో బెరుకు భయం తగ్గుతాయి.  అంతేకాని ఫోన్ తలకిందికి వాల్చి చూస్తే ఏమి వస్తుంది ? మెడ నొప్పితప్ప ! 2.చిన్న పిల్లలు ముఖ్యంగా ఆటలు ఆడాలి ,దాని ద్వారా వారికి ఉత్సాహం ,ఉత్తేజం ఉంటాయి. ఎముకలు, కండరాలు దృడంగా అవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది .   .ఆటల వల్ల చెమట పట్టి ,తరువాత ఫ్రెష్ అయ్యాక,చక్కగా  తిని తొందరగా నిద్రపోతారు.  3. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల ఏకాగ్రత కోల్పోవడం ,ఆకలి మందగిస్తుంది  4. స్మార్ట్ ఫోన్  సమీపంలో నిద్రుస్తున్న ...

లాక్ తీసారా ??

Image
లాక్ తీసారా ?? "ఎడబాటు తో ఎన్నాళ్ళో  దూరం తొలగి  తిరిగి కలిసే  ప్రేమికులలా" .. దేశ ప్రజలకు సుమారు 2 నెలల వ్యవధి తరువాత కేంద్రం  లాక్ డౌన్  నుండి వెసులుబాట్లు ఇచ్చింది . ఇక్కడ ముఖ్య  విషయం ఏమిటంటే "ప్రభుత్వం " లాక్ తీసింది కానీ "కరోనా కాదని"ప్రజలు గమనించాలి .  మన బాధ్యత ఇప్పుడు ఇంకా ఎక్కువ వుంది .ఇన్నాళ్లు ఇంట్లోఉండి, ఒకే సారి బయట బలాదూర్ తిరిగామో కరోనా తో కాటు తప్పదు. చేతుల శుభ్రత ,మాస్కు ధరించటం,భౌతిక దూరంలాంటివి  మరిచిపోకుండా పాటించాలి . కరోనా నుంచి మనం ఏమి నేర్చుకున్నాం ? మనిషికున్న అహంకారాన్ని ఈ కరోనా మహమ్మారి ఒక్కసారి నేలకేసి కొట్టి ప్రకృతి  ముందు మనిషి చాలా "చిన్నజీవ"ని  తెలియచేసింది. మనిషి లేకుండా ప్రకృతి లోని జీవరాసులు హాయిగా స్వేచ్ఛగా విహరించాయి . అంటే మనిషికి ప్రకృతి తో,ఇతర ప్రాణులతో  పని కానీ, వాటికీ మన అవసరం అంతలేదన్నమాట !! అడవులని నరికి ,పట్టణాలు చేసి ధ్వని ,వాహన కాలుష్యాన్ని తానే తయారు చేసి ,  కష్టాలు కొనుకొన్ని తెచ్చుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి, తన సంపాదన హారతి చే...

ఆరోగ్యమే మహా భాగ్యం

Image
ఆరోగ్యమే మహా భాగ్యం .... ప్రతి మనిషి తన జీవితం హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు .చక్కని ఆరోగ్యం కోసం తాజా పండ్లు తింటారు . కానీ దురదృష్టవశాత్తూ నేటి పోటీ ప్రపంచంలో సంపాదనే ద్యేయంగా  సరైన  పండ్లు ,కూరగాయలు  లేక ఎన్నో కష్టాలు "కొని" తెచ్చుకుంటున్నాడు . రాత్రనక, పగలనక కష్టపడి సంపాదించిన డబ్బు తో కల్తీ కూరగాయలు ,పండ్లు తిని అనారోగ్యం పాలవుతున్నారు. తరువాత ఆ రోగాల నివారణ కోసం హాస్పిటల్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి  జీవితం నాశనం చేసుకుంటున్నాడు . ఉదాహరణకి మార్కెట్ లో దొరికే అరటిపళ్ళు ,మామిడి కాయలు తీసుకుందాం.  వాటిని పూర్తిగా ముగ్గనివ్వకుండా సొమ్ము చేసుకోవాలని కకృతి తో  వాటిని మగ్గ బెట్టి లేక ,కొన్ని రసాయనాలు లేదా ఎథలీన్ గ్యాస్ వంటి వాటితో నిగనిగలాడే  చక్కని రూపం తీసుకొచ్చి వినియోగదారుడిని బోల్తా కొట్టిస్తున్నాడు.అటువంటి పండ్లు తీసుకొని ప్రజలు ప్రమాదంలో పడుతున్నారు . దీని వల్ల వారి  ఆరోగ్యం పాడవుతుంది,వ్యాపారాలు జేబు నిండుతుంది. ఇటువంటి సంఘటనలు చూసి ప్రజలకు మంచి చేయాలనే మంచి సంకల్పంతో  సేంద్రియ పద...

జవాబు లేని ప్రశ్న ?

Image
రిజర్వేషన్ ఇవ్వడానికి తమకు ఇబ్బంది లేదని ,కానీ ఇస్తే అన్ని కుల,వర్గాలు వారికీ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ,వ్యాపారాలు,పెద్ద పెద్ద సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని " నితిన్ గడ్కరీ" అన్నారు . దాన్ని అదును గా చూసి 'రాహుల్ గాంధీ' ఒక అడుగు ముందుకు వేసి "మంచి ప్రశ్న  వేశారు ,దేశం అంతా  అదే ప్రశ్న ఎప్పటినుంచో అడుగుతున్నారు ,"మీరు(భారతీయ జనతా పార్టీ ) మాత్రమే బదులివ్వవలిసిన ప్రశ్న " ఇది అని చురక అంటించారు . మా  ప్రభుత్వం వచ్చాక చాలా  ఉద్యోగాలు వచ్చాయని చెప్పే "మోడీ" సర్కార్  ఇప్పుడు ఏమి చెబుతారో ? "జి ఎస్ టి " లాంటివి వల్ల  చాలా చిన్న  కంపెనీలు దెబ్బతిన్నాయి ,దాని ద్వారా సుమారు 5000 మంది  గుజరాత్ లోనే ఉపాధి కోల్పోయారు అనేది నిజం . మరి ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో జరిగితే ,యువతకి ఉపాధి ఏది ? నేను 'జి ఎస్ టి' కి వ్యతిరేకం కాదు ,కానీ దానికి ప్రత్యామ్యాయం ఏమిటి అనేది చూడాలి .  యువత కి ఉపాధి లేకపోతె వారు పక్కదోవ పట్టి వారి జీవితాలను నాశనం చేసుకుంటారు .  అలా చూడటం మీకు ఇష్టమా ? ఎన్నికలు వస్తున్నాయని హడావ...

సర్కార్ కి ప్రేమ!

Image
ఈ మధ్య  సర్కార్ కి  ప్రజలు మీద ప్రేమ విపరీతంగా  పెరిగిపోయింది. వారికీ అన్న కాంటీన్,నిరుద్యోగ భృతి  ఇలా అన్ని ప్రజాఉద్ధరణే !! అంతవరకూ బాగుంది కానీ దాన్ని అమలు బాగా లేదు ,మన డబ్బు ఖర్చు చేస్తే ఎంత జాగ్రత్తగా చేస్తాం ,అదే మాదిరి  ప్రజాధనం కూడా చేయాలి . వృధా చేయకండి . ఒకటి  రెండు రోజులు పొరపాట్లు సహజం ,అవి సరి దిద్దికోవాలి . అదే పనిగా తప్పులు చేస్తే మన డబ్బు వృధా ,మీ ప్రతిపక్షానికి ఊతం ఇచ్చిన వారు అవుతారు .  మంచిని ఎవరైనా ప్రోత్సహిస్తారు ,కానీ ... ఇన్నాళ్లు లేని వల్లమాలిన ప్రేమ ఇప్పుడు ఎందుకో ? ఓహ్ దగ్గర్లో ఎన్నికలు ఉన్నాయని ఇప్పుటి నుంచే  ప్రజలకి బిస్కట్ వేస్తున్నారా? హడావిడిగా పథకాలు అమలు చేస్తునట్టు ఉంది! కాదు మాది చేతల ప్రభుత్వం అంటే మరి ఈ నాలుగు సంవత్సరాలు ఏమి చేసారు ? ప్రత్యేక హోదా లేక ప్యాకేజీ పై ఏమి తేల్చారు ? పోలవరం పూర్తి అవుతుందా? మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ? ఎన్ని కంపెనీ లు వచ్చాయి ,పెట్టుబడులు ఎంత సాధించారు ? కాపు రిజర్వేషన్ ఏమి తేల్చారు ,కేంద్రాన్ని  ఎన్ని రోజులు స...

మధురం మధురం ...

Image
మధురం మధురం ... సెల్ ఫోన్ మధురం మాటలు మధురం పాటలు మధురం ఆటలు మధురం ... వాట్సాప్ మధురం ఎఫ్ బి  మధురం చాటింగ్ చేసె మీరు మధురం .... దూరం దగ్గర చేసే సెల్ఫోన్  మధురం (షాక్ సినిమా స్ఫూర్తి తో )

"ఆ సినిమాకి" ఇప్పుడే ఇంత క్రేజా !!

Image
విశ్వవిఖ్యాత నట సార్వ భౌముఁడు శ్రీ  నందమూరి తారక రామా రావు గారి   బయోపిక్ "ఎన్ .టి .ఆర్ "చిత్రం తెరకెక్కుతుంది .దీనికి అతనికి కుమారుడు "బాలకృష్ణ" లీడ్ రోల్ చేస్తున్నారు . ముఖ్యపాత్రలో "విద్యాబాలన్ "నటిస్తున్నారు . క్రిష్ దర్శకత్వము వహిస్తున్నారు . ఇప్పటికి ఒక షెడ్యూల్ కూడా పూర్తిఅయింది . ఈ చిత్రం షూటింగ్ దశలోనే మంచి అంచనాలు ఉన్నాయి ,దానికి తోడు ఇప్పుడు మరో ఆసక్తి కరమైన విషయం బయటకి వచ్చింది . ఈ చిత్రం యొక్క పూర్తి హక్కుల కోసం రిలయన్స్ ,సోని లాంటి దిగ్గజాలు పోటీపడుతున్నాయని దానికి సుమారు 85 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్దపడ్డాయని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఇది ఎంతవరకు నిజమో గాని కానీ "సినిమాకి రిలీజ్ కి ముందే మంచి క్రేజ్,బిజినెస్   ఏర్పడింది",పూర్తి అయ్యే లోపు ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ,దానితో  చిత్రం  ఇంకా ఎన్ని  రికార్డులు కొల్లగొడుతుందో !! వేచి చూద్దాం ...

"తెలుగు కంటెంట్ రైటర్"ఉద్యోగం కోసం చూస్తున్నారా ?

Image
మీలో ఎవరైనా "వ్రాయడం " కెరీర్ గా ఎంచుకుంటున్నారు ? మీకు "తెలుగు కంటెంట్ రైటర్" గా ఉద్యోగం కోసం చూస్తున్నారా ? ఆ ఉద్యోగాలు ఎక్కడ వెతకాలో తెలియడం లేదా ఐతే క్రింద ఉన్న లింక్ కి వెళ్లి చూసి నచ్చితే అప్లై చేయండి ! https://www.naukri.com/telugu-content-writer-jobs https://www.quikr.com/jobs/telugu-content-writer+zwqxj2726005330 శుభం భూయాత్ !!

అలోచించి మాట్లాడండి !!

Image
మన రాజకీయనాయకులు ఈ మధ్య అనవసరంగా  కొన్ని  విషయాలు  ప్రాధాన్యం ఇస్తున్నారు . మేము రాజకీయాల్లోకి ప్రజల సేవకోసం వచ్చామని  ,ఇంకా ఎదో సొల్లు చెప్పి మీటింగుల్లో మాటలతో దంచికొడతారు . గెలిచిన తరువాత సరిగ్గా ఒకడు కూడా వారి సొంత జిల్లా గాని,ఊరిలో గాని తిరిగి వారి సమస్యలు తీర్చడానికి  ప్రయత్నం చేయరు ,కానీ వేరే వారి  వ్యక్తిగత జీవితాలు గురించి మాట్లాడటం ఐతే తెలుసు . విమర్శలు చేయడం రాజకీయాల్లో సహజం కానీ మరి ఇంత దిగజారి చేస్తే మీరే ఇరుకునపడతారు . అపహాస్యం అవుతారు దానికి వారి సొంత పార్టీలోనే వ్యతిరేకత ఏర్పాడుతుంది .  తరువాత  ఎన్నికలకి వెళితే మీ ముఖం కూడా చూడటానికి కూడా జనం ఇష్టపడరు . "ఎవడికో ఎంతమంది పెళ్ళాలు  ఉన్నారు",  వీళ్ళకి  కావాలి ,గాని వీరికి నీతి న్యాయం ఉండదు.  తండ్రి పేరు చెప్పుకొని ఒకడు ,మామ పెట్టి న పార్టీలు తో మరొకడు మనుగడ సాగిస్తున్నారు  గాని  వాళ్ళమీద ఎన్ని కేసులు ఉన్నాయో ఎవరికి  తెలియదు .ప్రతి శుక్రవారం వెళ్లి కోర్టులో సంతకాలు పెట్టాలి ఒక సర్ . సుమారు రెండువేల కిలోమీ...

ఆంధ్ర ప్రదేశ్ తో కేంద్రం "అవిశ్వాసం తీర్మానం "గెలిచింది !

Image
ఇన్నాళ్లు తెలుగు దేశం ,వై సి పి ,మిగతా పార్టీలు రాష్ట్ర విభజన సరిగా జరగలేదు ,దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ,  ఇప్పటి ప్రభుత్వం భాజపా "స్పెషల్ స్టేటస్ "ఇవ్వలేదని వారిమీదికి మీద తోసేశారు ,కానీ దీనికి సమాధానం గా మొన్న పార్లమెంట్ లో బిజెపి ఎదురుదాడి చేసింది . తెలుగు దేశం తో సహా వామ పక్షాలు కి  కౌంటర్ గా  బిజెపి కి అవిశ్వాసం తీర్మానం పెట్టింది . దానికి మోడీ సహా అందరు కలిసి అవిశ్వాసం గెలిపించారు ,సహజంగా ఎక్కువ సభ్యులు ఉన్నవారు గెలుస్తారు అదే జరిగింది . కొన్ని రాష్ట్రాలు మనకి మద్దతు ఇవ్వలేదు, కొందరు దూరం గా ఉన్నారు . ఇన్నాళ్లు మౌనం గా ఉన్న "మోడీ" పార్లమెంట్లు లో "స్పెషల్ కేటగిరి స్టేటస్ ఇవ్వడం కుదరదని దాని స్థానం లో "స్పెషల్ ప్యాకేజీ " ఇస్తామని చెబితె ఆంధ్ర ప్రభుత్వం "చంద్రబాబు " సరే అన్నారని "ఆరోపించింది .దానికి "చంద్రబాబు "ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిన ఫలితం లేదు . మరి ఎవరి   లోపాలవల్ల మనకి "స్టేటస్ "రాలేదు ??