సర్కార్ కి ప్రేమ!


ఈ మధ్య  సర్కార్ కి  ప్రజలు మీద ప్రేమ విపరీతంగా  పెరిగిపోయింది.

వారికీ అన్న కాంటీన్,నిరుద్యోగ భృతి  ఇలా అన్ని ప్రజాఉద్ధరణే !!
అంతవరకూ బాగుంది కానీ దాన్ని అమలు బాగా లేదు ,మన డబ్బు ఖర్చు చేస్తే ఎంత జాగ్రత్తగా చేస్తాం ,అదే మాదిరి  ప్రజాధనం కూడా చేయాలి . వృధా చేయకండి .
ఒకటి  రెండు రోజులు పొరపాట్లు సహజం ,అవి సరి దిద్దికోవాలి .
అదే పనిగా తప్పులు చేస్తే మన డబ్బు వృధా ,మీ ప్రతిపక్షానికి ఊతం ఇచ్చిన వారు అవుతారు . 

మంచిని ఎవరైనా ప్రోత్సహిస్తారు ,కానీ ...
ఇన్నాళ్లు లేని వల్లమాలిన ప్రేమ ఇప్పుడు ఎందుకో ?

ఓహ్ దగ్గర్లో ఎన్నికలు ఉన్నాయని ఇప్పుటి నుంచే  ప్రజలకి బిస్కట్ వేస్తున్నారా?
హడావిడిగా పథకాలు అమలు చేస్తునట్టు ఉంది!

కాదు మాది చేతల ప్రభుత్వం అంటే మరి ఈ నాలుగు సంవత్సరాలు ఏమి చేసారు ?
ప్రత్యేక హోదా లేక ప్యాకేజీ పై ఏమి తేల్చారు ?
పోలవరం పూర్తి అవుతుందా?
మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ?
ఎన్ని కంపెనీ లు వచ్చాయి ,పెట్టుబడులు ఎంత సాధించారు ?
కాపు రిజర్వేషన్ ఏమి తేల్చారు ,కేంద్రాన్ని  ఎన్ని రోజులు సాకు చూపుతారు ?
మేనిఫెస్టో లో ఉన్న అన్ని హామీలు అమలు చేసారా??లేదా??

ఎన్నికలకు వెళ్లే ముందు వీటి జవాబులు సిద్ధంగా ఉంటె మంచిదే ,లేదంటే ప్రజాతిరస్కారం (ఓటమి) తప్పదు !


Comments

  1. "మేనిఫెస్టో లో ఉన్న అన్ని హామీలు అమలు చేసారా??లేదా??" ...

    పార్టీ అధికారిక వెబ్సైటు లోంచి మేనిఫెస్టో ని తొలగించారని ఓ పేపర్లో చదువుతున్నాము.
    అది నిజం కాదనే ఖండన ఇప్పటి వరకు ఏ పేపర్లో దర్శనమివ్వగా చూసిన గుర్తు లేదు.
    doesn't that mystery explain / answer (the logic behind the magical
    disappearance) all the queries posed till now !?
    సామాన్యులకి కూడా అర్ధం అయ్యే ఈ లాజిక్ మన మేధావులు కొందరికి ... !!! ???

    తిరస్కారమా ?
    భలేవారే ! జరుగుతోంది ఇప్పుడు కలియుగమండి సార్ ...
    ఓ ప్రక్కన పురస్కారాలకు ఏర్పాట్లు జరిగి పోతుంటే ...

    ఇదేదో ఒక్క పార్టీ నుద్దేశించి అనాల్సిన అవసరం లేదు,
    రాష్త్రం లోని అన్ని పార్టీల (దు)స్థితి ఇదే.
    సాగించుకుంటూ పొతే చాలు, సాధించడాలు మన వంతు కాదనే తంతే !
    may be we don't deserve better than this.

    ఎందుకనంటే ... మనం భారతీయలం - అందునా ఆంధ్రులం.
    ఖర్మ సిద్ధాంత కర్తలం - వక్తలం - భోక్తలం.
    ఇది నిజం ... ఇదే నిజం ... ఆంధ్రాయిజం.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

జవాబు లేని ప్రశ్న ?

నేను చెప్పానా !!

గబ్బా లో ఆసీస్ కి దెబ్బ !!