బరువు తగ్గడం ఎలా ?
మనలో చాలా మందికి ఉండే ప్రశ్న ఇది . కానీ దానికి ప్రణాళిక రచించి తగిన శ్రమ చేయాలి . అందరూ ప్రణాళికలు వేస్తారు, కానీ శరీర శ్రమ చేయడానికి వెనకడుగు వేస్తారు. ఈ నియమాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది . 1. వ్యాయామం ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలి. మొదట్లో పదినిముషాలు చిన్న వర్కౌట్స్ చేస్తూ తరువాత మెల్లగా సమయం పెంచుకొని కఠినమైన వర్కౌట్స్ అరగంట సేపు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . 2. ఉపవాసాలు తగ్గించాలి తప్పనిసరిగా అల్పాహారం,ఆహారం లో మంచి డైట్ తీసుకోవాలి .దీనితో అధిక క్యాలరీలు కరిగి బరువు కంట్రోల్ లో ఉంటుంది. 3. బయట తిండి వద్దు బయట తినుబండారాలు తినరాదు .వాటిలో ముఖ్యం గా చక్కెర మరియు ఫ్యాట్స్ ఉంటాయి .ఇంట్లో నే చక్కని ఆహారం తయారు చేసుకొని తినాలి. ముఖ్యంగా కోడిగుడ్లు ,క్యారెట్స్ ,నట్స్ ,పళ్ళు తీసుకుంటే మంచిది . 4. తరచూ మంచినీళ్లు త్రాగాలి . అరలీటరు నీరు తాగడం వల్ల సుమారు 20-30 శాతం క్యాలరీలు కరుగుతాయి.రోజుకు రెండున్నర లేదా మూడు లీటర్లు నీరు తాగాలి .భోజనం ముందు కూడా నీరు త్రాగడం వల్ల తక్కువ ఆహారం తీసుకుంటాం దానితో క్యాలరీలు ...