బరువు తగ్గడం ఎలా ?
మనలో చాలా మందికి ఉండే ప్రశ్న ఇది . కానీ దానికి ప్రణాళిక రచించి తగిన శ్రమ చేయాలి . అందరూ ప్రణాళికలు వేస్తారు, కానీ శరీర శ్రమ చేయడానికి వెనకడుగు వేస్తారు.
ఈ నియమాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది .
1. వ్యాయామం
ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలి.
మొదట్లో పదినిముషాలు చిన్న వర్కౌట్స్ చేస్తూ తరువాత మెల్లగా సమయం పెంచుకొని కఠినమైన వర్కౌట్స్ అరగంట సేపు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది .
2. ఉపవాసాలు తగ్గించాలి
తప్పనిసరిగా అల్పాహారం,ఆహారం లో మంచి డైట్ తీసుకోవాలి .దీనితో అధిక క్యాలరీలు కరిగి బరువు కంట్రోల్ లో ఉంటుంది.
3. బయట తిండి వద్దు
బయట తినుబండారాలు తినరాదు .వాటిలో ముఖ్యం గా చక్కెర మరియు ఫ్యాట్స్ ఉంటాయి .ఇంట్లో నే చక్కని ఆహారం తయారు చేసుకొని తినాలి. ముఖ్యంగా కోడిగుడ్లు ,క్యారెట్స్ ,నట్స్ ,పళ్ళు తీసుకుంటే మంచిది .
4. తరచూ మంచినీళ్లు త్రాగాలి .
అరలీటరు నీరు తాగడం వల్ల సుమారు 20-30 శాతం క్యాలరీలు కరుగుతాయి.రోజుకు రెండున్నర లేదా మూడు లీటర్లు నీరు తాగాలి .భోజనం ముందు కూడా నీరు త్రాగడం వల్ల తక్కువ ఆహారం తీసుకుంటాం దానితో క్యాలరీలు తగ్గుతాయి . మనం తీసుకొనే శీతల పానీయాలు బదులు నీరు తాగడం చాలా మంచిది.
5. కాఫీ త్రాగండి
నిజమే కానీ దానిలో షుగర్ తక్కువ ఉండాలి .కాఫీ త్రాగడం తో మెటబాలిజం 3 నుంచి 11 శాతం అభివృద్ధి అవుతుంది అలాగే డయాబెటిస్ - 2 కూడా 23 నుంచి 50 శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని సైన్స్ చెపుతుంది .
6. డ్రింక్స్ తగ్గించాలి
క్యాలరీలు ఎక్కువ ఉండే కూల్ డ్రింక్స్,ఫ్రూట్ జ్యూస్స్, చాక్లేట్ మిల్క్ కి దూరంగా ఉండాలి . ఒక సర్వేలో పిల్లల్లో ఊబకాయం 60 శాతం వీటివల్ల వస్తుందని తేలింది !
7 గ్రీన్ టీ తాగడం
గ్రీన్ టీ తాగడం వల్ల కూడా బరువు తగ్గించుకోవచ్చు.
8. చిన్న ప్లేట్స్ లో భోజనం
చిన్న ప్లేట్స్ లో భోజనం తీసుకొంటే ఫుడ్ కొంచెం ఎక్కువ వేసుకున్నా మనం ఎక్కువతింటున్నాం అనే భావనతో, తగ్గించి తింటాం .అదే పెద్ద ప్లేట్స్ తో తింటే, ప్లేట్ నిండా ఆహారపదార్దాలు వేసుకొని లాంగించేస్తాం.
9. డిన్నర్ తొందరగా
డిన్నర్ ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది ఎందుకంటే మనం నిద్రపోయేలోగా ఆ ఆహారం జీర్ణం అవుతుంది . తరువాత మన పొట్టలో పేరుకు పోయిన కొవ్వును క్రమంగా కరిగిస్తుంది.
10. అధిక ఉప్పుని తగ్గించాలి
మనం తినే ఆహారంలో అధిక ఉప్పు ఉండటం వల్ల కూడా అనర్థమే ,ఎందుకంటే ఆ ఉప్పు వల్ల మనశరీరం లో నీరు శాతం ఉండిపోతుంది.దానితో బరువు పెరగవచ్చు .
11. చక్కని నిద్ర
బరువు తగ్గడానికి, అలాగే భవిష్యత్తులో బరువు పెరగకుండా ఉండటానికి తగినంత నిద్ర పోవడం చాలా ముఖ్యం.
తగినంత నిద్రపోయేవారితో పోలిస్తే నిద్ర లేమి ఉన్నవారు 55% వరకు ఊబకాయం వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ సంఖ్య పిల్లలకు ఇంకా ఎక్కువ.ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది .వారు ఎన్ని గంటలకు నిద్రపోతారో అనే నిఘా తల్లితండ్రులు తగ్గించేశారు.
దానితో వారికీ నిద్రసరిపోదు .హార్మోన్ల ప్రభావం కలుగుతుంది .దానితో ఆకలి తగ్గి కొత్తసమస్యలు తీసుకు వస్తాయి.
12. తృణధాన్యాలు తినాలి (గ్రైన్స్)
తృణధాన్యాలు తీసుకోవడం అనాదినుంచి ఉంది . శుద్ధి చేయని తృణధాన్యాలు సాధారణంగా శుద్ధి చేసిన వాటి కంటే తక్కువ ఫలితాలు ఉంటాయి, ఎందుకంటే వాటికి తక్కువ ప్రాసెసింగ్ ఉంటుంది . ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి, మన హృదయ సంబందించిన వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్ మరియు అధిక బరువు వంటి ప్రమాదాలని అరికడతాయి. రొట్టె, ధాన్యపు పాస్తా, శుద్ధి చేయని బార్లీ లాంటివి ఎంపిక చేసుకొని తీసుకోవాలి.
బ్రౌన్ రైస్ కూడా చాల మంచిది . వైట్ రైస్‌కు మంచి ప్రత్యామ్నాయం, అయితే దాని ఉత్పత్తి సమయంలో చాలా నీరు వాడతారు కాబట్టి తక్కువగా తీసుకోవాలి.
12. ఫైబర్ ఫుడ్స్
ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి . ఫైబర్ లో ఉండే ఒక ప్రత్యేకత మన పొట్ట విస్తరించే భావన కలిగేలా చేస్తుంది,కడుపు ఖాళీ చేయడానికి ఎక్కువ సమయం తీసుకొంటుంది . దేనితో మనం ఆహారం తీసుకోవటం తగ్గిస్తాం. కొన్ని ఫైబర్స్ లో ఉండే బాక్టీరియా ఊబకాయం తగ్గించేలా ఉపకరిస్తుంది .
13. తిన్నాక బ్రష్ చేయాలి
సాధారణంగా భోజనం ముగిసాక కొద్దీ సమయం లో నిద్రకి ఉపక్రమిస్తాం .కానీ కొన్ని సార్లు నిద్రపట్టక పొతే ఎదో బిస్కట్ లేక స్నాక్స్ తినాలని అనిపించచ్చు . కాబట్టి బ్రష్ చేస్తే ఆ ఫీల్ రాకుండా ఉంటుంది . దానితో అనవసర ఆహారం తినం .
14. రోజుకి ఒకటి లేదా రెండు గ్రుడ్లు తినాలి.
ReplyDelete15. రోజుకి ఒకటి లేదా రెండు నిమ్మకాయ రసం తీసుకోవాలి.