సమ్మోహనం ...
తెలుగు సినిమా ప్రేక్షకులకి ఒక తెలియని అనుభూతి ,ఎన్నో ప్రేమ కధలు చూసాం కానీ ఇది దానికి కొంచెం ఎక్కువే !(నా ఫీలింగ్) సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు తరువాత ఇప్పుడు వీడి సమీక్ష ఎవడికి కావాలి అనుకుంటే పొరపాటే !! సగటు సినిమా పిచ్చి ఉన్న అభిమానిగా రాస్తున్నా ... రాయకుండా ఉండలేక పోతున్నా ! అనగనగ అందమైన కుటుంబం ... అమ్మ ,నాన్న ,చెల్లి,మన హీరో .. విజయకుమార్ (సుదీర్ బాబు ). విజయ్ కి బొమ్మలు వేయడం అంటే ఇష్టం,పిల్లలకి కథలతో కూడిన బొమ్మలు వేసి పుస్తకం ప్రచురించాలని లక్ష్యం !అది వారికీ విజ్ఞానం ఇస్తుంది అని నమ్మకం . తనకి సినిమాలు అంటే మంచి అభిప్రాయం ఉండదు ,పడదు ,వారిది అంతా నటన అనే అభిప్రాయం ,కానీ తన స్నేహితులకి ఆ సినిమాలే ఇష్టం . ఒక షూటింగ్ నిమిత్తం వీరి ఇల్లు 20 రోజులు కావాలని సినిమా వాళ్ళు అడగ్గా తండ్రి (నరేష్ )ఒక కండిషన్ పెడతాడు ,అదే తనకి చిన్న వేషం ఇవ్వాలని !!ఓకే అంటారు . ఆ సినిమా లో హీరోయిన్ "సమీరా"(అదితిరావు )ని చూస్తాడు ,తనకి తెలుగు రాదని నవ్వుకుంటాడు . తనకి తెలుగు నేర్పమని అడగ్గా సరే అంటాడు . అలా కొన్ని రోజులకి వారి పరిచయం,స్నేహం గా ...