సమ్మోహనం ...


తెలుగు సినిమా ప్రేక్షకులకి ఒక తెలియని అనుభూతి ,ఎన్నో ప్రేమ కధలు చూసాం కానీ ఇది దానికి కొంచెం ఎక్కువే !(నా ఫీలింగ్)

సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు తరువాత ఇప్పుడు వీడి సమీక్ష ఎవడికి కావాలి అనుకుంటే పొరపాటే !!

సగటు సినిమా పిచ్చి ఉన్న అభిమానిగా రాస్తున్నా ... రాయకుండా ఉండలేక పోతున్నా !

అనగనగ అందమైన కుటుంబం ... అమ్మ ,నాన్న ,చెల్లి,మన హీరో .. విజయకుమార్ (సుదీర్ బాబు ).
విజయ్ కి బొమ్మలు వేయడం అంటే ఇష్టం,పిల్లలకి కథలతో కూడిన బొమ్మలు వేసి పుస్తకం ప్రచురించాలని లక్ష్యం  !అది వారికీ విజ్ఞానం ఇస్తుంది అని నమ్మకం .

తనకి సినిమాలు అంటే మంచి అభిప్రాయం ఉండదు ,పడదు ,వారిది అంతా నటన అనే అభిప్రాయం ,కానీ తన స్నేహితులకి ఆ సినిమాలే ఇష్టం .

ఒక షూటింగ్ నిమిత్తం వీరి ఇల్లు 20 రోజులు కావాలని సినిమా వాళ్ళు అడగ్గా తండ్రి (నరేష్ )ఒక కండిషన్ పెడతాడు ,అదే తనకి చిన్న వేషం ఇవ్వాలని !!ఓకే అంటారు .

ఆ సినిమా లో హీరోయిన్ "సమీరా"(అదితిరావు )ని చూస్తాడు ,తనకి తెలుగు రాదని నవ్వుకుంటాడు . తనకి తెలుగు నేర్పమని అడగ్గా సరే అంటాడు .

అలా  కొన్ని రోజులకి వారి పరిచయం,స్నేహం గా  మారుతుంది ,తెలియకుండా ప్రేమించుకుంటారు .

షూటింగ్ పూర్తి అవుతుంది ,బాధగా వీడ్కోలు చెబుతారు .
కానీ విజయ్ మనసు మనసులో ఉండదు . పేపర్ లో వారి షూటింగ్ మనాలి లో జరుగుతుంది అని తెలిసి వెళ్లి తనని కలిసి "ప్రేమిస్తున్నాను " అని చెబుతాడు .
కానీ ఆమె ఒప్పుకోదు ,తనని ఆ దృష్టితో చూడలేదు అని చెప్పి వెళ్లి పోతుంది .

ఆలా సమీరా చెప్పడానికి కారణం ఏమిటి ?
నిజం గా సమీరాకి ఇష్టం లేదా ? అనేది మిగిలిన కథ .
విజయ్ లక్ష్యం  నెరవేరిందా !
వారు ఒకటి అవుతారా లేదా ??

దర్శకుడు "ఇంద్రగంటి " గారిని పొగడకుండా ఉండలేము ,"ప్రేమ కథ "తో ఎన్నో సినిమాలు వస్తాయి కానీ వీరి  ప్రేమ ,.... నటుల కళ్ళలో కనిపించింది,జీవించారు .
హీరో హీరోయిన్ పరిచయమైన సీన్ ,టెర్రస్ పై న సన్నీ వేశాలు అన్ని సహజం గా ఉన్నాయి .
అందరూ పోటీపడి నటించారు.
కుటుంబం అంతా కలిసి చూసే సినిమా ..
ఈ రోజుల్లో ఇది అరుదైన విషయం కదా !


మ్యూజిక్ మరో మాజిక్ . పాటలు ఎన్ని ఉన్నాయి తెలియదు కానీ ,ఆలా సన్నివేసా ల్లో కలిసి పోతాయి . ఒక ఫ్రెష్ నెస్ ఉంటుంది .ఏది అతికినట్టు ఉండవు .
అదికూడా దర్శకుడి ప్రతిభని చెప్పాలి ..

కెమెరా పనితనం హైలెట్ ,ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతం గా మలిచారు .

మొదటి భాగం కొన్ని సీన్లు నెమ్మదిగా సాగాయి కానీ మొత్తం  మీద మంచి చిత్రం చూశామని తృప్తి ... ఫీలింగ్ ...

అక్కడక్కడా నరేష్ అల్లరి,హంగామా కొంచెం ఎక్కువ ఉన్నా ఒకే అనిపిస్తుంది 
ప్రేక్షకుల మదిలో సమ్మోహనం చేసిందనే చెప్పాలి ....

2 comments:

  1. Its never too late for an opinion, good articulation, keep it going.

    ReplyDelete