భజన బ్యాచ్ !!
భజన బ్యాచ్ !! మన తెలుగు సినిమాల్లో ఓ మూవీ లో రావుగోపాల్ రావు ఒక భజన ట్రూప్ పెట్టుకుంటాడు .ఎవరైనా పొగిడితే వాళ్ళు డప్పు,తాళాలతో గోల చేస్తారు,ఆ పొగడ్తలు ఆగేవరకు ! ఇప్పుడు పొలిటికల్ బ్యాచ్ లో కూడా ఇది అవసరమేమో !! మనకి తెలిసి రాష్ట్రంలో రెండు ప్రధాన పత్రికలు ఒక మాజీ సీఎం గారిని భజన చేస్తుంటాయి. ఇంకో పత్రిక ప్రస్తుత సీఎం గారిని ఆకాశాన్ని ఎత్తుతాయి ,పొగడ్త మంచిదే కానీ అది శృతి మించితే వెగటు పుడుతుంది. మన స్థాయిని పెంచుకోవచ్చు అనుకుంటే కొంత అవసరమేమో, గాని మరి అది అతి అయితే గతి మారచ్చు ! జర్నలిజం అంటే ప్రజల పక్షాన ఉండి వారి సమస్యలు అధికారులకి ,మంత్రులకి చేరవేయాలి.వారికీ చేయుతనిచ్చి వారు ఓటు వృదాపోలేదని నమ్మకం కలిగించాలి . మన రాష్ట్రము ఏమి పాపం చేసిందో గాని అది తప్ప అన్నీ చేస్తారు . ఒకరు మీద ఒకరు బురద చల్లుకోవడం తప్ప ప్రజలకి ఒరిగేది గుండు సున్న! వారు విమర్శిస్తే ,మీరు విమర్శించండి తప్పులేదు ,లేదంటే పరువు నష్ట దావా కూడా వేయచ్చు కదా ! ప్రజలకి చేసేది ఇసుకంత ,చెప్పేది...