Posts

Showing posts from July 26, 2018

ఆంధ్రకు కేంద్రం అన్యాయం చేసిందా ?

Image
అవుననే చెప్పాలి ఎందుకంటే విభజన చట్టంలో ఆంధ్రకు "స్పెషల్ స్టేటస్" ఇవ్వాలి అని తీర్మానం చేసారు , కానీ తరువాత ఎన్నికల్లో గెలిచిన  భాజపా మాత్రం ఆ మాట తుంగలో తొక్కింది . 14వ ఆర్థికసంఘం సలహా మేరకు ఏ రాష్ట్రాన్నికి  "ప్రత్యేక హోదా" ఇవ్వరాదని తేల్చింది . దానికి తగ్గట్టు నిధులు ఇస్తామని చెప్పారు, అదికూడా అమలు కావడం లేదు . ఇక్కడ ఒక విషయం గమనిస్తే అప్పటి కాంగ్రెస్ పార్లమెంట్ లో బిల్ పెడితే భాజపా మద్దతు ఇచ్చి "5 కాదు పది సంవత్సరాలు "ఇవ్వాలని వెంకయ్యనాయుడు గారు పోరాడారు, కానీ తీరా వీరు గెలిచాక ఆర్థికసంఘంతో ముడి పెడుతున్నారు ,ఇది అప్పుడు లేదా? లేకపోతె కేంద్రాన్ని ప్రాంతీయ పార్టీలు ఏమి చేయలేవు అనే ధీమానా ?? ఇది  ఎంతవరకు  సబబు . ఒక ప్రధాని ని ఇచ్చిన వాగ్దానాన్ని మరొక ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా పక్కన పెట్టింది అంటే మన పార్టీలకి రాజ్యాంగం మీద ఎంత గౌరవమే  తెలుస్తుంది వెంకయ్య గారు ఉపరాష్ట్రపతి గా ఉన్నా దీనిపై స్పందించకపోవడం శోచనీయం . ఓట్లు కోసం కాళ్ళు పడతారు ,ఓట్లు వేసాక ఆ కాళ్ల ని లాగేస్తారు "అవసరం  ఉంటె కాళ్ళు ,లేకపోతె జుట్టు పట...