ఆంధ్రకు కేంద్రం అన్యాయం చేసిందా ?



అవుననే చెప్పాలి ఎందుకంటే విభజన చట్టంలో ఆంధ్రకు "స్పెషల్ స్టేటస్" ఇవ్వాలి అని తీర్మానం చేసారు , కానీ తరువాత ఎన్నికల్లో గెలిచిన  భాజపా మాత్రం ఆ మాట తుంగలో తొక్కింది . 14వ ఆర్థికసంఘం సలహా మేరకు ఏ రాష్ట్రాన్నికి  "ప్రత్యేక హోదా" ఇవ్వరాదని తేల్చింది . దానికి తగ్గట్టు నిధులు ఇస్తామని చెప్పారు, అదికూడా అమలు కావడం లేదు .

ఇక్కడ ఒక విషయం గమనిస్తే అప్పటి కాంగ్రెస్ పార్లమెంట్ లో బిల్ పెడితే భాజపా మద్దతు ఇచ్చి "5 కాదు పది సంవత్సరాలు "ఇవ్వాలని వెంకయ్యనాయుడు గారు పోరాడారు, కానీ తీరా వీరు గెలిచాక ఆర్థికసంఘంతో ముడి పెడుతున్నారు ,ఇది అప్పుడు లేదా?
లేకపోతె కేంద్రాన్ని ప్రాంతీయ పార్టీలు ఏమి చేయలేవు అనే ధీమానా ??
ఇది  ఎంతవరకు  సబబు .

ఒక ప్రధాని ని ఇచ్చిన వాగ్దానాన్ని మరొక ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా పక్కన పెట్టింది అంటే మన పార్టీలకి రాజ్యాంగం మీద ఎంత గౌరవమే  తెలుస్తుంది
వెంకయ్య గారు ఉపరాష్ట్రపతి గా ఉన్నా దీనిపై స్పందించకపోవడం శోచనీయం .
ఓట్లు కోసం కాళ్ళు పడతారు ,ఓట్లు వేసాక ఆ కాళ్ల ని లాగేస్తారు
"అవసరం  ఉంటె కాళ్ళు ,లేకపోతె జుట్టు పట్టుకున్నట్టు ఉంది"  .

ఇక ప్రాంతీయపార్టీలు ఐనా తెలుగు దేశం మాత్రం స్టేటస్ కోసం ఎడతెగని పోరాటం చేస్తుంది . ఈ విషయం చర్చించటానికి "సి ఎం చంద్రబాబు నాయుడు" గారు 29 సార్లు ఢిల్లీ  చుట్టూ తిరిగారు .ఐనా మోడీ కనికరించలేదు . తరవాత "ధర్మ దీక్ష" చేసారు .

ప్రత్యేక హోదా ఇస్తే ఎన్నో పరిశ్రము లు వస్తాయి ,వారికీ రాయితీలు ఇస్తారు దానిద్వారా ఎందరికో ఉద్యోగాలు  కల్పిస్తారు  ,పని దొరుకుతుంది . ఆర్థికభారం తగ్గుతుంది.

పార్లమెంట్ లో స్టేటస్ కోసం తెలుగుదేశం ఎంపీలు ఐన గల్లా జవదేవ్ ఆంగ్లం లో తన వాక్చాతుర్యంతో  కేంద్రాన్ని దుమ్ముదులిపేసారు  ,ఇక రామ్మోహన్ నాయుడు ఐతే హిందీలో అనర్గళంగా మాట్లాడి కేంద్రాన్ని కడిగిపారేశారు .వారి ప్రసంగాన్ని  చూసి ప్రతి తెలుగు వాడు ఫిదా ఐపోయారు . దీన్ని  చంద్రబాబు  కూడా  అభినందించారు

విశాఖ రైల్వే జోన్ ని ఎప్పటినించో అడుగుతున్నాం ,దాన్ని ఎవరు ఆపరు .
మరి దాన్ని ఎవరు  అడ్డు కున్నారో అందరికి అర్ధం అవుతుంది .
కేంద్ర తలుచుకుంటే ఒక్కరోజులొ  అనుమతి ఇవ్వగలదు ,కానీ మన రాష్ట్రము పై "సవితి తల్లి "ప్రేమ చూపుతుంది ఎందుకంటే వారికీ ఇక్కడ సీట్లు బహుతక్కువ .  తరువాత ఎన్నికల్లో కూడా అంత  ప్రభావం చూపక పోవచ్చు . అది అసలు మతలబు .





















Comments

  1. కేంద్ర తలుచుకుంటే ఒక్కరోజులొ అనుమతి ఇవ్వగలదు ,కానీ మన రాష్ట్రము పై "సవితి తల్లి "ప్రేమ చూపుతుంది ఎందుకంటే వారికీ ఇక్కడ సీట్లు బహుతక్కువ . తరువాత ఎన్నికల్లో కూడా అంత ప్రభావం చూపక పోవచ్చు . అది అసలు మతలబు --- 100% true sir!!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

జవాబు లేని ప్రశ్న ?

నేను చెప్పానా !!

గబ్బా లో ఆసీస్ కి దెబ్బ !!