మన రాజకీయనాయకులు ఈ మధ్య అనవసరంగా కొన్ని విషయాలు ప్రాధాన్యం ఇస్తున్నారు . మేము రాజకీయాల్లోకి ప్రజల సేవకోసం వచ్చామని ,ఇంకా ఎదో సొల్లు చెప్పి మీటింగుల్లో మాటలతో దంచికొడతారు . గెలిచిన తరువాత సరిగ్గా ఒకడు కూడా వారి సొంత జిల్లా గాని,ఊరిలో గాని తిరిగి వారి సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయరు ,కానీ వేరే వారి వ్యక్తిగత జీవితాలు గురించి మాట్లాడటం ఐతే తెలుసు . విమర్శలు చేయడం రాజకీయాల్లో సహజం కానీ మరి ఇంత దిగజారి చేస్తే మీరే ఇరుకునపడతారు . అపహాస్యం అవుతారు దానికి వారి సొంత పార్టీలోనే వ్యతిరేకత ఏర్పాడుతుంది . తరువాత ఎన్నికలకి వెళితే మీ ముఖం కూడా చూడటానికి కూడా జనం ఇష్టపడరు . "ఎవడికో ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు", వీళ్ళకి కావాలి ,గాని వీరికి నీతి న్యాయం ఉండదు. తండ్రి పేరు చెప్పుకొని ఒకడు ,మామ పెట్టి న పార్టీలు తో మరొకడు మనుగడ సాగిస్తున్నారు గాని వాళ్ళమీద ఎన్ని కేసులు ఉన్నాయో ఎవరికి తెలియదు .ప్రతి శుక్రవారం వెళ్లి కోర్టులో సంతకాలు పెట్టాలి ఒక సర్ . సుమారు రెండువేల కిలోమీ...