అలోచించి మాట్లాడండి !!
మన రాజకీయనాయకులు ఈ మధ్య అనవసరంగా కొన్ని విషయాలు ప్రాధాన్యం ఇస్తున్నారు .
మేము రాజకీయాల్లోకి ప్రజల సేవకోసం వచ్చామని ,ఇంకా ఎదో సొల్లు చెప్పి మీటింగుల్లో మాటలతో దంచికొడతారు . గెలిచిన తరువాత సరిగ్గా ఒకడు కూడా వారి సొంత జిల్లా గాని,ఊరిలో గాని తిరిగి వారి సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయరు ,కానీ వేరే వారి వ్యక్తిగత జీవితాలు గురించి మాట్లాడటం ఐతే తెలుసు .
విమర్శలు చేయడం రాజకీయాల్లో సహజం కానీ మరి ఇంత దిగజారి చేస్తే మీరే ఇరుకునపడతారు . అపహాస్యం అవుతారు
దానికి వారి సొంత పార్టీలోనే వ్యతిరేకత ఏర్పాడుతుంది .
తరువాత ఎన్నికలకి వెళితే మీ ముఖం కూడా చూడటానికి కూడా జనం ఇష్టపడరు .
"ఎవడికో ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు", వీళ్ళకి కావాలి ,గాని వీరికి నీతి న్యాయం ఉండదు.
తండ్రి పేరు చెప్పుకొని ఒకడు ,మామ పెట్టి న పార్టీలు తో మరొకడు మనుగడ సాగిస్తున్నారు గాని వాళ్ళమీద ఎన్ని కేసులు ఉన్నాయో ఎవరికి తెలియదు .ప్రతి శుక్రవారం వెళ్లి కోర్టులో సంతకాలు పెట్టాలి ఒక సర్ .
సుమారు రెండువేల కిలోమీటర్లు పాద యాత్ర చేసారు ,ఏమి సాదించారు ?
కనీసం ఆ ప్రాంతాల్లో ఉండే ప్రధాన సమస్య ప్రభుత్వం చేరాలా చర్య తీసుకున్నారా ?
ఎపుడు చూడు ముఖ్యమంత్రి పదివి మీదే యావ !!
అసెంబ్లీ కి వెళ్లి ప్రజాసమస్యలు పై ఒకడు మాట్లాడరు ,కనీసం వెళ్లరు చాలా మంది .
మరొకడు స్టేలు తెచ్చుకుని నేను 'నిప్పు' అంటారు ,మామని వెన్ను పోటు పొడిచి పార్టీని చేజిక్కించుకున్న ఘన చరిత్ర మన నాయకులది .
మిమ్మల్ని చూసి ఎంతోమంది ప్రేరణ, స్ఫూర్తి పొందాలి అంటే మీరు ఎలా ఉండాలి ?ఎలా మాట్లాడాలో అలోచించి మాట్లాడండి .
మంచి మాటలతో ఎందరి హృదయాలు ఐనా గెలవచ్చు . మాటే మనిషికి ఆభరణం ,
యువతకి మంచి మార్గం నిర్దేశించి దేశానికి ఉపయోగ పడేలా చేయండి .. లేకపోతె మీ వ్యాపారాలు,సినిమాలు మీరు చూసుకోండి . అంతే కానీ రాష్ట్రాన్నిమీ స్వార్థం కోసం రెచ్చగొట్టే నాశనం చేయద్దు .
.... తండ్రి పేరు చెప్పుకొని ఒకడు ,మామ పెట్టి న పార్టీలు తో మరొకడు మనుగడ సాగిస్తున్నారు గాని వాళ్ళమీద ఎన్ని కేసులు ఉన్నాయో ....
ReplyDeleteతండ్రి పేరు చెప్పుకొనే ఆయన మీద కేసులున్నాయన్నది జగద్విదితం. మామపెట్టిన పార్టీతో మనుగడ సాగించే ఆయన మీద కేసులెన్నో మీకైనా విదితమైతే చెప్పరాదా? ఎవరో అన్నారని కాక మీకు తెలిస్తే చెప్పవచ్చును కదా?
.... మామని వెన్ను పోటు పొడిచి పార్టీని చేజిక్కించుకున్న ఘన చరిత్ర .....
అ మామను నాడు, అందరికీ నేడు బాగానే తెలిసిన మరెవరో పోటువేస్తున్నప్పుడు తప్పనిసరైనదేమో పార్టీని చేజిక్కించుకోవటం? ఒకరు స్థాపించినంత మాత్రానో ఒకరు నాయకత్వం వహిస్తున్నంత మాత్రానో అది వారి సొత్తు ఐపోదన్న మాట మరిస్తే ఎలా?
అందరినీ "అలోచించి మాట్లాడండి !!" అని బహుచక్కగా హెచ్చరిస్తున్న మీరు ఆట్టే అలోచించి మాట్లాడుతున్నట్లుగా అనిపించటం లేదు!
hi sir cases lekunda stay enduku techhukuntaru,ootu ki notu case kada !
ReplyDeleteparty ni alage chejikinchukovala ,daniki dharmabaddam avasaram leda sir?
iam pointing on politicians("అలోచించి మాట్లాడండి) because lot of people will inspire from them