చిరునవ్వుతో - పార్ట్ 1


"పచ్చటి పొలాలు మధ్యలో కొన్ని ఇళ్ళు ,దానిలో ఒక చిన్న డాబా .ఆ ఇంట్లో నేను       (రాంకి ),చెల్లి ,అమ్మనాన్న". చిన్న కుటుంబం చింతలేని కుటుంబం .తెల్లవారితె గబగబా లేచి రెడీ అయ్యి బడికి పరుగు. సాయంత్రం ఇంటికి చేరి కాసేపు ఆటలు,బడిలో ఇచ్చిన పని ముగించి పడుకోవడం ,ఇది నా దిన చర్య. ఆలా కొంతకాలం గడిచింది. 
పదివరకు ఊరి బడిలో చదువుకొని ఇంటర్ పక్కనున్న టౌన్ కి బయలుదేరాను .ఇంటర్లో బాగా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నా.తరువాత ఇంజనీరింగ్  సీటు తెచ్చుకొని హైదరాబాద్ పయనమయ్యా! 

బస్ లో బయలుదేరి భాగ్యనగరం చేరాను . అక్కడ తన ఫ్రెండ్స్ ఉంటున్న రూమ్ కి చేరి రిలాక్స్ అయ్యా.  ఫ్రెండ్స్ సహకారం తో కోర్స్ జాయిన్ అవడానికి అమీర్ పేట్ కి వెళ్లి అన్ని కోర్స్ లు గురించి తెలుసుకొని ఒక కోర్స్ జాయిన్ అవ్వడానికి డిసైడ్ అయ్యాను. 
రెండు  రోజులు తరువాత "హాయ్ " అనే పలకరింపు ఇంపుగా వినపడింది ,ఎవరని పక్కకి తలతిప్పి చూసా!చక్కని నవ్వు ,నుదుట కుంకుమ బొట్టు ,చేతిలో పుస్తకాలతో 'మోడరన్ మహాలక్ష్మి'లా ఉంది. 

"నేను కొత్తగా హైదరాబాద్ వచ్చాను ,ఇక్కడ ఏ  కోర్స్ బాగుంటుందో కొంచెం చెబుతారా?"అని అడిగింది ,చాలా కోర్స్లు  గురించి వివరాలు చెప్పా,తన పేరు 'రాధ' అని , "థాంక్స్" చెప్పి వెళ్ళిపోయింది.

షరా మామూలే ... 
రోజు క్లాస్ కి రావడం వినడం ,ప్రాక్టీస్ చేసి రూమ్ కి వెళ్లడం. 
అలా కొన్ని రోజులు గడిచాయి ,రాధతో  మాట కలిపా, తాను హాస్టల్లో స్నేహితురాలితో ఉంటుందని చెప్పింది.
లా కబుర్లతో కొన్ని రోజులకి ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. 
ఫోన్లో పలకరింపులు ,సాయంత్రం కేఫ్ లో కబుర్లు .

కోర్స్ పూర్తి అయ్యింది ,ఉద్యోగాల వేటలో పడ్డాం. తనకి మంచి కంపెనీ లో ఉద్యోగం దొరికింది ,నాకు వేరే కంపెనీ లో ఉద్యోగం దొరికింది. 
ఆదివారాలు మిత్రులతో కలవడం బయట  షికార్లు .
ఆలా కాలం వేగంగా కదిలింది .


ఇంకా వుంది .... 

Comments

Popular posts from this blog

జవాబు లేని ప్రశ్న ?

నేను చెప్పానా !!

గబ్బా లో ఆసీస్ కి దెబ్బ !!