బిగ్ బాస్ షో -2 .
ఇంతకూ ముందు బిగ్ బాస్ -1 లో జూనియర్ ఎన్ . టి. ఆర్ . వ్యాఖ్యాత గాచేసే వారు ,ఇప్పుడు "నాని " వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్నారు .
కొంతమంది హీరో లు ,టి వి నటులు ,కొంతమంది సామాన్యులు ఈ గేమ్ లో ఆడుతున్నారు .
సుమారు వంద రోజుల్లో అందరు కలిసి ఆ హౌస్ లో ఉండాలి .
బయటకి వెళ్ళటానికి అనుమతి ఉండదు . మైక్ ధరించాలి .
ఆందరు అక్కడే ఉండి వండుకుని ,తిని పడుకోవాలి .
బిగ్ బాస్ ఏమి టాస్క్ ఇస్తే అది కూడా చేయాలి
ప్రతి వారానికి ఒక కెప్టెన్ ని బిగ్ బాస్ ఎంపిక చేస్తారు .
వారి అడుగు జాడల్లో వీరు ఉండాలి ,,కానీ కెప్టెన్ కి ఆ వారం లో ఎలిమినేషన్ ఉండదు
ఇది ఒకరకమైన మైండ్ గేమ్ అని నా అభిప్రాయం .
మన మాటలతో,పనులతో ఎదుటివారిని ఎదో రకం గా బయటకి పంపించాలి అని చూసే వారు ఎక్కువ . దానికి ఎన్నో వ్యూహాలు రచిస్తారు కానీ కనపడరు
ఈ సీజన్ లో నాని ఏంకర్ గా కొత్త ,కానీ అలవాటు పడుతున్నాడు
నిన్న సంజన అనే అమ్మాయి ని బయటకి పంపించారు ,
నందిని ఎంట్రీ ఇస్తుంది .
ఈ షో అయ్యే లోపు వారికీ మంచి పేరు ,ప్రఖ్యాతలు ,ఆఫర్లు వస్తున్నాయి . ఇది ఒకరకం గా ఆ నటులకి ,గాయని గాయకులకు ,సామాన్యులకి మంచి పరిణామమే .
Comments
Post a Comment