నిన్న ప్రచురించిన సింగర్ సునీతా రెండో వివాహం మీద ఆమె స్పందించారు ,ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదని,ఎవరో కావాలని పుకార్లు చేస్తున్నారని ,తమ వ్యక్తిగత వారికీ ఎందుకు అంత కుతూహలం? అని ఆవేదన చెందారు . తనకి అటువంటి ఉద్దేశం లేదని చెప్పారు .
తెలుగు సినిమా ప్రేక్షకులకి ఒక తెలియని అనుభూతి ,ఎన్నో ప్రేమ కధలు చూసాం కానీ ఇది దానికి కొంచెం ఎక్కువే !(నా ఫీలింగ్) సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు తరువాత ఇప్పుడు వీడి సమీక్ష ఎవడికి కావాలి అనుకుంటే పొరపాటే !! సగటు సినిమా పిచ్చి ఉన్న అభిమానిగా రాస్తున్నా ... రాయకుండా ఉండలేక పోతున్నా ! అనగనగ అందమైన కుటుంబం ... అమ్మ ,నాన్న ,చెల్లి,మన హీరో .. విజయకుమార్ (సుదీర్ బాబు ). విజయ్ కి బొమ్మలు వేయడం అంటే ఇష్టం,పిల్లలకి కథలతో కూడిన బొమ్మలు వేసి పుస్తకం ప్రచురించాలని లక్ష్యం !అది వారికీ విజ్ఞానం ఇస్తుంది అని నమ్మకం . తనకి సినిమాలు అంటే మంచి అభిప్రాయం ఉండదు ,పడదు ,వారిది అంతా నటన అనే అభిప్రాయం ,కానీ తన స్నేహితులకి ఆ సినిమాలే ఇష్టం . ఒక షూటింగ్ నిమిత్తం వీరి ఇల్లు 20 రోజులు కావాలని సినిమా వాళ్ళు అడగ్గా తండ్రి (నరేష్ )ఒక కండిషన్ పెడతాడు ,అదే తనకి చిన్న వేషం ఇవ్వాలని !!ఓకే అంటారు . ఆ సినిమా లో హీరోయిన్ "సమీరా"(అదితిరావు )ని చూస్తాడు ,తనకి తెలుగు రాదని నవ్వుకుంటాడు . తనకి తెలుగు నేర్పమని అడగ్గా సరే అంటాడు . అలా కొన్ని రోజులకి వారి పరిచయం,స్నేహం గా ...
నేను చెప్పానా !! చేసిన ప్రతి పనికి ఫలితం తప్పక ఉంటుందని ! నోరు జారిన ప్రతిఫలంగా "కత్తి మహేష్" కి ఆరునెలలు నగర బహిష్కరణ విధించారు . ఇంకా అదుపులేకుండా వాగితే శాశ్వతంగా నగరం నుంచి బయటకి తోలేస్తారని సాక్షాత్తు డి. జి. పి వివరించారు , వాక్కు స్వతంత్రం ఉంది కదా అని,ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్న కారణంగా ఈ విధంగా చేయవలసి వచ్చిందని చెప్పారు
Comments
Post a Comment