Posts

కంటే కూతుర్నే కనాలి !!

Image
ఈ రోజుల్లో కూడా  అమ్మాయి పుట్టినా ఎదో కష్టం అని ఫీల్ అయ్యే జనాలు ఇంకా ఉన్నారు .. కానీ ఒక ఆడపిల్ల తండ్రి గా ఆ ప్రేమ ,ఆప్యాయత ముందు ఏదీ ఐనా చిన్నదే అనిపిస్తుంది ... వారి ముసిముసి నవ్వులు ,చిన్న మాటలు వింటుంటే అన్ని మర్చిపోతా !! ఇంటికి వెళ్లిన వెంటనే కబుర్లు ,ఆటలు ,పాటలు తో సందడే ... ఈ మధ్య డాన్స్ (నృత్యం) కూడా మొదలు ... కొత్త స్టెప్స్ నేర్పుతుంది నాకు .. నేను చేయకపోతే ఇది  కూడా రాదా? అని వెటకారం... :) చదరంగం  కూడా మొదలు పెట్టారు మేడం గారు... అప్పుడప్పుడు పాప పైన కోపం వస్తుంది గాని కొద్దీ సేపు మాత్రమే , మరలా తనతో చిన్నవాడిగా మారిపోతా .. దేవుడు అన్ని చోట్ల లేకపోయినా తన ప్రతి రూపంలా తల్లిగా,కూతురిగా ఉంటాడేమో ... ఆడ పిల్ల లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు కానీ తాను ఊరు వెళితే ఎదో తెలియని వెలితి నాలో,ఇంట్లో ... ఇంతకీ తన ముద్దు పేరు ఏమిటో తెలుసా "హనీ "....

ప్రభాస్ కి అంత సీన్ ఉందా ?

Image
ప్రభాస్ కి అంత సీన్ ఉందా ? "బాహు బలి"  ఒక ప్రభంజనం ...  రాజ మౌళి దర్శక ప్రతిభ ,కీరవాణి సంగీతం తొ దేశాన్ని ఊపేసింది.  ప్రభాస్,రానా ,అనుష్క,తమన్నా నటనతో మెప్పించారు,  రికార్డులు కొల్లగొట్టింది . బడ్జెట్ భారీగా పెట్టినా  తెలివి గా మార్కెట్ చేసుకొని 1000 కోట్లు దాటింది ,అంతవరకూ బాగానే ఉంది .  కానీ ప్రభాస్ తరువాతి 250  కోట్లు పెట్టదండం అంటే సాహసమే అని చెప్పాలి,ఒకే ఒక సినిమా చేసిన దర్శకుడు చేతిలో ఇంత  పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు.  కానీ అది ప్రభాస్ ఒక్కడి పేరుతో అంత వసూళ్లు సాధిస్తుందా ??అంత మార్కెట్ ఈ చిత్రం చేయగలదా ?? వేచిచూడాలి ... 

మార్పు మంచిదే కానీ ....

మార్పు మంచిదే కానీ ....  మనలో అందరం ఎదుట వారి తప్పులు వెతుకుతున్నాం కానీ మన బాధ్యత మాత్రం తెలుసుకోము . ఏమైనా అంటే "టైం లేదు " అని ఒక డైలాగ్ ఒకటి .  రోడ్ మీద వెళ్ళేటప్పుడు రాంగ్ రూట్ లో వెళతాం కానీ రూల్స్ అప్పుడు గుర్తు రావు , మన పని అయిపోవాలి కానీ పక్కనోడు పోయిన పర్లేదు . మార్పు మన నుంచి మొదలు కావాలి ,మనం మారితే జనం కి చెప్పచ్చు .

హాయ్ అండీ ,

హాయ్ అండీ , అందరికి నమస్కారము ... చాలా రోజులు తరువాత మరలా "బ్లాగ్" వ్రాయడం మొదలుపెట్టాను. మీ అందరి సహకారం  ఉంటె మరలా మంచి పోస్ట్లు వ్రాసి ,మీ మన్నలు పొందాలి అని ఆశిస్తూ .... సాయి