ఒకే ఒక్కడు ...

ఒకే ఒక్కడు ... 

ఇంగ్లాండ్ తో జరిగుతున్న మొదటి టెస్ట్ లో భారత్  తడబడి  నిలబడింది .  వంద పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి చాప చుట్టే సమయంలో "విరాట్ కోహ్లీ " ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు,కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు . విరాట్ పోరాడి 149  పరుగులు చేసి,భారత్  274 పరుగులకి ఆల్ అవుట్ అయ్యింది . దీనితో ఇంగ్లాండ్ కి స్వల్ప ఆధిక్యం లభించింది . 

.ఒక వైపు వికెట్లు పడిపోతున్న మొండిగా మరొక ఎండ్ లో బ్యాటింగ్ కొనసాగించాడు,
మిగిలిన వారినుంచి  పూర్తి సహకారం అందకపోయినా ఏంతో సహనంగా కొన్ని బంతులు వదిలేసి,మరి కొన్ని డిఫెన్స్ ఆడి  ,చెత్తబంతులు బౌండరీలుగా మలిచాడు ,ఇంగ్లాండ్ బౌలర్లు బాగా విసిగించారు .ఈ ప్రయాణం లో హార్దిక్ పాండ్య 22 పరుగు చేసి బౌల్డ్ గా  వెనుతిరిగాడు . 

దీనితో ఇంగ్లాండ్ ఫై మొదటి సెంచరి చేసి తన సత్తా చాటాడు 
కోహ్లీ 42 పరుగుల వద్ద అంతర్జాతీయ క్రికెట్ లో ఏడు వేల  పరుగులు సాధించాడు ,దీనితో 7 వేల పరుగులచేసిన కెప్టెన్ లో మూడవవాడు గా నిలిచాడు . 

సెంచరి  చేసిన తరువాత  తన చొక్కాలోని "రింగ్" తీసి ముద్దాడి ,తన భార్య అనుష్క శర్మ వైపు బ్యాట్ చూపి గాల్లో ముద్దులు గుప్పించాడు . 

Comments

Popular posts from this blog

తెలుగు కథలు పంపండి !!

నేను చెప్పానా !!

Call for Services in India