Posts

ఈ బాదుడు ఎన్నాళ్ళు ??

Image
మన పాలకులు మైక్ ఇస్తే డప్పులు కొట్టి "అది ఇస్తాం  ,ఇది చేస్తాం" అంటారు గాని ,ముఖ్యమైన సమస్య మాత్రం పరిష్కరించరు .  అదే పిల్లల ఫీజు సమస్య !! ఒక బాబు గాని ,పాప గాని ప్రెవేట్ స్కూల్ కి వెళితే "నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఫీజు" చూస్తే కళ్ళు తిరిగి కింద పడాల్సిందే !! ఒకడు అడ్మిషన్ కి పదివేలు అంటాడు ,మరొకడు ఇరవై అంటాడు , మరొకడు ఇంటర్నేషనల్ స్కూల్ అండి "లక్ష " అని బాదుడు  చిన్న బడిలో సంవత్సరానికి సుమారుగా   30 నుంచి 70 వేలు గుంజుతున్నారు !! దీనిని కట్టడి చేసే వారు లేరా ?? ప్రభుత్వం అలా ఉంటె మనం కూడా పరువు,ప్రతిష్ట అని పక్కనోడు ఏమి చేస్తే మనం "అంతకు మించి " అని గొప్పలకు పోయే వారు లేకపోలేదు ...   చదువుకోవాలి  గాని చదువుని "కొనకూడదు ".  దీనికి చరమ  గీతం అందరం పాడి ఒక వ్యవస్థ ద్వారా "ఫీజు "కట్టడి చేయాలి .  ఇంతకు  మించి వసూల్ చేస్తే , వారి లైసెన్స్ రద్దు చేయాలి , అప్పుడు కానీ భయపడరు ... పిల్లలు బాగుపడరు 

మల్లె మనసులు

Image
"మల్లె" మనసులు  ప్రతి మనిషి జీవితం లో కుటుంబం తో పాటు కొంతమంది స్నేహితులు తప్పక ఉంటారు .  ఆలా స్నేహితులు లేని వారు చాలా అరుదు.  "మన స్నేహితులు ఎవరో చెపితే మనం ఎలాంటివాళ్ళో చెపుతా "అన్నారు ఓ కవి .  ఆలా నా జీవిత ప్రయాణం లో కొందరు ఉన్నారు .  వారిలో మర్చిపోలేని వారు కొందరు ,మర్చిపోతే బాగుంటుంది అనుకునే వారు కొందరు .  కాలేజీ లో పరిచయం ఐన  వారిలో "మల్లి " ఒక్కడు. చదువు లో, తెలివితేటల్లో ముందు .  మా క్లాస్ వాళ్ళతో  కన్నా వాడితో చనువు ఎక్కువ . కలిసి సిని మాలు ,షికార్లు .  కల్మషం లేని వ్యక్తి . వాడిని చూసి కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నా , ఎల్లప్పుడూ నా గురించి ,నా ఎదుగుదల గురించి ఆశిస్తాడు .  వారి కుటుంబం తో కూడా మంచి అనుబంధం ఉంది .  ప్రస్తుతం తను  నా దగ్గర్లో లేకపోయినా ఫోన్ లో మాట్లాడుతుంటాడు . వృత్తి రీత్యా  అమెరికా లో ఉంటున్నాడు .   ఒక పని లో నాలో నమ్మకం లేకపోతె ,చెప్పి నమ్మకం కలిగించి నాకు ప్రోత్సహిస్తాడు .  వృత్తిలో లేక బిజినెస్ లో గాని నష్టపోయినా ,కల...

కంటే కూతుర్నే కనాలి !!

Image
ఈ రోజుల్లో కూడా  అమ్మాయి పుట్టినా ఎదో కష్టం అని ఫీల్ అయ్యే జనాలు ఇంకా ఉన్నారు .. కానీ ఒక ఆడపిల్ల తండ్రి గా ఆ ప్రేమ ,ఆప్యాయత ముందు ఏదీ ఐనా చిన్నదే అనిపిస్తుంది ... వారి ముసిముసి నవ్వులు ,చిన్న మాటలు వింటుంటే అన్ని మర్చిపోతా !! ఇంటికి వెళ్లిన వెంటనే కబుర్లు ,ఆటలు ,పాటలు తో సందడే ... ఈ మధ్య డాన్స్ (నృత్యం) కూడా మొదలు ... కొత్త స్టెప్స్ నేర్పుతుంది నాకు .. నేను చేయకపోతే ఇది  కూడా రాదా? అని వెటకారం... :) చదరంగం  కూడా మొదలు పెట్టారు మేడం గారు... అప్పుడప్పుడు పాప పైన కోపం వస్తుంది గాని కొద్దీ సేపు మాత్రమే , మరలా తనతో చిన్నవాడిగా మారిపోతా .. దేవుడు అన్ని చోట్ల లేకపోయినా తన ప్రతి రూపంలా తల్లిగా,కూతురిగా ఉంటాడేమో ... ఆడ పిల్ల లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు కానీ తాను ఊరు వెళితే ఎదో తెలియని వెలితి నాలో,ఇంట్లో ... ఇంతకీ తన ముద్దు పేరు ఏమిటో తెలుసా "హనీ "....

ప్రభాస్ కి అంత సీన్ ఉందా ?

Image
ప్రభాస్ కి అంత సీన్ ఉందా ? "బాహు బలి"  ఒక ప్రభంజనం ...  రాజ మౌళి దర్శక ప్రతిభ ,కీరవాణి సంగీతం తొ దేశాన్ని ఊపేసింది.  ప్రభాస్,రానా ,అనుష్క,తమన్నా నటనతో మెప్పించారు,  రికార్డులు కొల్లగొట్టింది . బడ్జెట్ భారీగా పెట్టినా  తెలివి గా మార్కెట్ చేసుకొని 1000 కోట్లు దాటింది ,అంతవరకూ బాగానే ఉంది .  కానీ ప్రభాస్ తరువాతి 250  కోట్లు పెట్టదండం అంటే సాహసమే అని చెప్పాలి,ఒకే ఒక సినిమా చేసిన దర్శకుడు చేతిలో ఇంత  పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు.  కానీ అది ప్రభాస్ ఒక్కడి పేరుతో అంత వసూళ్లు సాధిస్తుందా ??అంత మార్కెట్ ఈ చిత్రం చేయగలదా ?? వేచిచూడాలి ... 

మార్పు మంచిదే కానీ ....

మార్పు మంచిదే కానీ ....  మనలో అందరం ఎదుట వారి తప్పులు వెతుకుతున్నాం కానీ మన బాధ్యత మాత్రం తెలుసుకోము . ఏమైనా అంటే "టైం లేదు " అని ఒక డైలాగ్ ఒకటి .  రోడ్ మీద వెళ్ళేటప్పుడు రాంగ్ రూట్ లో వెళతాం కానీ రూల్స్ అప్పుడు గుర్తు రావు , మన పని అయిపోవాలి కానీ పక్కనోడు పోయిన పర్లేదు . మార్పు మన నుంచి మొదలు కావాలి ,మనం మారితే జనం కి చెప్పచ్చు .

హాయ్ అండీ ,

హాయ్ అండీ , అందరికి నమస్కారము ... చాలా రోజులు తరువాత మరలా "బ్లాగ్" వ్రాయడం మొదలుపెట్టాను. మీ అందరి సహకారం  ఉంటె మరలా మంచి పోస్ట్లు వ్రాసి ,మీ మన్నలు పొందాలి అని ఆశిస్తూ .... సాయి