Posts

ప్రజల్లో "మార్పు" రావాలి !

Image
కొన్ని నెలలలో ఎన్నికలు సమీపిస్తున్నాయి . ఈ ఎన్ని కల ద్వారా మన గ్రామానికి ,లేక పట్టణానికి ప్రజాప్రతినిధి ని  ఎన్నుకోవాలి . ఎవడైతే ప్రజల కష్టాలు తనవి గా భావించి ,స్పందించి తక్షణం దానికి పరిష్కారం వెతికి పనులు పూర్తి చేసి ,అభివృద్ధి చేస్తారో వారిని ఎంచుకోండి .కానీ అనాదిగా  ఏమి జరుగుతుంది ? ముఖ్యంగా మనిషి ఆశాజీవి,ఎవరో వచ్చి ఎదో చేస్తాడని ఎదురు చూస్తాడు ,సోమరితనం తో పని చేయకుండా డబ్బు ఎలా పొందాలి అనుకొనే వారు లేకపోలేదు! చదువు లేక కొంతమంది ,చదువుకొన్నా ఉద్యోగ,ఉపాధి అవకాశము లేక కొందరు ఖాళీగా ఉంటారు. "తప్పు దారిలో ఐనా వెళ్లి డబ్బు సంపాదించాలి" అని ఈజీమనికి అలవాటు పడినవారు మరికొందరు . దీనిలో పరోక్షం గా ప్రభుత్వ ప్రమేయం ఉండి ,ప్రజాసంక్షేమం పథకాలు పేరు చెప్పి  (రూపాయి కి కిలోబియ్యం,ఆడవాళ్ళకి అంగనివాడిలో పావలా వడ్డీ ) వంటివి తక్కువ ధర కి, కొన్ని ఉచితంగానో  ఇచ్చి,చేసే  పనికి కూడా వెళ్లకుండా ప్రోత్సహిస్తున్నారు . వీరిని అదనుగా చూచి ,ప్రత్యక్ష ఎన్నికలు వస్తాయి అని తెలియగానే కొన్ని పార్టీలకి చెందిన నాయకులు వారికి గేలం వేస్తారు .నీకు ఏమి భయం లేదు "నీ లైఫ్ హ్యాపీ గా ...

భజన బ్యాచ్ !!

Image
భజన బ్యాచ్ !! మన తెలుగు సినిమాల్లో ఓ మూవీ లో  రావుగోపాల్ రావు ఒక భజన ట్రూప్ పెట్టుకుంటాడు .ఎవరైనా పొగిడితే వాళ్ళు డప్పు,తాళాలతో  గోల చేస్తారు,ఆ పొగడ్తలు ఆగేవరకు ! ఇప్పుడు పొలిటికల్ బ్యాచ్  లో కూడా ఇది అవసరమేమో !! మనకి తెలిసి రాష్ట్రంలో రెండు ప్రధాన పత్రికలు  ఒక మాజీ సీఎం గారిని భజన చేస్తుంటాయి.  ఇంకో పత్రిక ప్రస్తుత  సీఎం గారిని ఆకాశాన్ని ఎత్తుతాయి ,పొగడ్త మంచిదే కానీ అది శృతి మించితే వెగటు పుడుతుంది.  మన స్థాయిని పెంచుకోవచ్చు అనుకుంటే కొంత అవసరమేమో, గాని మరి అది అతి అయితే గతి మారచ్చు ! జర్నలిజం అంటే ప్రజల పక్షాన  ఉండి  వారి సమస్యలు అధికారులకి ,మంత్రులకి చేరవేయాలి.వారికీ చేయుతనిచ్చి వారు ఓటు వృదాపోలేదని నమ్మకం కలిగించాలి .  మన రాష్ట్రము ఏమి  పాపం చేసిందో గాని అది  తప్ప అన్నీ చేస్తారు . ఒకరు మీద ఒకరు బురద చల్లుకోవడం తప్ప ప్రజలకి ఒరిగేది గుండు సున్న!  వారు విమర్శిస్తే ,మీరు విమర్శించండి తప్పులేదు ,లేదంటే పరువు నష్ట దావా కూడా వేయచ్చు కదా ! ప్రజలకి చేసేది ఇసుకంత ,చెప్పేది...

స్మార్ట్ ఫోన్ తో పిల్లలకి మంచా, చెడా ?

Image
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి .అదే ఫోన్ తో పిల్లలుకూడా ఆడుకుంటున్నారు ,ఇవ్వకపోతే మారం చేస్తారు . కొంతమంది తల్లితండ్రులు వారి గోల,బాధ భరించలేక వారికీ ఇస్తారు .  వారిని నిశబ్దంగా ఉంచడంకోసమో ,అల్లరిని కంట్రోల్ చేయడం కోసమో లేకుంటే భోజనం చేస్తారనో  వారిచేతిలో ఫోన్ పెడతాం .  ఫోన్లు వల్ల మంచి కూడా ఉన్నది ,కానీ అతి ఫోన్ వాడకం వల్ల అనర్దాలు ఉన్నాయి  1. చిన్న పిల్లలో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. వేరే వారితో మాట్లాడటం వల్ల,వేరకరితో కళ్ళు కాంటాక్ట్ తో వారిలో బెరుకు భయం తగ్గుతాయి.  అంతేకాని ఫోన్ తలకిందికి వాల్చి చూస్తే ఏమి వస్తుంది ? మెడ నొప్పితప్ప ! 2.చిన్న పిల్లలు ముఖ్యంగా ఆటలు ఆడాలి ,దాని ద్వారా వారికి ఉత్సాహం ,ఉత్తేజం ఉంటాయి. ఎముకలు, కండరాలు దృడంగా అవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది .   .ఆటల వల్ల చెమట పట్టి ,తరువాత ఫ్రెష్ అయ్యాక,చక్కగా  తిని తొందరగా నిద్రపోతారు.  3. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల ఏకాగ్రత కోల్పోవడం ,ఆకలి మందగిస్తుంది  4. స్మార్ట్ ఫోన్  సమీపంలో నిద్రుస్తున్న ...

HOW TO MAKE MONEY?

Image
HOW TO MAKE MONEY? THIS IS THE BIG DEAL IN THIS WORLD. WE HAVE SOLUTION , IF U ARE READY TO SPEND YOUR VALUABLE TIME WITH SMALL INVESTMENT(200-500 RS). NO MARKETING,NO NETWORKING,NO TARGETS HERE IS THE OPPORTUNITY. FOR SERIOUS PEOPLE ONLY. WATSAPP :919959762999

what is Maa Aqua ?

Image
Welcome to Maa Aqua Every day, consuming an adequate quantity of water keeps the skin fresh, soft and glowing. It helps to keep the skin moist, maintain the optimal body temperature, hydrates and replenishes the skin tissues leading to an increase in the skin’s elasticity. For a human body to maintain all these qualities, water should be free of toxins. Maa Aqua is a leading manufacturer of water purifiers, and a solution provider to water treatment. We are in the business of water for more than a decade and have expertise in manufacture, supply, erection and commissioning of Water Purifiers, Reverse Osmosis Plants, Ultrafiltration, UV water treatment plant, Swimming Pool Filtration Systems, Misting Systems and water treatment spare parts. Why you require a water purifier? Most of the diseases are associated with a change in weather conditions or consuming food in unhygienic places. We brush aside the fact that even water can cause the diseases. At most homes ...

లాక్ తీసారా ??

Image
లాక్ తీసారా ?? "ఎడబాటు తో ఎన్నాళ్ళో  దూరం తొలగి  తిరిగి కలిసే  ప్రేమికులలా" .. దేశ ప్రజలకు సుమారు 2 నెలల వ్యవధి తరువాత కేంద్రం  లాక్ డౌన్  నుండి వెసులుబాట్లు ఇచ్చింది . ఇక్కడ ముఖ్య  విషయం ఏమిటంటే "ప్రభుత్వం " లాక్ తీసింది కానీ "కరోనా కాదని"ప్రజలు గమనించాలి .  మన బాధ్యత ఇప్పుడు ఇంకా ఎక్కువ వుంది .ఇన్నాళ్లు ఇంట్లోఉండి, ఒకే సారి బయట బలాదూర్ తిరిగామో కరోనా తో కాటు తప్పదు. చేతుల శుభ్రత ,మాస్కు ధరించటం,భౌతిక దూరంలాంటివి  మరిచిపోకుండా పాటించాలి . కరోనా నుంచి మనం ఏమి నేర్చుకున్నాం ? మనిషికున్న అహంకారాన్ని ఈ కరోనా మహమ్మారి ఒక్కసారి నేలకేసి కొట్టి ప్రకృతి  ముందు మనిషి చాలా "చిన్నజీవ"ని  తెలియచేసింది. మనిషి లేకుండా ప్రకృతి లోని జీవరాసులు హాయిగా స్వేచ్ఛగా విహరించాయి . అంటే మనిషికి ప్రకృతి తో,ఇతర ప్రాణులతో  పని కానీ, వాటికీ మన అవసరం అంతలేదన్నమాట !! అడవులని నరికి ,పట్టణాలు చేసి ధ్వని ,వాహన కాలుష్యాన్ని తానే తయారు చేసి ,  కష్టాలు కొనుకొన్ని తెచ్చుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి, తన సంపాదన హారతి చే...

ఆరోగ్యమే మహా భాగ్యం

Image
ఆరోగ్యమే మహా భాగ్యం .... ప్రతి మనిషి తన జీవితం హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు .చక్కని ఆరోగ్యం కోసం తాజా పండ్లు తింటారు . కానీ దురదృష్టవశాత్తూ నేటి పోటీ ప్రపంచంలో సంపాదనే ద్యేయంగా  సరైన  పండ్లు ,కూరగాయలు  లేక ఎన్నో కష్టాలు "కొని" తెచ్చుకుంటున్నాడు . రాత్రనక, పగలనక కష్టపడి సంపాదించిన డబ్బు తో కల్తీ కూరగాయలు ,పండ్లు తిని అనారోగ్యం పాలవుతున్నారు. తరువాత ఆ రోగాల నివారణ కోసం హాస్పిటల్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి  జీవితం నాశనం చేసుకుంటున్నాడు . ఉదాహరణకి మార్కెట్ లో దొరికే అరటిపళ్ళు ,మామిడి కాయలు తీసుకుందాం.  వాటిని పూర్తిగా ముగ్గనివ్వకుండా సొమ్ము చేసుకోవాలని కకృతి తో  వాటిని మగ్గ బెట్టి లేక ,కొన్ని రసాయనాలు లేదా ఎథలీన్ గ్యాస్ వంటి వాటితో నిగనిగలాడే  చక్కని రూపం తీసుకొచ్చి వినియోగదారుడిని బోల్తా కొట్టిస్తున్నాడు.అటువంటి పండ్లు తీసుకొని ప్రజలు ప్రమాదంలో పడుతున్నారు . దీని వల్ల వారి  ఆరోగ్యం పాడవుతుంది,వ్యాపారాలు జేబు నిండుతుంది. ఇటువంటి సంఘటనలు చూసి ప్రజలకు మంచి చేయాలనే మంచి సంకల్పంతో  సేంద్రియ పద...