"భగవాన్ ... సర్ ...స్ఫూర్తి దాయకం .... "

"భగవాన్ ... సర్ ...స్ఫూర్తి దాయకం .... "


మనం స్కూల్ కి వెళితే అక్కడ ,టీచరో పాఠాలు నేర్పిస్తారు ,
కొందరు విద్యతో పాటు వినయం , మంచి గా ఉండటం  నేర్పుతారు  ,
కానీ ఇప్పుడు చెప్పబోయే మాస్టారు  పేరు "భగవాన్ " మాస్టారు ,నిజంగా   పిల్లల పాలిట 
భగవానుడే !
 తమిళనాడు లో వెలిగ్రామం ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల లో ఇంగ్లీష్ మాస్టారుగా 2014 నుంచి పని చేస్తున్నాడు . 
అతను పిల్లలకి  పాఠాలతో పాటు ,జీవితం లో ఎలా పైకి రావాలి, కష్టపెడితే సాదించలేనిది ఏది లేదు .. అలాంటి విషయాలను "ప్రొజెక్టర్ "వేసి చూపించే వారు . 
ఇంగ్లీష్ తో పాటు మిగిలిన సబ్జక్ట్స్ లో కూడా అర్ధం అయ్యే లా  చెప్పే వారు . 

పిల్లలని స్కూల్ కి రాగానే ఆప్యాయం గా "టిఫిన్ "తిన్నారా ? అని అడిగి ,తినకపోతే వారికీ తన డబ్బుతో అల్పాహారం ఇచ్చేవారు . 
తిండి తినకపోతే , కాళీ పొట్టతో, ఏకాగ్రత లేకపోతె చెప్పే పాఠం బుర్రలోకి ఎలా  వెళుతుంది? అని అడిగేవారు. తను కూడా పేద విద్యార్థి కదా !ఆ బాధ తనకి తెలుసు 

వారితో  ఒక అన్న గా ,మిత్రుడి గా  మెలిగే వారు . 
కానీ ప్రభుత్వ ఆదేశాలు మేరకు అతనికి వేరే ఊరు బదిలీ అయ్యింది . 

అది విని పిల్లలు కలవరం చెంది వారి మాస్టారిని వెళ్లనీయకుండా పట్టుకుని ,కదలనివ్వకుండా ఏడ్చేశారు . ఆ ఆప్యాయత తో మాస్టారుకుడా కన్నీరు మున్నీరు అయ్యారు . 
స్కూల్ లో ఏడుపులు , అరుపులు విని బయట ఉన్న వారి తల్లి తండ్రులు వచ్చి ఏమి జరిగింది ?అని తెలుసుకుని వారు కుడా మిమ్మలిని వెళ్లనీయం అని ఆపేసారు 
ఈ విషయం తెలిసిన సర్కార్ వారి బదిలీ పదిరోజులు నిలుపు చేసింది ... 

ఇంతకంటే ఒక "మాస్టారిగా "ఇంకా ఏమి కావాలి . 
శ్రీ గురుబ్యోన్నమః .... 

నిజంగా "భగవాన్ గారు " మీకు వందనం 

Comments

Popular posts from this blog

జవాబు లేని ప్రశ్న ?

నేను చెప్పానా !!

గబ్బా లో ఆసీస్ కి దెబ్బ !!