పవన్ కళ్యాణ్ ... "పొలిటికల్ పంజా " విసురుతాడా ??



"పవన్ కళ్యాణ్" ... నిన్నటివరకు సినీ విలాకాశంలో "పవర్ స్టార్ "అని అభిమానులు ముద్దుగా పిలుచు కునే  వారు ,ఇప్పుడు తన సినీ ప్రపంచం వదిలి  "ప్రజల సేవకోసం" జనసేన పార్టీ తో ప్రజల్లోకి వచ్చారు .

పార్టీ ఐతే పెట్టారు కానీ ,దానిలో ఆయన ఒక్కడే !!
నాలుగు వసంతాలు గడిచిన ప్రత్యక్ష పోటీలో లేరు .
క్రితం ఎన్నికల్లో "తెలుగు దేశం "కి మద్దతు ఇచ్చారు .
పార్టీ బలం కార్యకర్తలే ,కాబట్టి  పార్టీ లోకి సభ్యత్వం కోసం "మిస్ కాల్ "తో జాయిన్ అయ్యేలా చేసారు.

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి "పోరాట యాత్ర " మొదలు పెట్టి "శ్రీకాకుళం లో "పర్యటించి  అక్కడ ఉన్న "ఉద్దానం "కిడ్నీ సమస్య కోసం పోరాటం చేసారు .

ఇది ఇలా  ఉంటె వచ్చే ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం .

"భారతీయ జనతా పార్టీ " ఆంధ్రా కు "ప్రత్యేక హోదా "ఇస్తామని మాటతప్పారని  దుమ్మెత్తిపోశారు.
అనుభవం ఉంది కదా అని గతం లో  "టి డి పి " కి మద్దతు ఇస్తే వారు ఏమి చేయలేకపోయారని  విమర్శలు  గుప్పిస్తున్నారు .

ప్రభుత్వం,ప్రతిపక్షం కు  రాజకీయాలు తప్ప ప్రజాసమస్యలు ,ప్రజలను గాలికి వదిలేశారని తనకి అవకాశం ఇస్తే "మంచి పరిపాలన" చేస్తానని అంటున్నారు .

కానీ ప్రభుత్వం విమర్శలని తిప్పి కొట్టాలని చూసింది , ప్రజా మద్దతు "జనసేన "కి బాగానే ఉంది ..
ఎన్నికల్లో భీకర పోరాటం చేయక పోయిన "ఓట్లు "మాత్రం తప్పక చీలుతాయి .
ఇప్పడు ఆ విషయం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు .

చూడాలి పవన్ "పొలిటికల్ పంజా" విసురుతాడో లేదో !!

Comments

Popular posts from this blog

జవాబు లేని ప్రశ్న ?