జవాబు లేని ప్రశ్న ?


రిజర్వేషన్ ఇవ్వడానికి తమకు ఇబ్బంది లేదని ,కానీ ఇస్తే అన్ని కుల,వర్గాలు వారికీ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ,వ్యాపారాలు,పెద్ద పెద్ద సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని " నితిన్ గడ్కరీ" అన్నారు .
దాన్ని అదును గా చూసి 'రాహుల్ గాంధీ' ఒక అడుగు ముందుకు వేసి "మంచి ప్రశ్న  వేశారు ,దేశం అంతా  అదే ప్రశ్న ఎప్పటినుంచో అడుగుతున్నారు ,"మీరు(భారతీయ జనతా పార్టీ ) మాత్రమే బదులివ్వవలిసిన ప్రశ్న " ఇది అని చురక అంటించారు .

మా  ప్రభుత్వం వచ్చాక చాలా  ఉద్యోగాలు వచ్చాయని చెప్పే "మోడీ" సర్కార్  ఇప్పుడు ఏమి చెబుతారో ?
"జి ఎస్ టి " లాంటివి వల్ల  చాలా చిన్న  కంపెనీలు దెబ్బతిన్నాయి ,దాని ద్వారా సుమారు 5000 మంది  గుజరాత్ లోనే ఉపాధి కోల్పోయారు అనేది నిజం .
మరి ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో జరిగితే ,యువతకి ఉపాధి ఏది ?

నేను 'జి ఎస్ టి' కి వ్యతిరేకం కాదు ,కానీ దానికి ప్రత్యామ్యాయం ఏమిటి అనేది చూడాలి . 

యువత కి ఉపాధి లేకపోతె వారు పక్కదోవ పట్టి వారి జీవితాలను నాశనం చేసుకుంటారు . 
అలా చూడటం మీకు ఇష్టమా ?

ఎన్నికలు వస్తున్నాయని హడావిడి గా పథకాలు ప్రకటించేసి తూతూ మంత్రిగా మొదలు  పెట్టి జనాలని ఏ సర్కార్ ఐనా ఎన్నాళ్లు మభ్యపెడతారు ?

జనం కూడా మారారు ,మార్పు ఎన్నికల్లో చూపించితీరుతారు !

Comments

  1. జనం మారుతారు కాని ఈ నాయకమ్మన్యులు మారుతారా నిజంగా అన్నదే సమస్య దేశానికి!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పవన్ కళ్యాణ్ ... "పొలిటికల్ పంజా " విసురుతాడా ??