Posts

వెంకి రూట్ మార్చాడా ?

Image
తెలుగు సినీ ప్రపంచం లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న "విక్టరీ వెంకటేష్" ఈ మధ్య సినిమాలు అంతగా ఆడటం లేదు ,ఏమి అనుకున్నాడో ఏమో కానీ కొంచెం విరామం తీసుకున్నాడు . ఇప్పుడు మల్టి స్టారర్ గా "వరుణ్ తేజ్ " తో "ఎఫ్ 2" (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) జత కట్టారు . అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు .  అనిల్ "రాజా ది గ్రేట్ "తరువాత చేస్తున్న  సినిమా ఇది. దిల్ రాజు నిర్మా తగా "వరుణ్ "కి మూడవ చిత్రం . హీరోయిన్ గా మెహ్రయిన్ చేస్తున్నారు  !! ఈ కార్యక్రమం  లో అల్లు అరవింద్ పాల్గున్నారు . 

ఈ బ్యాంకులకు ఏమైంది ?

Image
సామాన్య ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి,రూపాయి పోగుచేసి సంపాదించినదంతా   దాచుకోవడానికి గతంలో బ్యాంకు లో జమ వేసేవారు .  చీటీలు కడితే గ్యారంటీ లేదని కొందరు ,రిస్క్ చేయలేక కొందరు బ్యాంకు లో వేసేవారు .  ఇప్పుడు కధ  మారింది ! నగదు అరికట్టాలని,నల్లధనం పాలత్రోలనో మన మోడీ సర్ "డిమానిటైజేషన్ " అమలు చేసారు . అది ఇంతవరకు ఏమి సాధించారో గాని ప్రజలు మాత్రం చిక్కులు ఇంకా కొనసాగుతున్నాయి .  నగదు వేసినా  బాదుడు ,తీస్తే బాదుడు . మన డబ్బు మనం తీసుకున్న తప్పే !? "ఏ .టి. ఎమ్" లో ఎప్పుడు డబ్బు ఉంటుందో ఆ దేవుడికే ఎరుక !! "నో కాష్ " బోర్డులు వెక్కిరిస్తాయి . రెండు కిలోమీటర్లు తిరిగితే మీ అదృష్టం బాగుంటే డబ్బు ఉంటుంది ,వస్తుంది . లేదంటే చీటీ వెక్కిరిస్తుంది (నగదు లేదని ).  ఈ మధ్య బ్యాంకు లో డబ్బు ఉన్నా కూడా దానికి కూడా "డబ్బు కత్తిరించారట" ఎస్. బి. ఐ  వారు !! అది తెలిసి ఆ వినియోగదారుడు బ్యాంకు కి ఘాటుగా లేఖ రాసి ,అకౌంట్ మూసివేసాడు .  డిజిటైజేషన్  చేయండి మంచిదే ...

సమ్మోహనం ...

Image
తెలుగు సినిమా ప్రేక్షకులకి ఒక తెలియని అనుభూతి ,ఎన్నో ప్రేమ కధలు చూసాం కానీ ఇది దానికి కొంచెం ఎక్కువే !(నా ఫీలింగ్) సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు తరువాత ఇప్పుడు వీడి సమీక్ష ఎవడికి కావాలి అనుకుంటే పొరపాటే !! సగటు సినిమా పిచ్చి ఉన్న అభిమానిగా రాస్తున్నా ... రాయకుండా ఉండలేక పోతున్నా ! అనగనగ అందమైన కుటుంబం ... అమ్మ ,నాన్న ,చెల్లి,మన హీరో .. విజయకుమార్ (సుదీర్ బాబు ). విజయ్ కి బొమ్మలు వేయడం అంటే ఇష్టం,పిల్లలకి కథలతో కూడిన బొమ్మలు వేసి పుస్తకం ప్రచురించాలని లక్ష్యం  !అది వారికీ విజ్ఞానం ఇస్తుంది అని నమ్మకం . తనకి సినిమాలు అంటే మంచి అభిప్రాయం ఉండదు ,పడదు ,వారిది అంతా నటన అనే అభిప్రాయం ,కానీ తన స్నేహితులకి ఆ సినిమాలే ఇష్టం . ఒక షూటింగ్ నిమిత్తం వీరి ఇల్లు 20 రోజులు కావాలని సినిమా వాళ్ళు అడగ్గా తండ్రి (నరేష్ )ఒక కండిషన్ పెడతాడు ,అదే తనకి చిన్న వేషం ఇవ్వాలని !!ఓకే అంటారు . ఆ సినిమా లో హీరోయిన్ "సమీరా"(అదితిరావు )ని చూస్తాడు ,తనకి తెలుగు రాదని నవ్వుకుంటాడు . తనకి తెలుగు నేర్పమని అడగ్గా సరే అంటాడు . అలా  కొన్ని రోజులకి వారి పరిచయం,స్నేహం గా ...

ఈ కుర్రాళ్ల డాన్స్ చూడండి

ఈ కుర్రాళ్ల డాన్స్ చూడండి ...పిచ్చి ఎక్కించారు !! లింక్  క్లిక్  చేయండి ....  https://www.youtube.com/watch?v=IoeeeIl7r8w

మలేషియా లో పెట్రోనాస్ టవర్స్ చూసారా ??

Image
మలేషియా లో పెట్రోనాస్ టవర్స్ చూసారా ? ఐతే ఒక లుక్ వేద్దాం రండి ! మలేషియా కౌలాలంపూర్ వుండే ఈ ప్రసిద్ధ కట్టడాన్ని "పెట్రోనాస్ టవర్స్ " లేక "పెట్రోనాస్ ట్విన్ టవర్స్" అంటారు . 2014 వరకు ఈ టవర్స్"  ప్రపంచంలోకెల్లా ఎతైన టవర్స్. దీనిలో సుమారు 90 ఫ్లోర్స్ ఉంటాయి ,40లిఫ్ట్స్ పని చేస్తాయి . ప్రభుత్వ కార్యాలన్నీ దీనిలో ఉంటాయి . ఈ టవర్ ని అర్జెంటైనా చెంది "సీసర్ పిళ్ళై " డిజైన్ చేసారు . దీని ప్లానింగ్ జనవరి 1,1992 మొదలు పెట్టారు .ఏడు సంవత్సరాల కఠిన శ్రమతో 1993 మార్చి 1న పూర్తయింది . సూపర్ స్ట్రక్చర్ 1994 ఏప్రిల్ ఒకటి న ముగిసింది . ఇంటీరియర్ ,ఫర్నిచర్ కలిపి  జనవరి ఒకటి 1996కి ముగిసింది . టవర్ 1 మరియు టవర్ 2 కలిపి మర్చి ఒకటి 1996 పూర్తి  అయ్యింది ,అధికారికంగా అక్కడ ప్రధాని చేతుల మీద 1999 ఆగష్టు 1న ప్రారంభించారు .

పవన్ కళ్యాణ్ ... "పొలిటికల్ పంజా " విసురుతాడా ??

Image
"పవన్ కళ్యాణ్" ... నిన్నటివరకు సినీ విలాకాశంలో "పవర్ స్టార్ "అని అభిమానులు ముద్దుగా పిలుచు కునే  వారు ,ఇప్పుడు తన సినీ ప్రపంచం వదిలి  "ప్రజల సేవకోసం" జనసేన పార్టీ తో ప్రజల్లోకి వచ్చారు . పార్టీ ఐతే పెట్టారు కానీ ,దానిలో ఆయన ఒక్కడే !! నాలుగు వసంతాలు గడిచిన ప్రత్యక్ష పోటీలో లేరు . క్రితం ఎన్నికల్లో "తెలుగు దేశం "కి మద్దతు ఇచ్చారు . పార్టీ బలం కార్యకర్తలే ,కాబట్టి  పార్టీ లోకి సభ్యత్వం కోసం "మిస్ కాల్ "తో జాయిన్ అయ్యేలా చేసారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి "పోరాట యాత్ర " మొదలు పెట్టి "శ్రీకాకుళం లో "పర్యటించి  అక్కడ ఉన్న "ఉద్దానం "కిడ్నీ సమస్య కోసం పోరాటం చేసారు . ఇది ఇలా  ఉంటె వచ్చే ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం . "భారతీయ జనతా పార్టీ " ఆంధ్రా కు "ప్రత్యేక హోదా "ఇస్తామని మాటతప్పారని  దుమ్మెత్తిపోశారు. అనుభవం ఉంది కదా అని గతం లో  "టి డి పి " కి మద్దతు ఇస్తే వారు ఏమి చేయలేకపోయారని  విమర్శలు  గుప్పిస్తున్నారు . ప్రభుత్వం,ప్రతిపక్షం కు  ర...

"భగవాన్ ... సర్ ...స్ఫూర్తి దాయకం .... "

Image
"భగవాన్ ... సర్ ...స్ఫూర్తి దాయకం .... " మనం స్కూల్ కి వెళితే అక్కడ ,టీచరో పాఠాలు నేర్పిస్తారు , కొందరు విద్యతో పాటు వినయం , మంచి గా ఉండటం  నేర్పుతారు  , కానీ ఇప్పుడు చెప్పబోయే మాస్టారు  పేరు "భగవాన్ " మాస్టారు ,నిజంగా   పిల్లల పాలిట  భగవానుడే !  తమిళనాడు లో వెలిగ్రామం ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల లో ఇంగ్లీష్ మాస్టారుగా 2014 నుంచి పని చేస్తున్నాడు .  అతను పిల్లలకి  పాఠాలతో పాటు ,జీవితం లో ఎలా పైకి రావాలి, కష్టపెడితే సాదించలేనిది ఏది లేదు .. అలాంటి విషయాలను "ప్రొజెక్టర్ "వేసి చూపించే వారు .  ఇంగ్లీష్ తో పాటు మిగిలిన సబ్జక్ట్స్ లో కూడా అర్ధం అయ్యే లా  చెప్పే వారు .  పిల్లలని స్కూల్ కి రాగానే ఆప్యాయం గా "టిఫిన్ "తిన్నారా ? అని అడిగి ,తినకపోతే వారికీ తన డబ్బుతో అల్పాహారం ఇచ్చేవారు .  తిండి తినకపోతే , కాళీ పొట్టతో, ఏకాగ్రత లేకపోతె చెప్పే పాఠం బుర్రలోకి ఎలా  వెళుతుంది? అని అడిగేవారు. తను కూడా పేద విద్యార్థి కదా !ఆ బాధ తనకి తెలుసు  వారితో  ఒక అన్న ...