Posts

చిరునవ్వుతో - పార్ట్ 1

Image
"పచ్చటి పొలాలు మధ్యలో కొన్ని ఇళ్ళు ,దానిలో ఒక చిన్న డాబా .ఆ ఇంట్లో నేను       (రాంకి ),చెల్లి ,అమ్మనాన్న".  చిన్న కుటుంబం చింతలేని కుటుంబం . తెల్లవారితె గబగబా లేచి రెడీ అయ్యి బడికి పరుగు.  సాయంత్రం ఇంటికి చేరి కాసేపు ఆటలు,బడిలో ఇచ్చిన పని ముగించి పడుకోవడం ,ఇది నా దిన చర్య. ఆలా కొంతకాలం గడిచింది.  పదివరకు ఊరి బడి లో  చదువుకొని ఇంటర్ పక్కనున్న టౌన్ కి బయలుదేరాను .ఇంటర్లో బాగా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నా.తరువాత ఇంజనీరింగ్  సీటు తెచ్చుకొని హైదరాబాద్ పయనమయ్యా!  బస్ లో బయలుదేరి భాగ్యనగరం చేరాను . అక్కడ తన ఫ్రెండ్స్ ఉంటున్న రూమ్ కి చేరి రిలాక్స్ అయ్యా.  ఫ్రెండ్స్ సహకారం తో కోర్స్ జాయిన్ అవడానికి అమీర్ పేట్ కి వెళ్లి అన్ని కోర్స్ లు గురించి తెలుసుకొని ఒక కోర్స్ జాయిన్ అవ్వడానికి డిసైడ్ అయ్యాను.  రెండు  రోజులు తరువాత  "హాయ్ " అనే పలకరింపు ఇంపుగా వినపడింది ,ఎవరని పక్కకి తలతిప్పి చూసా! చక్కని నవ్వు ,నుదుట కుంకుమ బొట్టు ,చేతిలో పుస్తకాలతో 'మోడరన్ మహాలక్ష్మి'లా ఉంది.  "నేను కొత్తగా హైదరాబాద్...

సింగర్ సునీత రెండో పెళ్ళి!!

Image
గాయనిగా ,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా  "సునీత" టాలీవుడ్ లో  తనకంటూ ప్రత్యేక  స్థానం ఉంది,కానీ ఆమె  వ్యక్తిగత జీవితం ఆటుపోట్లు గా సాగింది .ఆమె  కిరణ్ అనే వ్యక్తి ని  వివాహమ్ చేసుకున్నారు ,వివిధ కారణాల వల్ల  భర్త  తో విడిపోయారు ,వారికీ ఒక పాప ఉంది . ఇప్పుడు ఆమె (సెకండ్ ఇన్నింగ్స్ )రెండో వివాహం  ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ తో అని తేలింది . ఆమె జీవితం సుఖంగా ఉండాలని ఆశిద్దాం!!  

బిగ్ బాస్ లో "సరదాలు "...

Image
చాలా వారాలు  తరువాత "బిగ్ బాస్" షో లో  "నవ్వులు విరిసాయి . ఇన్ని వారాలు షో లో ఎప్పుడూ టాస్క్లు ,గొడవలు లేకపోతె నాని తో క్లాస్ . మొన్న వారం కాస్త ఉపశమనం అనే చెప్పాలి . ఐస్ మీద నిలబడి బౌల్ లో చీటీ చూసి దానిలో  ఉన్న పాట "సంజ్ఞలతో " చేసి చూపించాలి . మాటలాడకూడదు . మొదటిది హౌస్ లో ఉన్న సభ్యులు చెప్పాలి, రెండోది "నాని " చెప్పాలి ,అలా హాయిగా నవ్వులతో సాగింది . నాని కూడా బాగా అలవాటు పడి టెన్షన్ లేకుండా చేస్తున్నారు . ఏది ఏమైనా మొదటి భాగం తో పోలిస్తే కాస్త వెనుక పడింది అనే చెప్పాలి . భాను నిష్క్రమణ దాదాపు అందరూ ఊహించిందే . ఈ  వారం లో "బిగ్ బాస్" అందరితో "సినిమా " తీయాలి అనే టాస్క్ ఇచ్చారు , దానికి అమిత్ దర్శకుడు ,దీప్తి సహాదర్శకురాలు ,రోల్ రెడా కెమెరా ,తేజస్వి నృత్య దర్శకురాలు ,మేకప్ ,కాస్ట్యూమ్స్ . దర్శకుడు, సహాదర్శకురాలు కలిసి ఒక కాన్సెప్ట్ అనుకొని కథ  కధనం తయారు చేసి రూపకల్పన చేయాలి . ఆడిషన్స్ అయ్యాక కౌశల్ ,తనీష్ ,సామ్రాట్ ఎంపికచేసుకొన్నారు ,వారు స్నేహితులు గా ఒక కథ  నడుస్తుంది . కౌశల్ కి నందిని పరిచయం అయ్యి తనీష్ ని దూ...

సంగీతం ఎంత మధురం

Image
బాగా అలసిన మనిషికి ,వాడి మనసుకి వీనుల విందైన సంగీతం ఎంత మధురం గా ఉంటుందో !! ఆ విషయం  ఈ మధ్య నాకు బాగా తెలిసింది . కాసేపు పాతపాటలు మరికొద్దిసేపు మెలోడీ వింటే, ఆ ఉల్లాసం ఉత్సాహం వేరు. ఈ మధ్యకాలం లో పాటలు అంత ప్రభావం లేవు అనే చెప్పాలి ,"ఓల్డ్ ఈజ్ గోల్డ్" అన్నారు అందుకేనేమో పెద్దలు . చిన్నపుడు పాటల పుస్తకాలు  కొని అవి చదివి నేర్చుకొని 'హమ్' చేసేవాళ్ళం , ఈ కాలం పిల్లలకి తెలీదు కదా ! ముంబై లో ఉన్నపుడు కూడా రోజు ఉదయం  పాటలు వింటూ ఆఫీస్ కి వెళ్లడం రావడం ,ఐనా ఆ పాటలు బోర్ కొట్టేది కాదు .టైం అసలు తెలిసేది కాదు . వీలు ఉంటె మీరు ట్రై చేయండి ...

నేను చెప్పానా !!

నేను చెప్పానా !!  చేసిన ప్రతి పనికి  ఫలితం తప్పక ఉంటుందని ! నోరు జారిన  ప్రతిఫలంగా "కత్తి మహేష్" కి ఆరునెలలు నగర  బహిష్కరణ విధించారు . ఇంకా అదుపులేకుండా వాగితే శాశ్వతంగా నగరం నుంచి బయటకి తోలేస్తారని సాక్షాత్తు డి. జి. పి వివరించారు , వాక్కు స్వతంత్రం ఉంది కదా అని,ఇష్టం వచ్చినట్లు  మాట్లాడి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్న కారణంగా ఈ విధంగా చేయవలసి వచ్చిందని చెప్పారు

"కత్తి మహేష్ "- వీడికి పని లేదు

Image
ఈ మధ్య అందరి నోట్లో ఒక్కటే చర్చ అదే "కత్తి మహేష్ " రాముడిని అనరాని  మాటలు  అన్నాడు అని ! నాకు రాముడు అంటే ఇష్టమైన  దైవం,ధర్మం గా ఎలా ఉండాలో నరుడు గా చూపించిన మహనీయుడు . రామాయణం అంటే ఏమిటో కూడా తెలీదు కానీ రాముడు గురించి ప్రతివాడు తీర్పు చెప్పేస్తాడు . "రామో విగ్రహవాన్ ధర్మః ",రాముడు  అంటే పోతపోసిన ధర్మం . అలాంటి దారిలో నడవటాని అందరు ప్రయత్నిస్తారు  కానీ ఒక విషయం నాకు తోచింది ,,, కత్తి మహేష్ కి  పనిపాట లేక టి వి ఛానల్ వాళ్ళు డబ్బు ఇస్తే లేక ఉచితం గా పబ్లిసిటీ కోసం నటుల్ని ,దేవుణ్ణి దూషిస్తునాడు . అలాంటి  వాడిని చూసి అసహ్యం కలుగుతుంది కానీ మనం ఓర్పు వహించాలి .  దేవుడు అందరికి నోరు ఇచ్చాడు కానీ సద్వినియోగం చేసుకుంటే పుణ్యాత్ముడు అవుతాడు లేకపోతె దూర్తుడు గా మిగిలిపోతాడు ,వాడు తిడితే మనం అరిస్తే  వాడు  వాడికి మనకి తేడా ఏముంటుంది ?! ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది అది మంచి ఐనా చెడు  ఐనా ,దానికి ఎవరు అతీతులు కారు ,కాస్త ఓర్పు ,సహనం ఉంటె కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది.  

వెంకి రూట్ మార్చాడా ?

Image
తెలుగు సినీ ప్రపంచం లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న "విక్టరీ వెంకటేష్" ఈ మధ్య సినిమాలు అంతగా ఆడటం లేదు ,ఏమి అనుకున్నాడో ఏమో కానీ కొంచెం విరామం తీసుకున్నాడు . ఇప్పుడు మల్టి స్టారర్ గా "వరుణ్ తేజ్ " తో "ఎఫ్ 2" (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) జత కట్టారు . అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు .  అనిల్ "రాజా ది గ్రేట్ "తరువాత చేస్తున్న  సినిమా ఇది. దిల్ రాజు నిర్మా తగా "వరుణ్ "కి మూడవ చిత్రం . హీరోయిన్ గా మెహ్రయిన్ చేస్తున్నారు  !! ఈ కార్యక్రమం  లో అల్లు అరవింద్ పాల్గున్నారు .