Posts

ఆంధ్ర ప్రదేశ్ తో కేంద్రం "అవిశ్వాసం తీర్మానం "గెలిచింది !

Image
ఇన్నాళ్లు తెలుగు దేశం ,వై సి పి ,మిగతా పార్టీలు రాష్ట్ర విభజన సరిగా జరగలేదు ,దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ,  ఇప్పటి ప్రభుత్వం భాజపా "స్పెషల్ స్టేటస్ "ఇవ్వలేదని వారిమీదికి మీద తోసేశారు ,కానీ దీనికి సమాధానం గా మొన్న పార్లమెంట్ లో బిజెపి ఎదురుదాడి చేసింది . తెలుగు దేశం తో సహా వామ పక్షాలు కి  కౌంటర్ గా  బిజెపి కి అవిశ్వాసం తీర్మానం పెట్టింది . దానికి మోడీ సహా అందరు కలిసి అవిశ్వాసం గెలిపించారు ,సహజంగా ఎక్కువ సభ్యులు ఉన్నవారు గెలుస్తారు అదే జరిగింది . కొన్ని రాష్ట్రాలు మనకి మద్దతు ఇవ్వలేదు, కొందరు దూరం గా ఉన్నారు . ఇన్నాళ్లు మౌనం గా ఉన్న "మోడీ" పార్లమెంట్లు లో "స్పెషల్ కేటగిరి స్టేటస్ ఇవ్వడం కుదరదని దాని స్థానం లో "స్పెషల్ ప్యాకేజీ " ఇస్తామని చెబితె ఆంధ్ర ప్రభుత్వం "చంద్రబాబు " సరే అన్నారని "ఆరోపించింది .దానికి "చంద్రబాబు "ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిన ఫలితం లేదు . మరి ఎవరి   లోపాలవల్ల మనకి "స్టేటస్ "రాలేదు ??

మీ కెరీర్ ఏమి ఎంచుకున్నారు ?

Image
హలో  మిత్రులారా !! మీకు బ్లాగ్ రాయడం హాబీ నా లేక సరదాగా రాస్తారా ? మీ కెరీర్ ఏమి ఎంచుకున్నారు ? మీలో  ఎవరైనా రచయితలు   ఉద్యోగ అవకాశాలు కోసం చూస్తూ ఉంటె నాది  చిన్న విన్నపం .  ఈ లింక్ లో "కంటెంట్ రైటర్స్-తెలుగు ,ఇంగ్లీష్  " అవకాశాలు ఉన్నాయి,చూసి నచ్చితే మీ బయో-డేటా పంపండి  https://www.naukri.com/telugu-content-writer-jobs.  అలాగే  https://www.quikr.com/jobs/telugu-content-writer-jobs-in-hyderabad+hyderabad+zwqxj4157493934 శుభం భూయాత్ .... 

పెద్ద పొరపాటు !!

Image
మనం ఏదైనా పని చేసేముందు కొంచెం బెరుకు ఉంటుంది ,అదే సాధిస్తామా లేదా  అనే చిన్న భయం వెంటాడుతుంది .కానీ ప్రయత్నం కూడా సరిగ్గా చేయకుండా ఫలితం ఆలోచించకూడదు . నువ్వు చేసి ప్రయత్నం పట్టుదలగా,త్రికరణ శుద్ధిగా చేస్తే నీదే విజయం !!  ఇదే పూజ్యగురువులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు  పదే పదే చెబుతుంటారు . ఓడిపోవడం తప్పు కాదు కానీ ప్రయత్నమే చేయకపోతే ఇంకాపెద్ద పొరపాటు .

నాన్న కూచి !!

Image
ఎంత సూపర్ స్టార్ ఐనా కూతురు అంటే ప్రేమ ,ఆప్యాయత లేకుండా ఎలా ఉంటారు !! దానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ వేరు కాదు కదా !! తన కూతురు "సితార పుట్టిన రోజు " వేడుకల్లో ఇలా .... 

సింగర్ సునీత రెండో పెళ్లి ... నిజం కాదు

నిన్న ప్రచురించిన సింగర్ సునీతా రెండో వివాహం మీద ఆమె స్పందించారు ,ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదని,ఎవరో కావాలని పుకార్లు చేస్తున్నారని ,తమ వ్యక్తిగత  వారికీ ఎందుకు అంత కుతూహలం? అని ఆవేదన చెందారు . తనకి అటువంటి ఉద్దేశం లేదని చెప్పారు .

చిరునవ్వుతో - పార్ట్ 1

Image
"పచ్చటి పొలాలు మధ్యలో కొన్ని ఇళ్ళు ,దానిలో ఒక చిన్న డాబా .ఆ ఇంట్లో నేను       (రాంకి ),చెల్లి ,అమ్మనాన్న".  చిన్న కుటుంబం చింతలేని కుటుంబం . తెల్లవారితె గబగబా లేచి రెడీ అయ్యి బడికి పరుగు.  సాయంత్రం ఇంటికి చేరి కాసేపు ఆటలు,బడిలో ఇచ్చిన పని ముగించి పడుకోవడం ,ఇది నా దిన చర్య. ఆలా కొంతకాలం గడిచింది.  పదివరకు ఊరి బడి లో  చదువుకొని ఇంటర్ పక్కనున్న టౌన్ కి బయలుదేరాను .ఇంటర్లో బాగా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నా.తరువాత ఇంజనీరింగ్  సీటు తెచ్చుకొని హైదరాబాద్ పయనమయ్యా!  బస్ లో బయలుదేరి భాగ్యనగరం చేరాను . అక్కడ తన ఫ్రెండ్స్ ఉంటున్న రూమ్ కి చేరి రిలాక్స్ అయ్యా.  ఫ్రెండ్స్ సహకారం తో కోర్స్ జాయిన్ అవడానికి అమీర్ పేట్ కి వెళ్లి అన్ని కోర్స్ లు గురించి తెలుసుకొని ఒక కోర్స్ జాయిన్ అవ్వడానికి డిసైడ్ అయ్యాను.  రెండు  రోజులు తరువాత  "హాయ్ " అనే పలకరింపు ఇంపుగా వినపడింది ,ఎవరని పక్కకి తలతిప్పి చూసా! చక్కని నవ్వు ,నుదుట కుంకుమ బొట్టు ,చేతిలో పుస్తకాలతో 'మోడరన్ మహాలక్ష్మి'లా ఉంది.  "నేను కొత్తగా హైదరాబాద్...

సింగర్ సునీత రెండో పెళ్ళి!!

Image
గాయనిగా ,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా  "సునీత" టాలీవుడ్ లో  తనకంటూ ప్రత్యేక  స్థానం ఉంది,కానీ ఆమె  వ్యక్తిగత జీవితం ఆటుపోట్లు గా సాగింది .ఆమె  కిరణ్ అనే వ్యక్తి ని  వివాహమ్ చేసుకున్నారు ,వివిధ కారణాల వల్ల  భర్త  తో విడిపోయారు ,వారికీ ఒక పాప ఉంది . ఇప్పుడు ఆమె (సెకండ్ ఇన్నింగ్స్ )రెండో వివాహం  ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ తో అని తేలింది . ఆమె జీవితం సుఖంగా ఉండాలని ఆశిద్దాం!!