Posts

పవన్ కళ్యాణ్ ... "పొలిటికల్ పంజా " విసురుతాడా ??

Image
"పవన్ కళ్యాణ్" ... నిన్నటివరకు సినీ విలాకాశంలో "పవర్ స్టార్ "అని అభిమానులు ముద్దుగా పిలుచు కునే  వారు ,ఇప్పుడు తన సినీ ప్రపంచం వదిలి  "ప్రజల సేవకోసం" జనసేన పార్టీ తో ప్రజల్లోకి వచ్చారు . పార్టీ ఐతే పెట్టారు కానీ ,దానిలో ఆయన ఒక్కడే !! నాలుగు వసంతాలు గడిచిన ప్రత్యక్ష పోటీలో లేరు . క్రితం ఎన్నికల్లో "తెలుగు దేశం "కి మద్దతు ఇచ్చారు . పార్టీ బలం కార్యకర్తలే ,కాబట్టి  పార్టీ లోకి సభ్యత్వం కోసం "మిస్ కాల్ "తో జాయిన్ అయ్యేలా చేసారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి "పోరాట యాత్ర " మొదలు పెట్టి "శ్రీకాకుళం లో "పర్యటించి  అక్కడ ఉన్న "ఉద్దానం "కిడ్నీ సమస్య కోసం పోరాటం చేసారు . ఇది ఇలా  ఉంటె వచ్చే ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం . "భారతీయ జనతా పార్టీ " ఆంధ్రా కు "ప్రత్యేక హోదా "ఇస్తామని మాటతప్పారని  దుమ్మెత్తిపోశారు. అనుభవం ఉంది కదా అని గతం లో  "టి డి పి " కి మద్దతు ఇస్తే వారు ఏమి చేయలేకపోయారని  విమర్శలు  గుప్పిస్తున్నారు . ప్రభుత్వం,ప్రతిపక్షం కు  ర...

"భగవాన్ ... సర్ ...స్ఫూర్తి దాయకం .... "

Image
"భగవాన్ ... సర్ ...స్ఫూర్తి దాయకం .... " మనం స్కూల్ కి వెళితే అక్కడ ,టీచరో పాఠాలు నేర్పిస్తారు , కొందరు విద్యతో పాటు వినయం , మంచి గా ఉండటం  నేర్పుతారు  , కానీ ఇప్పుడు చెప్పబోయే మాస్టారు  పేరు "భగవాన్ " మాస్టారు ,నిజంగా   పిల్లల పాలిట  భగవానుడే !  తమిళనాడు లో వెలిగ్రామం ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల లో ఇంగ్లీష్ మాస్టారుగా 2014 నుంచి పని చేస్తున్నాడు .  అతను పిల్లలకి  పాఠాలతో పాటు ,జీవితం లో ఎలా పైకి రావాలి, కష్టపెడితే సాదించలేనిది ఏది లేదు .. అలాంటి విషయాలను "ప్రొజెక్టర్ "వేసి చూపించే వారు .  ఇంగ్లీష్ తో పాటు మిగిలిన సబ్జక్ట్స్ లో కూడా అర్ధం అయ్యే లా  చెప్పే వారు .  పిల్లలని స్కూల్ కి రాగానే ఆప్యాయం గా "టిఫిన్ "తిన్నారా ? అని అడిగి ,తినకపోతే వారికీ తన డబ్బుతో అల్పాహారం ఇచ్చేవారు .  తిండి తినకపోతే , కాళీ పొట్టతో, ఏకాగ్రత లేకపోతె చెప్పే పాఠం బుర్రలోకి ఎలా  వెళుతుంది? అని అడిగేవారు. తను కూడా పేద విద్యార్థి కదా !ఆ బాధ తనకి తెలుసు  వారితో  ఒక అన్న ...

సైరా నరసింహారెడ్డి..

Image
సైరా   నరసింహారెడ్డి ... "మెగా స్టార్ చిరంజీవి" తరువాతి చిత్రం , కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ నిర్మాత గా రెండో సినిమా ఇది . ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి  ఆధారంగా తీస్తున్న చిత్రం. నయనతార, జగ పటిబాబు , అమితాబ్ ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నారు ,రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు . ఈ చిత్రాన్ని పలు భాషల్లో కూడా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది . టీం విడుదల చేసిన కొన్ని స్టిల్స్ చూస్తే సినిమా చాలా క్లాస్ గా,రిచ్ గా ఉన్నాయి . తమిళ్ నటుడు  విజయ్ కూడా నటిస్తున్నారు ,ఈ సినిమా లో పోరాట దృశ్యాలు అద్భుతం గా వచ్చాయట! చిరు 151 చిత్రం కోసం హాలీవుడ్ సాకేతిక నిపుణలతో పని చేస్తున్నారు ,ఎలాగైనా చరిత్రలో నిలిచిపోయే విధం గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు , వేచి చూడాలి ఏమి జరుగుతుందో ...!

రాము (రామ్ గోపాల్ వర్మ ) కు పూర్వ వైభవం వస్తుందా !

Image
సినీ చరిత్రలో  దర్శకుల ఎంత మంది ఉ న్నా  ఇతడు వేరు .. కాపి కొడితే కొట్టానని ధైర్యం గా చెబుతాడు , ప్లాప్ ఐన సరే దానికి సీక్వల్ తీస్తాడు .. ఏమైనా అంటే "నా ఇష్టం , ఇష్టం ఉంటె చూడు లేక పొతే  లేదు  "అని అంటాడు , అతడే  రాము (రామ్ గోపాల్ వర్మ ). సంచలనాలికి  మారుపేరు ,మొదట్లో చాలా  మంచి చిత్రాలు (శివ ,క్షణక్షణమ్ లాంటివి  )తీసాడు  ,రాను రాను అతనిలో పస తగ్గింది . తన బుర్రలో వచ్చిన దిక్కుమాలిన ఆలోచనకి కూడా సినిమా చేసి జనాల్లోకి వదలటం మొదలు పెట్టాడు . రామ్ గోపాల్ వర్మ అంటే పడిచచ్చే వాడికి కూడా చచ్చేలా చేసాడు . ఇంకో పక్క ట్విట్టర్ లో షరా మాములే ,ఎవర్ని వదలడు ...  కెలకడం అతని హాబీ !! ఈ మధ పవన్ తో వివాదం,దుమారం  అందరికి తెలిసిందే ... అన్ని కష్టాల్లో ఉన్నా ,బ్రేక్ ఇచ్చిన నాగ్ అవకాశం  ఇస్తే  ,( ఆఫీసర్) తో షాక్ ఇచ్చి న ఘనుడు . "ఈ సినిమా మర్చిపోండి " అని నాగ్ చేతే అనిపించాడు .  రాము కు పూర్వ వైభవం వస్తుందో లేక పొతే కథ ముగుస్తుందో వేచి చూడాలి ....   

బిగ్ బాస్ షో -2 .

ఇంతకూ ముందు బిగ్ బాస్ -1 లో జూనియర్ ఎన్ . టి. ఆర్ . వ్యాఖ్యాత  గాచేసే వారు ,ఇప్పుడు "నాని " వ్యాఖ్యాత  గా వ్యవహరిస్తున్నారు . కొంతమంది హీరో లు ,టి వి నటులు ,కొంతమంది సామాన్యులు ఈ గేమ్ లో ఆడుతున్నారు . సుమారు వంద రోజుల్లో అందరు కలిసి ఆ హౌస్ లో ఉండాలి . బయటకి వెళ్ళటానికి అనుమతి ఉండదు . మైక్ ధరించాలి . ఆందరు అక్కడే ఉండి  వండుకుని ,తిని పడుకోవాలి . బిగ్ బాస్ ఏమి టాస్క్ ఇస్తే అది కూడా చేయాలి ప్రతి వారానికి ఒక కెప్టెన్ ని బిగ్ బాస్ ఎంపిక చేస్తారు . వారి అడుగు జాడల్లో వీరు ఉండాలి ,,కానీ కెప్టెన్ కి ఆ వారం లో  ఎలిమినేషన్ ఉండదు   ఇది ఒకరకమైన మైండ్ గేమ్ అని నా అభిప్రాయం . మన మాటలతో,పనులతో ఎదుటివారిని ఎదో రకం గా బయటకి పంపించాలి  అని చూసే వారు ఎక్కువ . దానికి ఎన్నో వ్యూహాలు రచిస్తారు కానీ కనపడరు ఈ సీజన్ లో నాని ఏంకర్  గా కొత్త ,కానీ  అలవాటు పడుతున్నాడు  నిన్న సంజన అనే అమ్మాయి ని బయటకి పంపించారు , నందిని ఎంట్రీ ఇస్తుంది .  ఈ షో అయ్యే లోపు వారికీ మంచి పేరు ,ప్రఖ్యాతలు ,ఆఫర్లు వస్తున్నాయి . ఇది ...

పచ్చి నిజాలు ...

ప్రతి వాడు పక్కనున్న వాడిని చూసి అలా మనం ఎందుకు లేము , మనకు డబ్బు లేదు ,ఇల్లు లేదు,కారులేదు అని ఎదోరకం గా భాదపడేవారే !!(చాలామంది ) కానీ మనకు ఉన్నదానితో సంతోషం గా ఉండాలని ,కష్ట పడి  పైకి వెళదాం అనుకునే వారు బహు తక్కువ.. ఈజీ మని కావాలి ,పని చేయకూడదు ... అని చాలా మంది యువత ,పెద్దవారు అనుకుంటారు ... అలా ఆలోచించటం వారి ఇష్టం . కానీ ఆలా వచ్చిన డబ్బు . పదవులు   అంత సంతృప్తి ఇవ్వవు  కష్టపడడం ... ఫలితం అదే వస్తుంది అని గ్రహించి ,పెద్దవారు పిల్లలకు నేర్పాలి . ఇవన్నీ సోది లాగా ఉంటుంది గాని పచ్చి నిజాలు ... నమ్మితే మంచిదే ,నమ్మక పోయిన ఇంకా మంచిది .. ఎదో చెప్పాలి అని చిన్న ప్రయత్నం ... నీతిగా ఉండటానికి ప్రయత్నించాలి ,విజయాలు సాదించాలి ...

సమయం వస్తుంది మిత్రమా ... !

ఒకోసారి మన ప్రయత్నం చేసిన ఫలితం రాదు ,మరికొన్నిసార్లు ఏమి చేయకుండానే మంచి ఫలాలు వస్తాయి .  కానీ చేసి పని ,ఎదగడానికి ప్రయత్నం మాత్రం తప్పక చేయాలి , లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.  చల్లని చెట్టు కింద ఉంటె బాగుంటుంది కానీ అదే అలవాటు ఐతే చిన్న వేడిని కూడా తట్టుకోలేము ...  కాబట్టి "కష్టే  ఫలి "...  సమయం సందర్భం వస్తే మంచి ఫలితాలు  అవే వస్తాయి ,ఎల్ల  కాలం ఒకలా ఉండదు గా ...